Lava AGNI 4N | లావా అగ్ని 4ఎన్ స్మార్ట్ ఫోన్.. యూకే మార్కెట్‌లోకి ఎంట్రీ.. ధర ఎంతంటే..?
Lava AGNI 4N | లావా లిమిటెడ్ తాజాగా యునైటెడ్ కింగ్‌డమ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి అధికారికంగా ప్రవేశించింది. ఇందులో భాగంగా లావా అగ్ని 4ఎన్‌ను ఆవిష్కరించింది. యూకే మార్కెట్‌లో కంపెనీ ఫ్లాగ్‌షిప్ అగ్ని సిరీస్‌కు ఇదే తొలి అడుగు. అందుబాటు ధరలో మిడ్-టియర్ నుంచి హై-టియర్ స్థాయి ఫీచర్లను అందించడమే లక్ష్యంగా ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది.
Technology | Published On Sep 1, 2026, 11.52 am IST
Lava AGNI 4N | లావా లిమిటెడ్ తాజాగా యునైటెడ్ కింగ్‌డమ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి అధికారికంగా ప్రవేశించింది. ఇందులో భాగంగా లావా అగ్ని 4ఎన్‌ను ఆవిష్కరించింది. యూకే మార్కెట్‌లో కంపెనీ ఫ్లాగ్‌షిప్ అగ్ని సిరీస్‌కు ఇదే తొలి అడుగు. అందుబాటు ధరలో మిడ్-టియర్ నుంచి హై-టియర్ స్థాయి ఫీచర్లను అందించడమే లక్ష్యంగా ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్ లాంచ్ కోసం ఎస్‌డబ్ల్యూ నెట్‌వర్క్ రూపొందించిన ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో యూకేకు చెందిన డిజిటల్ క్రియేటర్లు డెజీ ఒలాతుంజీ, హ్యారీ పినెరో, మ్యాక్స్ ఖాదర్, జో వెల్లర్, కరియాడ్ ర్యాన్ పాల్గొన్నారు. స్టోరేజ్ పరిమితులు, బ్యాటరీ త్వరగా ఖాళీ కావడం, కెమెరా నాణ్యత సరిగా లేకపోవడం వంటి సాధారణ స్మార్ట్‌ఫోన్ సమస్యలను ప్రస్తావిస్తూ ఒక కల్పిత సపోర్ట్ గ్రూప్ నేపథ్యంలో ఈ ప్రచారాన్ని రూపొందించారు. అనంతరం ఈ సమస్యలకు ప్రత్యామ్నాయంగా అగ్ని 4ఎన్‌ను పరిచయం చేశారు.
4కె కెమెరాలు..
లావా అగ్ని 4ఎన్‌లో 6.67 ఇంచుల 1.5కె అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. ఇది 1220 * 2712 పిక్సల్స్ రిజల్యూషన్, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 2400 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 1.07 బిలియన్ రంగులు, 446 పీపీఐతో వస్తుంది. 100 శాతానికి సమానంగా లేదా అంతకంటే ఎక్కువ ఎన్‌టీఎస్‌సీ కలర్ గ్యామట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణ కూడా ఉన్నాయి. ఫోన్‌లో 4 నానోమీటర్ టెక్నాలజీపై రూపొందించిన మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ అందించారు. డ్యుయల్ సిమ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. రెండు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్లు, మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లను లావా అందించనుంది. వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ ప్రధాన కెమెరాను అందించారు. 8 మెగాపిక్సల్ అల్ట్రా-వైడ్ కెమెరా జతగా ఉంటుంది. వెనుక కెమెరాతో గరిష్ఠంగా 4కె రిజల్యూషన్‌లో 60 ఎఫ్‌పీఎస్ వీడియో రికార్డింగ్ చేయవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇది కూడా 4కె 60 ఎఫ్‌పీఎస్ వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది.
ఏఐ ఫీచర్లు, భారీ బ్యాటరీ..
ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, యూఎస్‌బీ టైప్ సి ఆడియో, స్టీరియో స్పీకర్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం ఐపీ64 రేటింగ్ ఇచ్చారు. కనెక్టివిటీ పరంగా 5జి ఎస్‌ఏ, ఎన్‌ఎస్‌ఏ, డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, వైఫై 6ఈ 802.11 ఏఎక్స్, బ్లూటూత్ 5.4 వంటి ఫీచర్లు ఉన్నాయి. బీడౌ, జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, క్యూజడ్‌ఎస్‌ఎస్ నావిగేషన్ సిస్టమ్స్‌కు సపోర్ట్ చేస్తుంది. యూఎస్‌బీ టైప్ సి 3.2 పోర్ట్ కూడా అందించారు. ఇందులో5000 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీని ఇచ్చారు. 66 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఈ ఫోన్‌లోలావా వాయు ఏఐ వ్యవస్థను యూజర్ ఇంటర్‌ఫేస్‌లో అనుసంధానించింది. వాయిస్ ఆధారిత కాంటెక్స్ట్ ఇంటరాక్షన్స్, సర్కిల్ టు సెర్చ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఏఐ టెక్స్ట్ అసిస్టెంట్, ఏఐ కాల్ సమ్మరీ, డాక్యుమెంట్, ఇమేజ్ అనలైజర్ వంటి ప్రత్యేక టూల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఏఐ ఫోటో ఎడిటర్, ఇమేజ్ జనరేటర్, సీన్ ఆప్టిమైజేషన్ వంటి జనరేటివ్ ఏఐ ఫీచర్లను కూడా ఫోన్‌లో ఇచ్చారు. దీంతో ఫొటో ఎడిటింగ్, ఇమేజ్ క్రియేషన్, సన్నివేశాలను గుర్తించి ఫోటోలను ఆప్టిమైజ్ చేయడం వంటి పనులను ఏఐ ఆధారంగా నిర్వహించవచ్చు.
ధర ఎంతంటే..
యూకేలో లావా అగ్ని 4ఎన్ విక్రయాలు సెప్టెంబర్ 4 నుంచి అమెజాన్ యూకే ద్వారా ప్రారంభం కానున్నాయి. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ కలిగిన వేరియంట్ మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఫాంటమ్ బ్లాక్, లూనార్ మిస్ట్ రంగుల్లో లభించే ఈ వేరియంట్ ధరను 499 పౌండ్లుగా నిర్ణయించారు. యూకేలో అమ్మకాల అనంతర సేవలను ఎస్‌బీఈ లిమిటెడ్‌తో భాగస్వామ్యంతో లావా అందించనుంది. మెయిల్-ఇన్ రిపేర్, రీప్లేస్‌మెంట్ సేవలు అందుబాటులో ఉంటాయి. హార్డ్‌వేర్ లోపాలకు 24 నెలల హ్యాండ్‌సెట్ రీప్లేస్‌మెంట్ వారంటీ, బ్యాటరీకి 12 నెలల వారంటీ, ఫోన్‌తో వచ్చే డేటా కేబుల్‌కు 6 నెలల వారంటీని కంపెనీ అందిస్తోంది.
తాజావార్తలు
- ●Nepal Flash Floods | నేపాల్ జలవిలయం.. 1000 దాటిన మృతులు.. 4000 మంది మిస్సింగ్
- ●Ramchander Rao | కాంగ్రెస్‌ను ఓడించాల్సిందే.. అరెస్టుపై రామచందర్ రావు ఫైర్
- ●PM Modi | విదేశీ ప్రయాణాలు, బంగారం కొనుగోళ్లు వద్దు.. జీడీపీ వృద్ధిపై దేశ ప్రజలకు ప్రధాని అభినందనలు
- ●Gold And Silver Prices Today | నష్టాలకు బ్రేక్.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..
- ●EHS | నిమ్స్‌లో ఎంప్లాయిస్ హెల్త్ స్కీం కౌంటర్స్ ఎత్తేసిన సర్కార్
- ●Medicine Prices | అమెరికన్లకు భారీ ఊరట.. తగ్గనున్న ఔషధాల ధరలు..

Nepal Flash Floods | నేపాల్ జలవిలయం.. 1000 దాటిన మృతులు.. 4000 మంది మిస్సింగ్

Ramchander Rao | కాంగ్రెస్‌ను ఓడించాల్సిందే.. అరెస్టుపై రామచందర్ రావు ఫైర్

PM Modi | విదేశీ ప్రయాణాలు, బంగారం కొనుగోళ్లు వద్దు.. జీడీపీ వృద్ధిపై దేశ ప్రజలకు ప్రధాని అభినందనలు

Gold And Silver Prices Today | నష్టాలకు బ్రేక్.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..



