Winter Fruits | ఈ మూడు పండ్లను ఈ సీజన్‌లో రోజూ తినాల్సిందే.. ఎందుకంటే..?
Winter Fruits | ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ కచ్చితంగా ఏదో ఒక రకానికి చెందిన పండ్లను తింటుండాలని పోషకాహార నిపుణులు, వైద్యులు చెబుతుంటారు. పండ్లను తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. వాటిని మనం రోజువారి ఆహారంలో కచ్చితంగా భాగం చేసుకోవాల్సి ఉంటుంది. పండ్లను చాలా మంది ఇష్టంగానే తింటుంటారు.
Winter Fruits | ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ కచ్చితంగా ఏదో ఒక రకానికి చెందిన పండ్లను తింటుండాలని పోషకాహార నిపుణులు, వైద్యులు చెబుతుంటారు. పండ్లను తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. వాటిని మనం రోజువారి ఆహారంలో కచ్చితంగా భాగం చేసుకోవాల్సి ఉంటుంది. పండ్లను చాలా మంది ఇష్టంగానే తింటుంటారు. ఉదయం లేదా సాయంత్రం సమయంలో వీటిని తినాల్సి ఉంటుంది. పండ్లను తినడం వల్ల అనేక పోషకాలు లభిస్తాయి. అవి మనల్ని అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా పలు రకాల పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, పాలిఫినాల్స్, విటమిన్ సి వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇక చలికాలంలో కొన్ని రకాల పండ్లను తినడం వల్ల శరీరం లోపల, బాహ్యంగా వచ్చే వాపులను తగ్గించుకోవచ్చు.
కివి పండ్లు..
చలికాలంలో రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. దీంతో రోజు ఎక్కువ సేపు చీకటి ఉంటుంది. అలాగే శారీరక శ్రమ తక్కువగా చేస్తారు. ఫైబర్ ఉన్న ఆహారాలను సరిగ్గా తీసుకోరు. అధిక క్యాలరీలు ఉండే ఆహారాలను అధికంగా తింటారు. దీని వల్ల శరీరం లోపల, బయట వాపులు ఏర్పడుతాయి. వీటిని తగ్గించేందుకు పలు రకాల పండ్లను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికాలంలో తినాల్సిన పండ్లలో కివి పండ్లు మొదటి స్థానంలో నిలుస్తాయి. ఈ పండ్లలో విటమిన్ సి, ఇ అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరం లోపలి వాపులను తగ్గించడంలో ఎంతగానో సహాయం చేస్తాయి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. కివి పండ్లను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆక్సీకరణ ఒత్తిడి నుంచి శరీరం రక్షించబడుతుంది. కివి పండ్లను నేరుగా తినవచ్చు. లేదా ఇతర పండ్లతో కలిపి సలాడ్ రూపంలోనూ తినవచ్చు.

దానిమ్మ..
దానిమ్మ పండ్లు మనకు చలికాలంలో అధికంగా లభిస్తాయి. వీటిల్లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. పాలిఫినాల్స్ అని పిలవబడే సమ్మేళనాలను ఈ పండ్ల ద్వారా మనం పొందవచ్చు. ఇవి శరీరం లోపల, బయట ఉండే వాపులను తగ్గిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. దానిమ్మ పండ్లను తినడం వల్ల పీసీవోఎస్ తో బాధపడుతున్న మహిళలకు ఎంతగానో ఉపయోగం ఉంటుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో తేలింది. ఈ పండ్లను తినడం వల్ల మహిళల్లో ఉండే వాపులు, ఇన్సులిన్ నిరోధకత తగ్గుతాయి. అలాగే మెనోపాజల్ హార్మోన్ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. కనుక చలికాలంలో మహిళలు దానిమ్మ పండ్లను తింటే మేలు జరుగుతుంది. పురుషులు సైతం వాపులను తగ్గించుకునేందుకు ఈ పండ్లను తినవచ్చు.
నారింజ..
నారింజ పండ్లు కూడా ఈ సీజన్‌లో మనకు అధికంగానే లభిస్తాయి. వీటిల్లో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని వాపులను, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించేందుకు సహాయం చేస్తాయి. విటమిన్ సి వల్ల శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి అవుతుంది. ఇది చర్మాన్ని పగలకుండా ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంచుతుంది. దీని వల్ల చలికాలంలోనూ చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. అలాగే ఈ పండ్లను తింటే ఫైబర్ అధిక మొత్తంలో లభిస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకం తగ్గేలా చేస్తుంది. ఇలా ఈ మూడు రకాల పండ్లను ఈ సీజన్‌లో రోజూ తింటున్నా లేదా అన్నింటినీ కలిపి సలాడ్‌గా చేసి తింటున్నా కూడా ఎంతగానో ఉపయోగం ఉంటుంది. అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
సంబంధిత వార్తలు

Heat Stroke | ఎండల్లో జాగ్రత్త.. హీట్ స్ట్రోక్ వస్తే ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..
మే 21, 2026

Upper Body Strength Yoga | జిమ్ వద్దు.. బరువులూ ఎత్తొద్దు: మీ ‘అప్పర్ బాడీ’ని ఐరన్‌లా మార్చే బెస్ట్ యోగాసనాలు ఇవే!
మే 17, 2026

Eyes Health | కంటి చూపు స్పష్టంగా ఉన్నంత మాత్రాన కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు.. వైద్యులు ఏమంటున్నారు..?
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



