త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KYC Update | ఫోన్ నంబ‌ర్ లేదా చిరునామా మారిందా..? కేవైసీని ఇలా ఒక‌ ఆర్డ‌ర్‌లో అప్‌డేట్ చేయండి..!

KYC Update | ఆధార్ కార్డుకు వాడే ఫోన్ నంబ‌ర్‌నే అంద‌రూ ఇత‌ర అవ‌స‌రాల‌కు కూడా వాడుతుంటారు. ముఖ్యంగా బ్యాంకింగ్‌, లోన్లు, ఇన్సూరెన్స్‌, మ్యుచువ‌ల్ ఫండ్స్, స్టాక్ బ్రోకర్స్ వంటి వాటికి ఆధార్‌కు లింక్ అయి ఉన్న ఫోన్ నంబ‌ర్‌నే ఇవ్వాల్సి ఉంటుంది. దీని వ‌ల్ల వినియోగ‌దారుల‌కు చెందిన కేవైసీ చాలా సుల‌భంగా పూర్తవుతుంది.

S

Business | Published On Jan 16, 2026, 12.52 pm IST

KYC Update | ఫోన్ నంబ‌ర్ లేదా చిరునామా మారిందా..? కేవైసీని ఇలా ఒక‌ ఆర్డ‌ర్‌లో అప్‌డేట్ చేయండి..!
Advertisement

KYC Update | ఆధార్ కార్డుకు వాడే ఫోన్ నంబ‌ర్‌నే అంద‌రూ ఇత‌ర అవ‌స‌రాల‌కు కూడా వాడుతుంటారు. ముఖ్యంగా బ్యాంకింగ్‌, లోన్లు, ఇన్సూరెన్స్‌, మ్యుచువ‌ల్ ఫండ్స్, స్టాక్ బ్రోకర్స్ వంటి వాటికి ఆధార్‌కు లింక్ అయి ఉన్న ఫోన్ నంబ‌ర్‌నే ఇవ్వాల్సి ఉంటుంది. దీని వ‌ల్ల వినియోగ‌దారుల‌కు చెందిన కేవైసీ చాలా సుల‌భంగా పూర్తవుతుంది. అందుక‌నే అంద‌రూ ఇత‌ర అవ‌స‌రాల‌కు వేరే ఫోన్ నంబ‌ర్ల‌ను ఉప‌యోగించినా, ఆయా ప‌నుల‌కు మాత్రం కచ్చితంగా ఆధార్‌కు లింక్ అయి ఉన్న ఫోన్ నంబ‌ర్‌నే వాడాల్సి ఉంటుంది. అయితే ఫోన్ నంబ‌ర్‌ను మార్చిన‌ప్పుడు లేదా చిరునామా మారిప్పుడు ఆధార్ కేవైసీ చేయ‌డం సుల‌భ‌మే, కానీ ప్ర‌తి బ్యాంకుకు లేదా ఇత‌ర సేవ‌ల‌కు చెందిన కేవైసీల‌ను మార్చ‌డం చాలా క‌ష్టంగా ఉంటుంది.

ఒక ఆర్డ‌ర్‌లో చేయాలి..

ఆయా సంస్థ‌ల కార్య‌ల‌యాల‌కు, బ్యాంకుల‌కు వెళ్లి లేదా ఆన్‌లైన్‌లో క‌చ్చితంగా ప్ర‌తి ఒక్క సేవ‌కు ప్ర‌త్యేకంగా కేవైసీ రిక్వెస్ట్ పంపాలి. ఇలా ఎన్ని సేవ‌లు ఉంటే అన్ని సేవ‌ల‌కు విడివిడిగా కేవైసీని చేయించాల్సి ఉంటుంది. వాటిల్లో ఏ ఒక్క కేవైసీ స‌రిగ్గా పూర్త‌వ‌క‌పోయినా మ‌న‌కు భ‌విష్య‌త్తులో స‌మాచారాన్ని పంపించ‌డం ఆయా సంస్థ‌ల‌కు లేదా బ్యాంకుల‌కు ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని సార్లకు మ‌న‌కు మెయిల్స్ లేదా మెసేజ్‌లు, ఓటీటీపీలు వంటి రావు. దీంతం మ‌నం కూడా ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తుంది. అయితే ఈ ఇబ్బందులు ప‌డ‌కుండా ఉండాలంటే కొత్త‌గా ఎవ‌రైనా ఫోన్ నంబ‌ర్‌ను మార్చినా లేదా చిరునామా మార్చినా వాటితో కేవైసీని ఒక ఆర్డ‌ర్ ప్ర‌కారం చేయాలి. అలా చేస్తే ఆయా స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌కుండా ఉంటాయి.

ముందు ఆధార్ కేవైసీ.. పాన్ లింక్ అయి ఉండాల్సిందే..

నూత‌నంగా ఫోన్ నంబ‌ర్ తీసుకున్నా లేదా మార్చినా, వేరే చిరునామాకు మారినా ముందుగా ఆధార్ కేవైసీ చేయాలి. మీరు ఉంటున్న చిరునామాకు చెందిన ఏదైనా ధ్రువ‌పత్రాన్ని తీసుకుని ఆధార్ సేవా కేంద్రానికి వెళితే అక్క‌డ చిరునామా మారుస్తారు. అలాగే మీ ఐరిస్ లేదా బ‌యోమెట్రిక్ తీసుకుని మీ ఫోన్ నంబ‌ర్‌ను కూడా మార్చేస్తారు. ఇలా ఆధార్ కేవైసీ చేయ‌డం సుల‌భం అవుతుంది. అయితే ఆధార్‌కు అప్ప‌టికే పాన్ కార్డుతో లింక్ అయి ఉన్న‌వారు అలా కేవైసీ చేయ‌వ‌చ్చు. కానీ ఆధార్‌, పాన్ లింక్ లేని వారు ముందుగా ఆ రెండింటినీ లింక్ చేయాలి. ఆ త‌రువాతే ఆధార్ కేవైసీ చేయాలి. ఆధార్‌, పాన్ లింక్ అయి ఉంటే ఆధార్ కేవైసీ మారిస్తే పాన్ కేవైసీ కూడా మారిన‌ట్లే. క‌నుక ఈ రెండూ లింక్ అయి ఉండేలా చూడాలి. అవి లింక్ కాక‌పోతే ముందుగా వాటిని లింక్ చేయాలి. అవి లింక్ అయి ఉన్నాయ‌ని నిర్దారించుకుంటే పైన చెప్పిన‌ట్లుగా ఆధార్ కేవైసీ చేయాలి. దీంతో ఆధార్, పాన్ కేవైసీ రెండూ ఒకేసారి పూర్త‌వుతాయి.

ప్ర‌ధాన అకౌంట్‌కు ముందుగా..

ఇక ఆధార్ కేవైసీ అయ్యాక మీరు మార్చిన నంబ‌ర్‌కు ఓటీపీలు వ‌స్తున్నాయో లేదో చూడాలి. ఒక‌వేళ మీరు మెయిల్ ను వాడుతుంటే ఆయా వివ‌రాలు మారిన‌ట్లు మీకు మెయిల్ పంపిస్తారు. అలాగే కొత్త నంబ‌ర్‌కు కూడా మెసేజ్‌లు వ‌స్తాయి. ఇక ఆధార్ యూఐడీఏఐ వెబ్‌సైట్‌లోనూ మీరు కేవైసీకి అప్లై చేశాక 7 రోజుల అనంత‌రం వివ‌రాల‌ను చెక్ చేసుకోవ‌చ్చు. అక్క‌డ వివ‌రాలు మారిన‌ట్లు మీకు క‌నిపిస్తే ఆ త‌రువాత వెంట‌నే తదుపరి ప్ర‌క్రియ‌ను ప్రారంభించాలి. ఇప్పుడు మీరు మీ ప్ర‌ధాన బ్యాంకు అకౌంట్ క‌లిగిన బ్రాంచికి వెళ్లి అక్క‌డ కేవైసీ చేయాలి. సాధార‌ణంగా ప్రైవేటు బ్యాంకులు అయితే ఆన్‌లైన్‌లోనే కేవైసీ చేసుకునే వీలు క‌ల్పిస్తారు. క‌నుక మీ ప్ర‌ధాన బ్యాంకు అకౌంట్ ప్రైవేట్ బ్యాంకుకు చెందిన‌ది అయితే ఆ బ్యాంకుకు చెందిన ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్‌ను ఓపెన్ చేసి వెంట‌నే కేవైసీ చేయ‌వ‌చ్చు. ఇలా రెండు ర‌కాలుగా కేవైసీ చేయ‌వ‌చ్చు. దీంతో 3 రోజుల్లోగా మీ ఆధార్‌లో మీరు ఇచ్చిన‌ట్లుగా ఫోన్ నంబ‌ర్‌, చిరునామా మారిపోతాయి.

ఇత‌ర సేవ‌ల్లో ఆటోమేటిగ్గా..

అయితే ప్ర‌ధాన బ్యాంకు అకౌంట్ అంటే.. మీరు ఏ అకౌంట్‌ను అయితే మ్యుచువ‌ల్ ఫండ్స్‌, స్టాక్ బ్రోక‌ర్స్‌, ఇన్సూరెన్స్ వంటి వాటికి లింక్ చేసి వాడుతున్నారో.. ఆ అకౌంట్ అన్న‌మాట‌. ఆయా సేవ‌ల‌ను అందించేవారు నేరుగా ఆధార్‌, పాన్‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఆన్‌లైన్‌లోనే తీసుకుని ఆటోమేటిగ్గా కేవైసీ చేస్తుంటారు. ఈ ప్ర‌క్రియతో వినియోగ‌దారుల‌కు సంబంధం ఉండదు. క‌నుక ముందుగా మీరు మీ ప్ర‌ధాన బ్యాంకు అకౌంట్‌కు కేవైసీ చేస్తే వారం నుంచి 15 రోజుల్లోగా ఆయా సేవ‌ల‌ను అందించే సంస్థ‌లలోని మీ ఖాతాలు కూడా ఆటోమేటిగ్గా కేవైసీ అవుతాయి. వాటిని మాన్యువ‌ల్‌గా కేవైసీ చేయాల్సిన ప‌ని ఉండ‌దు. ఈ విధంగా చాలా ఈజీగా కేవైసీ అయిపోతుంది. ఇక ఆ త‌రువాత మిగిలిన బ్యాంకు అకౌంట్లు, ఇత‌ర సేవ‌ల‌కు కూడా కేవైసీని సుల‌భంగా చేసేయ‌వ‌చ్చు. దీంతో క‌మ్యూనికేష‌న్ ప‌రంగా మీకు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా ఉంటుంది. ఫోన్ నంబ‌ర్ లేదా చిరునామా మారితే ఇలా ఒక ఆర్డ‌ర్‌లో కేవైసీ చేస్తే అప్పుడు అన్నింట్లోనూ సుల‌భంగా కేవైసీ పూర్త‌వుతుంది. ఈ విధంగా కేవైసీ విధానాన్ని ఉపయోగించుకోవ‌చ్చు.

Advertisement

తాజావార్తలు

Advertisement