Bharat Taxi | ర్యాపిడో, ఉబెల్, ఓలాకి షాక్.. జనవరి 1 నుంచి భారత్ ట్యాక్సీ వచ్చేస్తోంది
ఇప్పటికే ఈ యాప్‌లో 56 వేల మంది డ్రైవర్లు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ యాప్ ద్వారా డ్రైవర్లకు ఎక్కువ ఆదాయం వస్తుందని, ఒక రైడ్ పూర్తి కాగానే 80 శాతం ఫేర్ నేరుగా డ్రైవర్లకే వెళ్తుందని, ప్రైవేట్ టాక్సీ యాప్స్ కంటే కూడా ఈ యాప్ ద్వారా చాలా బెటర్‌గా పని చేసే పరిస్థితులు ఉంటాయని తెలుస్తోంది.
ఓలా, ఉబెల్, ర్యాపిడో.. ఇవి బైక్, ఆటో, కారు టాక్సీలు. నగరాల్లో ఇవి లేకుంటే పూట గడవదు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో వెళ్లలేని వాళ్లకు ఈ క్యాబ్ టాక్సీ యాప్స్ సుపరిచితమే. కానీ.. ఈ టాక్సీ యాప్స్ కమిషన్ ఎక్కువగా తీసుకుంటాయి. అందుకే వీటిని ఉపయోగించి ప్రయాణం చేయడానికి కొందరు కస్టమర్లు భయపడుతున్నారు. అందులోనూ వీటిపై ఎలాంటి నియంత్రణ లేదు. ప్రభుత్వాలు కూడా ఈ యాప్స్‌ను పట్టించుకోకపోవడం వల్ల ఆయా యాప్స్ తమకు నచ్చినట్లుగా వినియోగదారుల నుంచి ఫేర్ వసూలు చేస్తున్నాయి. అందుకే కేంద్రం ఈ విషయంలో ముందడుగు వేసి దేశీయ టాక్సీ యాప్ భారత్ టాక్సీని లాంచ్ చేయబోతోంది. జనవరి 1, 2026 నుంచి ఈ టాక్సీ యాప్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఢిల్లీలో ఈ యాప్‌ను లాంచ్ చేస్తారు. ఆ తర్వాత గుజరాత్, అనంతరం దేశంలోని 20 నగరాల్లో ఈ యాప్‌ను కేంద్రం ప్రారంభించనుంది.
జీరో కమిషన్ మోడల్ దీని ప్రత్యేకత
ఈ యాప్ ద్వారా రైడ్ బుక్ చేసుకుంటే వినియోగదారుడు ఎలాంటి కమిషన్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. సాధారణంగా ఆ రైడ్‌కి ఎంత చార్జ్ అయితే అంత చెల్లించాలి. అలాగే రైడర్‌గా ఈ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న వాళ్లు యాప్ యాజమాన్యానికి ఎలాంటి కమిషన్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. కార్లు, ఆటోలు, బైక్స్ ఈ యాప్ ద్వారా అందుబాటులో ఉంటాయి. రాత్రి పూట అయినా, డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలో అయినా సరే.. ఈ యాప్ ద్వారా ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ టాక్సీ యాప్‌ను సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆపరేట్ చేయనున్నారు.
56 వేల రిజిస్ట్రేషన్లు
ఇప్పటికే ఈ యాప్‌లో 56 వేల మంది డ్రైవర్లు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ యాప్ ద్వారా డ్రైవర్లకు ఎక్కువ ఆదాయం వస్తుందని, ఒక రైడ్ పూర్తి కాగానే 80 శాతం ఫేర్ నేరుగా డ్రైవర్లకే వెళ్తుందని, ప్రైవేట్ టాక్సీ యాప్స్ కంటే కూడా ఈ యాప్ ద్వారా చాలా బెటర్‌గా పని చేసే పరిస్థితులు ఉంటాయని తెలుస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bhatti Vikramarka | ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్ ఉన్నత స్థాయి సమావేశం.. హాజరైన డిప్యూటీ సీఎం
మే 19, 2026

Longest Non-Stop Train | దేశంలో ఒక్కచోట కూడా ఆగకుండా అత్యధిక దూరం ప్రయాణించే రైలు ఏది?
మే 17, 2026

Rajdhani Express | షార్ట్ సర్క్యూట్‌తో.. రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రాణనష్టం
మే 17, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



