త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold Rates In 2026 | 2026లో బంగారం ధ‌ర‌లు ఎలా ఉండ‌బోతున్నాయి..? మ‌రింత పెరుగుతాయా..?

Gold Rates In 2026 | ప్ర‌పంచ వ్యాప్తంగా అంత‌ర్జాతీయ మార్కెట్‌ల‌లో ప్ర‌స్తుతం బంగారం ధ‌ర‌లు పరుగులు పెడుతున్న విష‌యం విదిత‌మే. గ‌తేడాది క‌న్నా ఈ ఏడాది బంగారం ధ‌ర‌లు భారీగా పెరిగాయి. ఆల్ టైమ్ హై రికార్డు స్థాయిలో బంగారం ధ‌ర‌లు మండిపోతున్నాయి.

S

Business | Published On Dec 27, 2025, 12.39 pm IST

Gold Rates In 2026 | 2026లో బంగారం ధ‌ర‌లు ఎలా ఉండ‌బోతున్నాయి..? మ‌రింత పెరుగుతాయా..?
Advertisement

Gold Rates In 2026 | ప్ర‌పంచ వ్యాప్తంగా అంత‌ర్జాతీయ మార్కెట్‌ల‌లో ప్ర‌స్తుతం బంగారం ధ‌ర‌లు పరుగులు పెడుతున్న విష‌యం విదిత‌మే. గ‌తేడాది క‌న్నా ఈ ఏడాది బంగారం ధ‌ర‌లు భారీగా పెరిగాయి. ఆల్ టైమ్ హై రికార్డు స్థాయిలో బంగారం ధ‌ర‌లు మండిపోతున్నాయి. దీంతో ప్ర‌జ‌లు ఓ వైపు ఆందోళ‌న చెందుతూనే మ‌రోవైపు చాన్స్ మిస్ అవుతుంద‌ని చెప్పి అధికంగా బంగారం కొంటున్నారు. ఈ విధంగా కూడా బంగారం ధ‌ర‌లు పెరుగుతున్నాయ‌ని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే రానున్న రోజుల్లో ప‌సిడి ధ‌ర‌లు ఎలా ఉంటాయి..? 2026లో బంగారం ధ‌ర‌లు గతేడాది లాగే ప‌రుగులు పెడ‌తాయా..? లేక మార్కెట్లు స్త‌బ్దుగా ఉంటాయా..? బంగారం ధ‌ర ఇక త‌గ్గే అవ‌కాశం లేదా..? అన్న సందేహాల‌పై ప‌లువురు మార్కెట్ నిపుణులు విశ్లేషించి వివ‌రాల‌ను వెల్ల‌డిస్తున్నారు.

ప‌సిడి ప‌రుగుకు ఇవే కార‌ణాలు..

బంగారం ధ‌ర‌ల‌పై మిరాయ్ అసెట్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ‌ర్స్ (ఇండియా) ఈటీఎఫ్ ప్రొడ‌క్ట్స్ అండ్ ఫండ్ మేనేజ‌ర్ సిద్ధార్థ్ శ్రీ‌వాత్స‌వ మాట్లాడుతూ గ‌తేడాది కాలంగా బంగారం ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగాయ‌న్నారు. బంగారం కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య గ‌ణణీయంగా పెరిగింద‌న్నారు. అలాగే అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ట్రేడ్ వార్ కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా అధిక శాతం మంది పెట్టుబ‌డిదారులు, ప్ర‌జ‌లు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డం త‌గ్గించార‌ని, బంగారంలో పెట్టుబ‌డి పెట్టేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నార‌ని తెలిపారు. బంగారం ఓ సుర‌క్షిత‌మైన పెట్టుబ‌డిగా మారింద‌ని, బంగారం కొంటే సేఫ్ అనే భావ‌న చాలా మందిలో ఏర్ప‌డింద‌ని అన్నారు. అలాగే అమెరికా టారిఫ్‌ల కార‌ణంగా ప్ర‌పంచంలోని ఇత‌ర దేశాల‌కు చెందిన సెంట్ర‌ల్ బ్యాంకులు సైతం డాల‌ర్‌పై ఆధార‌ప‌డ‌డాన్ని త‌గ్గించాల‌ని చూస్తున్నాయ‌ని, అందులో భాగంగానే విదేశీ మార‌క నిల్వ‌ల‌ను త‌గ్గిస్తూ బంగారం నిల్వ‌ల‌ను పెంచుకుంటున్నాయ‌ని తెలిపారు. దీని కార‌ణంగా బంగారం ధ‌ర‌లు ప‌రుగులు పెడుతున్నాయ‌ని అన్నారు.

2026లో ఎలా..?

అయితే బంగారం మాత్ర‌మే కాదు, ఏ మార్కెట్ అయినా స‌రే అప్ర‌తిహ‌తంగా దూసుకుపోతుందంటే అది కేవ‌లం కొంత కాలం మాత్ర‌మేన‌ని, మ‌ళ్లీ ధ‌ర‌లు త‌గ్గాల్సిందేన‌ని తెలిపారు. స్టాక్ మార్కెట్‌ల‌లోనూ కొన్ని సార్లు ఇలాంటి ప్ర‌భావం ఉంటుంద‌ని, ఆ త‌రువాత కొంత కాలం పాటు మార్కెట్ ప‌త‌నం అవుతుంద‌ని, అనంత‌రం మ‌ళ్లీ కొత్త కొనుగోలుదారులు వ‌స్తే మార్కెట్ య‌థావిధిగా ముందుకు సాగుతుంద‌ని తెలిపారు. క‌నుక బంగారం ధ‌ర‌లు ఇప్పుడు ప‌రుగులు పెడుతున్నా రానున్న రోజుల్లో మ‌ళ్లీ చాలా వ‌ర‌కు త‌గ్గే అవ‌కాశాలు ఉంటాయ‌ని తెలిపారు. ఆ స‌మ‌యంలో కొనుగోళ్లు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌న్నారు. క‌నుక పెరుగుతున్న బంగారం ధ‌ర‌ల ప‌ట్ల ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేద‌ని, బంగారం కొన‌లేద‌ని ఒత్తిడికి గురి కావ‌ల్సిన అవస‌రం లేద‌ని తెలిపారు. క‌చ్చితంగా మార్కెట్ అంద‌రికీ అవ‌కాశం క‌ల్పిస్తుంద‌న్నారు. అయితే 2026లో బంగారం ధ‌ర‌లు కాస్త పెరిగే అవ‌కాశం ఉంద‌ని, కానీ మ‌రీ 2025 మాదిరిగా పెర‌గ‌క‌పోవ‌చ్చ‌ని, అమెరికా టారిఫ్‌ల విష‌యంలో స్ప‌ష్ట‌త వ‌స్తే బంగారం ధ‌ర‌లు త‌గ్గుతాయ‌ని అన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement