త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kingdom 2 | విజ‌య్ దేవ‌ర‌కొండ కింగ్డ‌మ్ 2 లేన‌ట్లే – క‌న్ఫామ్ చేసిన ప్రొడ్యూస‌ర్‌

విజ‌య్ దేవ‌ర‌కొండ కింగ్డ‌మ్ 2 మూవీ ఆగిపోయింద‌ట‌. ఈ విష‌యాన్ని అన‌గ‌న‌గా ఒక రాజు ప్ర‌మోష‌న్స్‌లో7 నిర్మాత నాగ‌వంశీ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. కింగ్డ‌మ్ న‌ష్టాల‌ను తెచ్చిపెట్ట‌డంతో ఈ సీక్వెల్‌ను మేక‌ర్స్ ప‌క్క‌న‌పెట్టిన‌ట్లు స‌మాచారం.

N

Entertainment | Published On Jan 1, 2026, 4.45 pm IST

Kingdom 2 | విజ‌య్ దేవ‌ర‌కొండ కింగ్డ‌మ్ 2 లేన‌ట్లే – క‌న్ఫామ్ చేసిన ప్రొడ్యూస‌ర్‌
Advertisement

Kingdom 2 | ప్ర‌స్తుతం టాలీవుడ్‌తో పాటు అన్ని భాష‌ల్లో సీక్వెల్ సినిమాల ట్రెండ్ న‌డుస్తోంది. స్టార్స్ అంద‌రూ ఈ సీక్వెల్ సినిమాల‌పై ఆస‌క్తిని చూపుతున్నారు. ఓ క‌థ‌ను ఒకే పార్ట్‌లో కాకుండా రెండు, మూడు భాగ‌ల్లో చెప్పే వెసులుబాటు ఈ సీక్వెల్, ప్రీక్వెల్ మూవీస్‌లో ఉంటుంది. ప్ర‌తి సినిమాకు సీక్వెల్‌ను అనౌన్స్‌చేయ‌డం కామ‌న్‌గా మారిపోయింది. కానీ అనౌన్స్ చేసిన ఈ సీక్వెల్స్ లో చాలా వ‌ర‌కు ప‌ట్టాలెక్క‌డం లేదు. అనుకున్న స్థాయిలో సినిమా ఆడ‌క‌పోవ‌డం, క‌థ‌, బ‌డ్జెట్‌తో ఇత‌ర కార‌ణాల వ‌ల్ల చాలా వ‌ర‌కు పార్ట్ 2 సినిమాల‌ను మేక‌ర్స్ ప‌క్క‌న‌పెడుతున్నారు. ఇలా ప‌క్క‌న‌పెట్టిన‌ సీక్వెల్ సినిమాల లిస్ట్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ కింగ్డ‌మ్ కూడా చేరింది.

జెర్సీ డైరెక్ట‌ర్‌తో...

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా జెర్సీ ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన కింగ్డ‌మ్‌ గ‌త ఏడాది థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. సెన్సిబుల్ డైరెక్ట‌ర్‌గా గౌత‌మ్ తిన్న‌నూరికి ఉన్న పేరుతో పాటు టాలీవుడ్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఉన్న క్రేజ్ కార‌ణంగా రిలీజ్‌కు ముందు కింగ్డ‌మ్‌పై భారీ స్థాయిలో అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. విజ‌య్ యాక్టింగ్‌, గౌత‌మ్ తిన్న‌నూరి టేకింగ్ బాగుంద‌నే పేరొచ్చిన క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం ఈ సినిమా నిర్మాత‌ల‌కు న‌ష్టాల‌నే తెచ్చిపెట్టింది.

డైరెక్ట‌ర్ వ‌ల్లే...

కింగ్డ‌మ్ ఫ్లాప్‌కు గౌత‌మ్ తిన్న‌నూరి కారణ‌మంటూ అన‌న‌గ‌నా ఒక రాజు ప్ర‌మోష‌న్స్‌లో నాగ‌వంశీ కామెంట్స్ చేశారు. ప‌రాజ‌యాన్ని ద‌ర్శ‌కుడిపై నెట్టేశారు. కింగ్డ‌మ్ సెకండాఫ్‌లో చాలా లోపాలున్నాయ‌ని, జెర్సీ లాంటి క్లాసిక్ తీసిన ద‌ర్శ‌కుడు కావ‌డంతో అత‌డితో వాదించ‌లేక‌పోయామ‌ని నాగ‌వంశీ అన్నారు. మూస‌ధోర‌ణి సినిమాల‌కు అల‌వాటుప‌డిన ప్రేక్ష‌కుల్లో ఈ సినిమాతో మార్పు తీసుకొద్దామ‌ని గౌత‌మ్ అన‌డంతో ఇష్టం లేక‌పోయినా అంగీక‌రించామ‌ని నాగ‌వంశీ చెప్పారు. కానీ తాము ఊహించిన రిజ‌ల్ట్ మాత్రం రాలేద‌ని పేర్కొన్నారు.
కింగ్డ‌మ్ కొన‌సాగింపుగా కింగ్డ‌మ్ 2 కూడా అనౌన్స్‌చేశారు. అయితే పార్ట్ 1 న‌ష్టాల‌ను తెచ్చిపెట్ట‌డంతో ఈ సీక్వెల్‌ను తెర‌కెక్కించాల‌నే ఆలోచ‌న‌ను విర‌మించుకున్నార‌ట‌. ఈ విష‌యాన్ని నాగ‌వంశీ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. కింగ్డ‌మ్ 2 ఉండ‌క‌పోవ‌చ్చున‌ని చెప్పారు.

ప‌ది కోట్ల న‌ష్టాలు...

దాదాపు 53 కోట్ల వ‌ర‌కు కింగ్డ‌మ్ మూవీప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. థియేట‌ర్ల‌లో ఈ మూవీ 44 కోట్ల లోపే క‌లెక్ష‌న్స్ సాధించింది. నిర్మాత‌ల‌కు ప‌ది కోట్ల వ‌ర‌కు న‌ష్టాల‌ను తెచ్చిపెట్టింది.
కింగ్డ‌మ్ రిజ‌ల్ట్‌తో సంబంధం లేకుండా విజ‌య్ దేవ‌ర‌కొండ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుతం రౌడీ జ‌నార్ధ‌న‌తో పాటు రాహుల్ సాంకృత్యాన్‌తో మ‌రో మూవీ చేస్తున్నాడు. వీటితో పాటు మ‌రో సినిమా డిస్క‌ష‌న్ స్టేజ్‌లో ఉన్న‌ట్లు స‌మాచారం.

Advertisement

తాజావార్తలు

Advertisement