త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhatti Vikramarka | 200 యూనిట్లు దాటితే ఉచిత విద్యుత్ ప‌థ‌కం వ‌ర్తించదు : భ‌ట్టి విక్ర‌మార్క‌

Bhatti Vikramarka | ఉచిత విద్యుత్ ప‌థ‌కంపై డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 200 యూనిట్లు దాటితే ఉచిత విద్యుత్ ప‌థ‌కం వ‌ర్తించ‌దు అని శాస‌న‌స‌భ వేదిక‌గా భ‌ట్టి విక్ర‌మార్క ప్ర‌క‌టించారు.

S

Telangana | Published On Jan 3, 2026, 10.51 am IST

Bhatti Vikramarka | 200 యూనిట్లు దాటితే ఉచిత విద్యుత్ ప‌థ‌కం వ‌ర్తించదు : భ‌ట్టి విక్ర‌మార్క‌
Advertisement

Bhatti Vikramarka | త్రినేత్ర‌.న్యూస్ : ఉచిత విద్యుత్ ప‌థ‌కంపై డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 200 యూనిట్లు దాటితే ఉచిత విద్యుత్ ప‌థ‌కం వ‌ర్తించ‌దు అని శాస‌న‌స‌భ వేదిక‌గా భ‌ట్టి విక్ర‌మార్క ప్ర‌క‌టించారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ఉచిత విద్యుత్ ప‌థ‌కంపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు భ‌ట్టి విక్ర‌మార్క స‌మాధానం ఇచ్చారు.

ఉచిత విద్యుత్ ప‌థ‌కంపై కొన్ని అంశాల‌ను స‌భ్యులు త‌మ దృష్టికి తెచ్చారు. కోటి 15 ల‌క్ష‌ల కుటుంబాలకు గానూ 52 ల‌క్ష‌ల 49 వేల 777 కుటుంబాలు ఉచిత విద్యుత్ ప‌థ‌కాన్ని ల‌బ్ధి పొందుతున్నారు. అంటే 50 శాతానికి పైగా పేద మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాలు ల‌బ్ధి పొందుతున్నారని భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు.

చాలా చోట్ల 200 యూనిట్లు దాటితే మొత్తానికి బిల్లులు వ‌సూలు చేస్తున్నార‌ని స‌భ్యులు తెలిపారు. ఎన్నిక‌ల కంటే ముందు ఇచ్చిన వాగ్దానం మేర‌కు, ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత చేసిన ప్ర‌క‌ట‌న మేర‌కు 200 యూనిట్ల వ‌ర‌కే ఉచిత విద్యుత్ ఇస్తామ‌ని స్ప‌ష్టంగా చెప్పాం. 200 యూనిట్లు దాటితే ఈ ప‌థ‌కం వ‌ర్తించ‌దు. స్కీంలో లేనిది ఇవ్వ‌లేం అని విక్ర‌మార్క స్ప‌ష్టం చేశారు.

కొత్త‌గా వ‌చ్చిన ఇందిర‌మ్మ ఇళ్ల‌కు ఉచిత క‌రెంట్ ఇవ్వాల‌ని అడుగుతున్నారు. ప్ర‌స్తుతం ఇవి నిర్మాణ ద‌శ‌లో ఉన్నాయి. మీట‌ర్లు పెట్టాక 200 యూనిట్ల లోపు వాడుకుంటే ఉచితంగా విద్యుత్ త‌ప్ప‌కుండా ఇస్తామ‌న్నారు. ఇక కొత్త‌గా ఎవ‌రైనా త‌మ నివాసాలు మారితే అలాంటి వారు స్థానికంగా ఉన్న కార్యాల‌యాల్లో ప్ర‌జాపాల‌న ఆఫీస‌ర్ల‌ను సంప్ర‌దించి త‌మ అడ్ర‌స్‌ల‌ను స‌మ‌ర్పిస్తే.. ఉచిత విద్యుత్ ప‌థ‌కం వ‌ర్తింప‌జేస్తామ‌ని విక్ర‌మార్క స్ప‌ష్టం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పేద‌ల‌కు మేలు జ‌ర‌గాల‌ని, రాష్ట్ర ఖ‌జానాపై భారం ప‌డుతున్న‌ప్ప‌టికీ భ‌రిస్తున్నాం. ఆదిలాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో 45990 ఇండ్ల‌కు ఈ ప‌థ‌కం అమ‌ల‌వుతుంది. అలాగే అచ్చంపేట నియోజ‌క‌వ‌ర్గంలో 40555 కుటుంబాలు, జ‌గిత్యాల‌లో 59739 కుటుంబాల‌కు, కామారెడ్డిలో 69492 కుటుంబాలు, కోరుట్ల‌లో 69 వేల కుటుంబాల‌కు, మ‌క్త‌ల్‌లో 40094 కుటుంబాల‌కు, మాన‌కొండూరులో 59 వేల కుటుంబాలు ల‌బ్ధి పొందుతున్నారు. గ‌జ్వేల్‌లో 65 వేల కుటుంబాల‌కు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నాం. సిద్దిపేట‌లో 50300 కుటుంబాల‌కు ఈస్కీం వ‌ర్తిస్తుంది. అద్భుతంగా ఈ స్కీం ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ప్ర‌జ‌లు హ‌ర్షిస్తున్నారు. ఈ ప‌థ‌కాన్ని త‌ప్ప‌నిస‌రిగా కొన‌సాగిస్తామ‌ని విక్ర‌మార్క తేల్చిచెప్పారు.

Advertisement

తాజావార్తలు

Advertisement