Laptop | ఆఫీస్ పనికోసం ఎంట్రీ లెవల్ ల్యాప్‌టాప్ కొనాలని చూస్తున్నారా.. ఈ 5 మోడల్స్‌పై లుక్కేయండి..
Laptop | ల్యాప్‌టాప్‌లను కొనే విషయంలో చాలా మంది అనేక సందహాలను వ్యక్తం చేస్తుంటారు. ఎలాంటి అవసరాలకు ఏ కాన్ఫిగరేషన్ కలిగిన ల్యాప్‌టాప్‌ను ఎంచుకోవాలనే ఆలోచిస్తుంటారు. అయితే వ్యక్తిగత అవసరాలను బట్టి డివైస్‌లను ఎంచుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు, ఉద్యోగులు, క్రియేటర్లు ఇలా భిన్న రకాల అవసరాలకు భిన్న కాన్ఫిగరేషన్లు కలిగిన ల్యాప్‌టాప్‌లు పనిచేస్తాయి.
Technology | Published On Jul 4, 2026, 10.45 am IST
Laptop | ల్యాప్‌టాప్‌లను కొనే విషయంలో చాలా మంది అనేక సందహాలను వ్యక్తం చేస్తుంటారు. ఎలాంటి అవసరాలకు ఏ కాన్ఫిగరేషన్ కలిగిన ల్యాప్‌టాప్‌ను ఎంచుకోవాలనే ఆలోచిస్తుంటారు. అయితే వ్యక్తిగత అవసరాలను బట్టి డివైస్‌లను ఎంచుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు, ఉద్యోగులు, క్రియేటర్లు ఇలా భిన్న రకాల అవసరాలకు భిన్న కాన్ఫిగరేషన్లు కలిగిన ల్యాప్‌టాప్‌లు పనిచేస్తాయి. అయితే ఉద్యోగులకు తాము పనిచేసే సాఫ్ట్‌వేర్ లేదా టూల్స్ ఆధారంగా ల్యాప్ టాప్‌లను ఎంచుకోవాల్సి ఉంటుంది. బేసిక్ పనుల కోసమే అయితే ఖరీదైన డివైస్‌లను కొనాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ ధరలోనే ఉత్తమ పనితీరును అందించే ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ రూ.60వేల లోపు ధరకే లభిస్తున్నాయి. అందువల్ల ఉద్యోగులు ఈ ల్యాప్‌టాప్‌లను ఒకసారి పరిశీలిస్తే తమకు కావల్సిన కాన్ఫిగరేషన్ కలిగిన ల్యాప్‌టాప్‌ను సులభంగా కొనుగోలు చేసేందుకు అవకాశాలు ఉంటాయి.
ఏసర్ ఆస్పయిర్ లైట్ 12..
ఏసర్ కంపెనీకి చెందిన ఆస్పయిర్ లైట్ 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్ కలిగిన ల్యాప్‌టాప్ మార్కెట్‌లో రూ.59,990 ధరకు అందుబాటులో ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో ఇంకా తగ్గింపు ధరకే దీన్ని కొనుగోలు చేయవచ్చు. బేసిక్ పనుల కోసం ల్యాప్‌టాప్ కొనాలని చూస్తున్న ఉద్యోగులకు ఇది ఉత్తమ ఎంపికగా ఉంటుంది. ఇది చాలా లైట్ వెయిట్, పోర్టబుల్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. అందువల్ల ప్రయాణాల్లో సులభంగా ఉపయోగించుకోవచ్చు. అలాగే యూజర్లు హార్డ్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేసుకునే చాన్స్ కూడా ఉంటుంది. ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంటుంది. పలు రకాల పోర్టులను కూడా ఇచ్చారు. ఇందులో ఇంటెల్ కోర్ ఐ5-12450హెచ్ ప్రాసెసర్ ఉంది, ఆఫీస్ 2024 ఉచితంగా లభిస్తుంది. 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ వంటి సదుపాయాలను ఇచ్చారు.
హెచ్‌పీ 15, లెనోవో ఐడియా స్లిమ్ 1..
హెచ్‌పీకి చెందిన హెచ్‌పీ 15 ఏఎండీ రైజెన్ 5 ల్యాప్‌టాప్ రూ.55,690 ధరకు లభిస్తోంది. ఇందులో 4 కోర్ ఏఎండీ రైజెన్ 5-7520యు ప్రాసెసర్ ఉంది. బేసిక్ పనులకు చక్కగా సరిపోతుంది. ఈ ల్యాప్‌టాప్ అధిక బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఉన్నాయి. ల్యాప్ టాప్ వేగంగా ఆన్ అవుతుంది. హీట్ ఎక్కువ ఉత్పత్తి అవదు. బడ్జెట్ ఫ్రెండ్లీ విభాగంలో ఈ ల్యాప్‌టాప్ ఉత్తమ ఎంపికగా నిలిచింది. అలాగే లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 1 ల్యాప్‌టాప్ బేసిక్ పనులకు సరిగ్గా సరిపోతుంది. దీని ధర రూ.53,900 ఉండగా, ఇందులో ఏఎండీ రైజెన్ 5-5500యు ప్రాసెసర్ ఉంది. కేవలం 1.5 కిలోల బరువుతో పోర్టబుల్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. అందువల్ల ప్రయాణాల్లో సులభంగా తీసుకెళ్లవచ్చు. ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. ఎక్కువ పోర్టులను ఇచ్చారు. ఫ్యాన్స్ శబ్దం లేకుండా సైలెంట్‌గా రన్ అవుతాయి.
డెల్ 15, వివోబుక్ గో 15..
డెల్ కంపెనీకి చెందిన బేసిక్ ల్యాప్ టాప్‌లను చూస్తున్నవారికి డెల్ 15 ల్యాప్ టాప్ మోడల్ సెట్ అవుతుంది. దీంట్లో ఏఎండీ ఆర్5-7520యు ప్రాసెసర్‌ను ఇచ్చారు. బేసిక్ పనులతోపాటు మెరుగైన బ్యాటరీ బ్యాకప్ కావాలంటే ఈ ల్యాప్‌టాప్‌ను కొనవచ్చు. ఈ ల్యాప్ టాప్ చాలా మంది వినియోగదారులకు విస్తృతంగా అందుబాటులో ఉంది. రోజువారీ బేసిక్ పనులకు చక్కగా సరిపోతుంది. పోర్టులు కూడా ఎక్కువగానే ఇచ్చారు. అలాగే అసుస్‌కు చెందిన వివోబుక్ గో 15 ల్యాప్ టాప్ కూడా ఈ విభాగంలో ఇతర మోడల్స్‌తో పోటీ పడుతోంది. దీంట్లో ఏఎండీ రైజెన్ 5-7520యు ప్రాసెసర్‌ను ఇచ్చారు. ఎంట్రీ లెవల్ సెజ్‌మెంట్‌లో ఈ ల్యాప్‌టాప్ కూడా ఉత్తమంగా నిలుస్తోంది. ఆఫీస్ పనులకు ఇది సరిగ్గా సెట్ అవుతుంది. పలు ప్రైవసీ ఫీచర్లను సైతం ఇచ్చారు. ఓలెడ్ డిస్‌ప్లేను ఇది కలిగి ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ దృఢంగా ఉంటుంది. 180 డిగ్రీ కోణంలో హింజ్ డిజైన్ ఇచ్చారు.
ఇలా ఆయా కంపెనీలకు చెందిన ల్యాప్‌టాప్‌లు ఎంట్రీ లెవల్ విభాగంలో ఉత్తమ ఆప్షన్లుగా ఉన్నాయి. అయితే ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేసేముందు వ్యక్తిగత అవసరాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కావల్సిన కాన్ఫిగరేషన్ కలిగిన మోడల్‌ను ఎంచుకోకపోతే భవిష్యత్తులో హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్‌వేర్ సపోర్ట్ పరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ల్యాప్‌టాప్ అంటే దీర్ఘకాల ఉపయోగంగా భావించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో ఏళ్ల తరబడి మళ్లీ డివైస్‌ను మార్చాల్సిన అవసరం ఉండదు.
సంబంధిత వార్తలు

Laptop Catches Fire | విమానం ల్యాండ్ అవుతుండగా.. ల్యాప్‌టాప్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం
ఆగస్టు 23, 2026

Microsoft | మైక్రోసాఫ్ట్‌కు తొలి వెరా రూబిన్ ఏఐ ప్లాట్‌ఫామ్.. కీలక మైలురాయి..
ఆగస్టు 22, 2026

POCO M8 Power 5G | 8000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్ప్లేతో లాంచ్ అయిన పోకో కొత్త ఫోన్.. ధర ఎంతంటే..
ఆగస్టు 5, 2026
తాజావార్తలు
- ●Varanasi Movie | యాభై భాషల్లో మహేష్‌బాబు వారణాసి రిలీజ్ - రాజమౌళి ప్లానింగ్ వేరే లెవెల్
- ●Gachibowli Building Collapse | టౌన్‌ప్లానింగ్ అధికారిపై వేటు.. బిల్డర్‌పై కేసు.. అంజయ్యనగర్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు
- ●Mobile Phone | సెల్‌ఫోన్ మిస్సింగ్.. కర్రలు, చెప్పులు, బకెట్లతో కొట్టుకున్న ఆంధ్ర, మణిపూర్ విద్యార్థినులు
- ●Free Travel for Women | రాఖీపౌర్ణమి కానుక.. మహిళలతోపాటు మరొకరికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
- ●Nayanthara | నయనతార ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతంటే? - సీక్రెట్ రివీల్ చేసిన లేడీ సూపర్ స్టార్
- ●Vande Bharat Sleeper | వందే భారత్ స్లీపర్ అప్‌గ్రేడ్.. ఇక 24 బోగీలతో పరుగులు..!

Varanasi Movie | యాభై భాషల్లో మహేష్‌బాబు వారణాసి రిలీజ్ - రాజమౌళి ప్లానింగ్ వేరే లెవెల్

Gachibowli Building Collapse | టౌన్‌ప్లానింగ్ అధికారిపై వేటు.. బిల్డర్‌పై కేసు.. అంజయ్యనగర్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు

Mobile Phone | సెల్‌ఫోన్ మిస్సింగ్.. కర్రలు, చెప్పులు, బకెట్లతో కొట్టుకున్న ఆంధ్ర, మణిపూర్ విద్యార్థినులు

Free Travel for Women | రాఖీపౌర్ణమి కానుక.. మహిళలతోపాటు మరొకరికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం



