KYC | మ్యుచువల్ ఫండ్స్ ఖాతాలో చాలా కాలం నుంచి కేవైసీ అప్ డేట్ చేయలేదా..? అయితే జాగ్రత్త..!
KYC | ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు ప్రజలను అనేక విధాలుగా మోసాలకు గురి చేస్తూ డబ్బు దోచుకుంటున్నారు. ఇటీవలి కాలంలో సైబర్ నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. మోసగాళ్లు నూతన విధానాల్లో నేరాలకు పాల్పడుతూ అందినకాడికి కాజేస్తున్నారు.
KYC | ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు ప్రజలను అనేక విధాలుగా మోసాలకు గురి చేస్తూ డబ్బు దోచుకుంటున్నారు. ఇటీవలి కాలంలో సైబర్ నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. మోసగాళ్లు నూతన విధానాల్లో నేరాలకు పాల్పడుతూ అందినకాడికి కాజేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో కొత్త తరహా మోసానికి వారు పాల్పడుతున్నారని అసోసియేషన్ ఆఫ్ మ్యుచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా, సెక్యూరిటీ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) తాజాగా వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేశాయి. మ్యుచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టిన వినియోగదారులకు చెందిన కేవైసీ (KYC) వివరాలను సేకరిస్తున్న కొందరు మోసగాళ్లు వాటితో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని ఆయా సంస్థలు తెలిపాయి. కేవైసీ వివరాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి.
పెరుగుతున్న కేవైసీ మోసాలు..
మోసగాళ్లు ప్రస్తుతం ప్రజలకు చెందిన మ్యుచువల్ ఫండ్స్ కేవైసీ వివరాలను తీసుకుని వాటితో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని, అందులో భాగంగా వారు కేవైసీ అప్‌డేట్ చేయని లేదా బాగా పాతగా మారిన కైవేసీ వివరాలు కలిగిన అకౌంట్ల సమాచారాన్ని సేకరించి వాటితో వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసి డబ్బును అపహరిస్తున్నారని ఆయా సంస్థలు వెల్లడించాయి. ప్రజలు మ్యుచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతుంటే వారు తమ కేవైసీని ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని, కేవైసీ అప్ డేట్ స్థితి వాలిడేట్ అయినట్లు ఉందా, లేదా చెక్ చేయాలని, ఒక వేళ వాలిడేట్ అయి ఉండకపోతే వెంటనే కేవైసీని పూర్తి చేసుకోవాలని సూచించాయి.
3 రకాలుగా కేవైసీ స్థితి..
కేవైసీ స్థితి మ్యుచువల్ ఫండ్స్ ఖాతాల్లో సాధారణంగా 3 రకాలుగా కనిపిస్తుంది. రిజిస్టర్డ్ అంటే ప్రాథమికంగా ధ్రువీకరణ పూర్తయిందని అర్థం. వాలిడేటెడ్ అంటే ఆధార్ లేదా ఇతర పత్రాల ద్వారా కేవైసీ పూర్తయిందని అర్థం. ఇక ఆన్ హోల్డ్ అని ఉంటే కేవైసీ పూర్తి కాలేదని సూచిస్తుంది. ఒక వేళ ఇన్ వాలిడ్ అని దర్శనమిస్తే పత్రాల్లో వివరాలు మ్యాచ్ అవడం లేదని, అందుకనే అలాంటి స్థితి వచ్చిందని తెలుసుకోవాలి. ఇలా గనక ఉంటే మ్యుచువల్ ఫండ్స్‌ను రిడీమ్ చేయలేరు. అలాగే ఫండ్‌లలోకి మారడం కూడా కష్టంగా ఉంటుంది. అందువల్ల వినియోగదారులు తమ మ్యుచువల్ ఫండ్స్ కేవైసీని ఎప్పటికప్పుడు వాలిడేట్ అయి ఉందా, లేదా అనే విషయాన్ని చెక్ చేసుకోవాలని సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. ఆధార్ లింక్ చేసిన డిజిలాకర్ ద్వారా కేవైసీని పూర్తి చేయడం ఉత్తమమని చెబుతున్నారు.

స్టేటస్ ఇలా చెక్ చేయాలి..
కేవైసీ స్టేటస్‌ను సులభంగా తెలుసుకోవడానికి కొన్ని సాధారణ స్టెప్స్‌ను అనుసరించాలి. మొదటగా కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీ (కేఆర్ఏ) లేదా మ్యూచువల్ ఫండ్ సంస్థ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఉదాహరణకు KFintech లేదా CAMS వంటి ప్లాట్‌ఫామ్‌లు ఈ సేవలను అందిస్తాయి కనుక ఆయా ప్లాట్‌ఫామ్‌లను సందర్శించాలి. తర్వాత 10 అంకెల పాన్ కార్డ్ నంబర్, క్యాప్చా నమోదు చేయాలి. లాగిన్ అవసరం లేకుండా వెంటనే ఫలితం కనిపిస్తుంది. ఫలితాల్లో కేవైసీ వాలిడేటెడ్, రిజిస్టర్డ్ లేదా ఆన్-హోల్డ్ స్థితులను జాగ్రత్తగా పరిశీలించాలి. అలాగే ఆధార్ లేదా పాస్‌పోర్ట్ వంటి ఏ ఆధారాలతో ధ్రువీకరణ జరిగిందో కూడా తెలుసుకోవాలి. అవసరమైతే ఆధార్ ఓటీపీ లేదా వీడియో వెరిఫికేషన్ ద్వారా కేవైసీని అప్‌డేట్ చేయాలి. ఎన్‌ఆర్‌ఐ పెట్టుబడిదారులు ఈ క్రమంలో అదనపు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
ప్రతి 6 నుంచి 12 నెలలకు ఒకసారి చెక్ చేయాలి..
అయితే దీన్ని ఒకసారి చేసి వదిలేయకుండా, ప్రతి 6 నుంచి 12 నెలలకు ఒకసారి కేవైసీ వివరాలను తిరిగి పరిశీలించాల్సి ఉంటుంది. ముఖ్యమైన లావాదేవీలకు ముందు ఈ ప్రక్రియను పూర్తి చేయడం మంచిది. ఏవైనా లోపాలు ఉంటే సంబంధిత ఆర్టీఏ (రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్) సహాయ కేంద్రాన్ని సంప్రదించవచ్చు. పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండి కేవైసీ వివరాలను సమయానికి అప్‌డేట్ చేయడం ద్వారా మోసాల నుంచి రక్షణ పొందవచ్చు. మోసగాళ్లు సాధారణంగా కాలం చెల్లిన కేవైసీ వివరాలను లక్ష్యంగా చేసుకుని ఫిషింగ్, ఫేక్ రిడంప్షన్ వంటి మోసాలకు పాల్పడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం, అవగాహన కలిగి ఉండడం, సరైన చర్యలు తీసుకోవడం ద్వారా ఆర్థిక నష్టాలు, మానసిక ఒత్తిడిని నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






