త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana | న్యూఇయ‌ర్ కిక్కు.. మూడు రోజుల్లోనే రూ. 1000 కోట్ల మ‌ద్యం అమ్మ‌కాలు

Telangana | డిసెంబ‌ర్ 31 సంద‌ర్భంగా తెలంగాణ వ్యాప్తంగా జోరుగా మ‌ద్యం అమ్మ‌కాలు కొన‌సాగాయి. మూడు రోజుల్లోనే రూ. 1000 కోట్ల మ‌ద్యం అమ్మ‌కాలు జరిగాయ‌ని ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొన్నారు.

S

Telangana | Published On Jan 1, 2026, 4.43 pm IST

Telangana | న్యూఇయ‌ర్ కిక్కు.. మూడు రోజుల్లోనే రూ. 1000 కోట్ల మ‌ద్యం అమ్మ‌కాలు
Advertisement

Telangana | త్రినేత్ర‌.న్యూస్ : డిసెంబ‌ర్ 31 సంద‌ర్భంగా తెలంగాణ వ్యాప్తంగా జోరుగా మ‌ద్యం అమ్మ‌కాలు కొన‌సాగాయి. మూడు రోజుల్లోనే రూ. 1000 కోట్ల మ‌ద్యం అమ్మ‌కాలు జరిగాయ‌ని ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొన్నారు. గ‌త ఆరు రోజుల నుంచి నిన్న‌టి వ‌ర‌కు మొత్తం రూ. 1350 కోట్ల మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రిగిన‌ట్లు తెలిపారు. మొత్తంగా 8.30 ల‌క్ష‌ల లిక్క‌ర్ కేసులు, 7.78 ల‌క్ష‌ల బీర్‌ల కేసులు అమ్ముడు పోయిన‌ట్లు స్ప‌ష్టం చేశారు.

2024 డిసెంబ‌ర్ నెల చివ‌రి మూడు రోజుల్లో రూ. 736 కోట్ల విలువైన మ‌ద్యం విక్ర‌యాలు జ‌ర‌గగా, 2025 డిసెంబ‌ర్ చివ‌రి మూడు రోజుల్లోనే రూ. 980 కోట్ల విక్ర‌యాలు జ‌రిగాయి. రాష్ట్రంలోని మొత్తం 3,620 మ‌ద్యం దుకాణాలు, దాదాపు 1100 బార్లు, ప‌బ్‌లు, క్ల‌బ్‌లు క‌లిసి డిసెంబ‌ర్ నెల‌లోనే రూ. 4,920 కోట్ల విలువైన మద్యాన్ని డిపోల నుంచి కొనుగోలు చేసిన‌ట్లు ఎక్సైజ్ శాఖ అధికారిక లెక్క‌లు వెల్ల‌డిస్తున్నాయి. డిసెంబ‌ర్ 25 నుంచి 31వ తేదీ వ‌ర‌కు రూ. 1350 కోట్ల‌కు పైగా మ‌ద్యం విక్ర‌యాలు ఉన్న‌ట్లు పేర్కొన్నారు. డిసెంబ‌ర్ 29న రూ. 280 కోట్లు, 30న రూ. 380 కోట్లు, 31న రూ. 315 కోట్ల‌కు పైగా మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రిగాయి. ఈ మూడు రోజుల్లోనే దాదాపు రూ. 1000 కోట్ల విలువైన మ‌ద్యం విక్ర‌యాలు జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం.

Advertisement

తాజావార్తలు

Advertisement