త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nifty 50 | కొత్త ఏడాదిలో నిఫ్టీ శుభారంభం.. దూకుడు కొనసాగేనా..?

Nifty 50 | నూత‌న సంవ‌త్స‌రంలో స్టాక్ మార్కెట్ అద్భుత‌మైన ప్రారంభాన్ని ఇచ్చింది. శుక్ర‌వారం మార్కెట్ నిలిపివేసే స‌మ‌యానికి నిఫ్టీ 50, మ‌ళ్లీ ఆల్ టైమ్ హై రికార్డుల‌ను దాటి కొత్త రికార్డుల‌ను సృష్టించింది. నిఫ్టీ 50 పెరుగుద‌ల‌కు హిందాల్కో ఇండ‌స్ట్రీస్‌, కోల్ ఇండియా, భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ షేర్లు దోహ‌దం చేశాయి.

S

Business | Published On Jan 3, 2026, 8.39 am IST

Nifty 50 | కొత్త ఏడాదిలో నిఫ్టీ శుభారంభం.. దూకుడు కొనసాగేనా..?
Advertisement

Nifty 50 | నూత‌న సంవ‌త్స‌రంలో స్టాక్ మార్కెట్ అద్భుత‌మైన ప్రారంభాన్ని ఇచ్చింది. శుక్ర‌వారం మార్కెట్ నిలిపివేసే స‌మ‌యానికి నిఫ్టీ 50, మ‌ళ్లీ ఆల్ టైమ్ హై రికార్డుల‌ను దాటి కొత్త రికార్డుల‌ను సృష్టించింది. కొత్త ఏడాదిలో మార్కెట్ల‌పై పాజిటివ్ ప్ర‌భావం ఉంటుంద‌ని, బంగారం, వెండి ధ‌ర‌లు కాస్త త‌గ్గుతాయ‌ని, అలాగే అమెరికా టారిఫ్‌ల‌పై కూడా త్వ‌ర‌లోనే స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని ఇప్ప‌టికే ఆర్థిక నిపుణులు, ఫండ్ మేనేజ‌ర్లు అంచ‌నా వేస్తున్నారు. దీంతో మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్‌గా మారింది. ఈ క్ర‌మంలోనే శుక్ర‌వారం మార్కెట్ నిలిచిపోయే స‌మ‌యానికి నిఫ్టీ 182 పాయింట్లు లాభ‌ప‌డి 26,328 పాయింట్ల ఆల్ టైమ్ హై రికార్డును స‌రికొత్త‌గా సాధించింది. అలాగే సెన్సెక్స్ కూడా 573 పాయింట్లు లాభ‌ప‌డి 85,762 పాయింట్లతో మళ్లీ ఆల్ టైమ్ హై ను దాటేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలోనే ఈ ఏడాదిలో మార్కెట్ అంతా పాజిటివ్‌గానే ఉండే అవ‌కాశం ఉంటుంద‌ని విశ్లేషిస్తున్నారు.

కొత్త ఏడాదిలో పాజిటివ్ సెంటిమెంటే..?

నిఫ్టీ 50 పెరుగుద‌ల‌కు హిందాల్కో ఇండ‌స్ట్రీస్‌, కోల్ ఇండియా, భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ షేర్లు దోహ‌దం చేశాయి. ఆయా కంపెనీల షేర్ల ధ‌ర‌లు ఏకంగా 2 శాతం మేర పెరిగాయి. ఇక పొగాకు ఉత్ప‌త్తుల‌పై పెంచిన సుంకాల కార‌ణంగా ఐటీసీ సంస్థ షేర్ల ధ‌ర‌లు 4 శాతం మేర త‌గ్గాయి. అలాగే బ‌జాజ్ ఆటో కంపెనీ షేర్ల ధ‌ర‌లోనూ 4 శాతం మేర త‌గ్గుద‌ల క‌నిపించింది. మొత్తం నిఫ్టీ ప‌రంగా చూస్తే 2183 షేర్లు పాజిటివ్‌గా ఉండ‌గా, 1204 షేర్లు నెగెటివ్‌గా ఉన్నాయి. ఇక మ‌రో 165 షేర్ల ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు. ఈ సంద‌ర్భంగా మోర్గాన్ స్టాన్లీ ఇండియా ఈక్విటీ విశ్లేష‌కులు రిధ‌మ్ దేశాయ్‌, న‌యంత్ ప‌రేఖ్‌లు రాయిట‌ర్స్ సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ఆర్‌బీఐ మ‌ళ్లీ వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించాల‌ని చూస్తున్నార‌ని, అలాగే అమెరికాతో భార‌త్ ట్రేడ్ డీల్‌ను కుదుర్చుకోనుంద‌ని, దీని వ‌ల్ల మార్కెట్ల‌పై కొత్త ఏడాదిలో పాజిటివ్ ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు.

అన్ని అంశాల్లోనూ సెంటిమెంట్ ఎఫెక్ట్‌..

కాగా నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ఆసియా మార్కెట్లు కూడా పాజిటివ్‌గానే స్పందించాయి. ద‌క్షిణ కొరియాకు చెందిన కోస్పి, షాంగాయ్ ఎస్ఎస్ఈ కంపోజిట్‌, హాంగ్ కాంగ్ కు చెందిన హాంగ్ సెంగ్ మార్కెట్లు శుక్ర‌వారం పాజిటివ్‌గా ట్రేడ్ అయ్యాయి. మ‌రోవైపు అమెరికా ఫ్యూచర్స్ మార్కెట్‌లోనూ 0.7 శాతం వృద్ధి కనిపించింది. ఇక భార‌త మార్కెట్ల‌లో పెట్టుబ‌డి దారులు ఎక్కువ‌గా లార్జ్ క్యాప్ స్టాక్‌ల‌ను కొనేందుకు ఆస‌క్తిని చూపించారు. ఈ క్ర‌మంలోనే ఈ ఏడాదిలో వ‌రుస‌గా రెండో ట్రేడింగ్ సెష‌న్‌లోనూ రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ షేర్ల ధ‌ర‌లు దాదాపుగా 1 శాతం మేర పెరిగాయి. ఇక ఆటోమొబైల్ కంపెనీల‌తోపాటు ప‌లు ప్ర‌ముఖ రంగాల‌కు చెందిన కంపెనీల్లోనూ అమ్మకాల్లో డిసెంబ‌ర్‌లో గ‌ణ‌నీయ‌మైన వృద్ధి క‌నిపించింది. ఇది కూడా మార్కెట్ పాజిటివ్ సెంటిమెంట్‌పై ప్ర‌భావం చూపించింది. అయితే నిఫ్టీ ప్ర‌స్తుతం 26200 ముఖ్య‌మైన రెసిస్టెన్స్‌ను దాటినందున మ‌రో 300 నుంచి 500 పాయింట్ల మేర ఈ నెల‌లో పెరిగే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. కానీ వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రం ఏప్రిల్ 1న ప్రారంభం అయ్యాక‌ భార‌త స్టాక్ మార్కెట్ల అస‌లు ప‌రిస్థితి అప్పుడు తెలిసే అవ‌కాశం ఉంద‌న్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement