త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | గెలుపోట‌ములు తాత్కాలికం.. ప్ర‌జ‌ల గుండెల్లో కేసీఆర్‌, గులాబీ జెండా: కేటీఆర్‌

KTR | గెలుపు, ఓట‌ములు శాశ్వ‌తం కాదని బీఆర్ఎస్ (BRS) కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణ (Telangana) ప్ర‌జ‌ల గుండెల్లో కేసీఆర్‌ (KCR), గులాబీ జెండా స్థానం శాశ్వ‌తమ‌ని పేర్కొన్నారు. గెలుపోట‌ముల‌తో సంబంధం లేకుండా మ‌న ప్ర‌స్థానం సాగాలని ఆకాంక్షించారు. తెలంగాణ భ‌వ‌న్‌ (Telangana Bhavan) లో నిర్వ‌హించిన నూత‌న సంవ‌త్స‌ర (New Year) డైరీ (Dairy), కేలెండ‌ర్ (Calendar) ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో పాల్గొని ప్ర‌సంగించారు.

A

Telangana | Published On Jan 1, 2026, 4.43 pm IST

KTR | గెలుపోట‌ములు తాత్కాలికం.. ప్ర‌జ‌ల గుండెల్లో కేసీఆర్‌, గులాబీ జెండా: కేటీఆర్‌
Advertisement

ఎవ‌రెన్ని కుట్ర‌లు చేసినా 2028లో కేసీఆర్‌ను సీఎం చేయ‌డ‌మే లక్ష్యంగా ముందుకు
తెలంగాణ భ‌వ‌న్‌లో ఘ‌నంగా నూత‌న సంవ‌త్స‌ర డైరీ, కేలెండ‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

KTR | గెలుపు, ఓట‌ములు శాశ్వ‌తం కాదు, అవి తాత్కాలికం మాత్ర‌మేన‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్ (KTR) అన్నారు. అప్పుడ‌ప్పుడూ ఎదురుదెబ్బ‌లు తాకుతాయని చెప్పారు. కానీ తెలంగాణ (Telangana) ప్ర‌జ‌ల గుండెల్లో కేసీఆర్‌ (KCR), గులాబీ జెండా స్థానం మాత్రం శాశ్వ‌తమ‌ని పేర్కొన్నారు. గెలుపోట‌ముల‌తో సంబంధం లేకుండా మ‌న ప్ర‌స్థానం ఇలాగే సాగాలని ఆకాంక్షించారు. చిన్న‌చిన్న ఆటుపోట్ల‌కు కుంగిపోవ‌ద్దని సూచించారు. తెలంగాణ భ‌వ‌న్‌ (Telangana Bhavan) లో నిర్వ‌హించిన నూత‌న సంవ‌త్స‌ర (New Year) డైరీ (Dairy), కేలెండ‌ర్ (Calendar) ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మానికి ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కాంగ్రెస్ (Congress) ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత సంవ‌త్స‌రాలు మారినా ప్ర‌జ‌ల జీవితాల్లో మార్పు రాలేదని చెప్పారు. రెండేళ్ల‌లో తిరోగ‌మ‌నం వైపు రాష్ట్రం వెళ్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కేసీఆర్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు తీసుకోక‌ముందు ప‌రిస్థితులు మ‌ళ్లీ చూస్తున్నామ‌ని వాపోయారు.

తెలంగాణ వ్యాప్తంగా రైతులు యూరియా దొర‌క్క వెత‌లు ప‌డుతున్నార‌ని, చ‌లికాలంలో యూరియాకోసం లైన్ల‌లో నిలవాల్సిన దుస్థితి దాపురించింద‌ని అన్నారు. బీఆర్ఎస్‌కు పోరాటం కొత్త‌కాద‌న్న ఆయ‌న‌.. ఆనాడు ప‌ద్నాలుగేళ్లు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడామ‌ని గుర్తు చేసుకున్నారు. ప‌దేళ్ల పాల‌న‌లో కేసీఆర్ ప్ర‌గ‌తి సంత‌కం చిర‌స్మ‌ర‌ణీయమ‌ని, దానిని ఎవ‌రూ చెరిపోయలేరని అభిప్రాయ‌ప‌డ్డారు. రెండేళ్ల కాంగ్రెస్ పార్టీ దుష్ప‌రిపాల‌న‌పై బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు పోరాడుతూనే ఉన్నారని చెప్పారు. ల‌గ‌చ‌ర్ల‌లో గిరిజ‌నుల మీద జ‌రిగిన దాష్టీకానికి వ్య‌తిరేకంగా, రుణ‌మాఫీ పేరుతో జ‌రిగిన ద‌గా, రైతుబంధు ఎగ్గొట్టిన రెండుసార్లు చేసిన మోసం, ఆరు గ్యారెంటీలు, 420 హామీలపై ప్ర‌జ‌ల తిరుగుబాటుకు కార్య‌క‌ర్త‌లు నాయ‌క‌త్వం వ‌హించార‌ని పేర్కొన్నారు. మూసీలో జ‌రుగుతున్న దాష్టీకానికి వ్య‌తిరేకంగా గ‌ళ‌మెత్తిన సోద‌రుల‌కు, హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ భూములు గుంజుకుంటే అడ్డుకున్న విద్యార్థులకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న అన్యాయాల‌పై పోరాడుతున్న అంద‌రికీ అభినంద‌న‌లని అన్నారు.

కేసీఆర్ చెప్పిన‌ట్లు.. ఇత‌ర పార్టీల‌కు తెలంగాణ రాజ‌కీయాలు ఒక గేమ్ అని, బీఆర్ఎస్‌కు మాత్రం రాజ‌కీయం అంటే ప్ర‌జ‌ల సంక్షేమం, ధ‌ర్మం అని చెప్పారు. ఒక‌వైపు పోరాటాన్ని కొన‌సాగిస్తూనే ప‌టిష్ట‌మైన సంస్థాగ‌త నిర్మాణం చేసుకోవాలని అన్నారు. ఈ ప్ర‌యాణంలో విజ‌యం సాధిస్తామ‌ని త‌న‌కు సంపూర్ణ విశ్వాసం ఉందని, ఎందుకంటే ధ‌ర్మం, న్యాయం, నిజాయితీ త‌మ‌ వైపు ఉన్నాయ‌న్నారు. ప‌ర‌స్ప‌ర వ్య‌తిరేక‌మైన రెండు జాతీయ పార్టీలు ఒక్క‌టై బీఆర్ఎస్‌పై క‌త్తులు దూస్తున్నార‌ని, తుద‌ముట్టించేందుకు కుట్ర‌లు చేస్తున్నాయ‌ని ఆరోపించారు. ఎవ‌రెన్ని కుట్ర‌లు, కుతంత్రాలు చేసినా ప్ర‌జ‌ల ఆశీర్వాదం, దైవ ఆశీర్వాదం త‌మ‌కు ఉన్నాయ‌ని, ఎవ‌రూ ఏమీ చేయ‌లేరని చెప్పారు. 2028లో తిరిగి కేసీఆర్ ముఖ్య‌మంత్రిగా చూడ‌డ‌మే అంద‌రి ల‌క్ష్యంగా ముందుకు పోదామ‌ని పిలుపునిచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో శాస‌న మండ‌లి డిప్యూటీ చైర్మెన్ బండ ప్ర‌కాశ్‌, శాస‌న‌మండ‌లిలో ప్ర‌తిప‌క్ష‌నేత మ‌ధుసూద‌నాచారి, మాజీ మంత్రులు మ‌హ‌మూద్అలీ, జ‌గ‌దీశ్‌రెడ్డి, శ్రీ‌నివాస్‌గౌడ్‌, మ‌ల్లారెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేష‌న్ల మాజీ చైర్మెన్‌లు పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement