OPS vs CPS | సెప్టెంబర్ 1 విద్రోహ దినం.. ఓపీఎస్ అమలయ్యేనా..?
OPS vs CPS | కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) అమల్లోకి వచ్చిన సెప్టెంబర్ 1వ తేదీని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు పెన్షన్ విద్రోహ దినంగా జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు సెప్టెంబర్ 1న నిరసనలు వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. పెన్షన్ విద్రోహక దినంపై ఉపాధ్యాయ సంఘాల నేత తానిపర్తి తిరుపతి రావు తీవ్రంగా స్పందించారు.
OPS vs CPS | త్రినేత్ర.న్యూస్ : కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(CPS) అమల్లోకి వచ్చిన సెప్టెంబర్ 1వ తేదీని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు పెన్షన్ విద్రోహ దినంగా జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు సెప్టెంబర్ 1న నిరసనలు వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. పెన్షన్ విద్రోహక దినంపై ఉపాధ్యాయ సంఘాల నేత తానిపర్తి తిరుపతి రావు తీవ్రంగా స్పందించారు.
ఈ రోజు విద్రోహ దినం.. సెప్టెంబర్ 1న రాష్ట్రంలో ఉద్యోగులకు సీపీఎస్ అమలులోకి వచ్చిన రోజు. పాత పింఛన్ రద్దు కాబడిన రోజు. 2003 డిసెంబర్‌లో అప్పటి బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీపీఎస్‌ను తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానాన్ని చట్టబద్దం చేసింది. పదేళ్ల తర్వాత అధికారం కోల్పోయాక జరిగిన, జరుగుతున్నా ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో తాము అధికారంలోకి రాగానే సీపీఎస్‌ను రద్దు చేస్తాం అంటూ మేనిఫెస్టోలో పేర్కొంటూ వస్తుంది కాంగ్రెస్. సాంకేతికంగా ఉన్నది ఉన్నట్లుగా తిరిగి పాత పద్దతికి రావడం సాధ్యం అయితదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే ఇది వరకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం పాత పెన్షన్ స్కీమ్ (OPS) పునఃప్రారంభించాలనే తమ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి రాత పూర్వకంగా తెలియజేశాయి. అయితే 2022 బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దీనిపై వివరణ ఇచ్చింది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ యాక్ట్ ప్రకారం ఎన్‌పిఎస్ చందాదారులు, అంటే రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఉద్యోగులు సేకరించిన కార్పస్‌ను తిరిగి చందాదారులకు కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ జమ చేసే అవకాశం లేదని స్పష్టం చేసింది. అయిననూ గత ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ తమ ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్‌ను అమలు పరుస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. చిత్రం ఏమిటి అంటే 2004లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే సీపీఎస్ విధానాన్ని కట్టుదిట్టంగా అమలు పరచాలని అన్ని రాష్ట్రాలకు హుకుం జారీ చేసింది. ఇప్పుడు అదే కాంగ్రెస్ తమ రాష్ట్రాల్లో రద్దు పరుస్తాం అని హామీ ఇచ్చి కూర్చున్నది. కానీ అమలుకు మాత్రం ముందుకు రావడం లేదు.

తానిపర్తి తిరుపతి రావు
ఎస్ఏ(మ్యాథ్స్), జడ్పీహెచ్ఎస్ పూసాల
పెద్దపల్లి జిల్లా
తాజావార్తలు
- ●KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- ●Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్
- ●KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
- ●Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్
- ●Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు
- ●Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం

KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్

KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్



