Jet Fuel Price Stabilisation Fund | ఏటీఎఫ్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. రూ.10 వేల కోట్లతో నిధి
Jet Fuel Price Stabilisation Fund | కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. విమాన ఇంధన ధరలను స్థిరంగా ఉంచేందుకు రూ.10 వేల కోట్లతో నిధి (Jet Fuel Price Stabilisation Fund)ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
Jet Fuel Price Stabilisation Fund | పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. విమాన ఇంధన ధరలను స్థిరంగా ఉంచేందుకు రూ.10 వేల కోట్లతో నిధి (Jet Fuel Price Stabilisation Fund)ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో నేడు కేంద్ర కేబినెట్ భేటీ అయ్యింది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విమాన ఇంధనం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరల పెరుగుదల వల్ల విమానయాన రంగానికి కలుగుతున్న నష్టాన్ని తగ్గించేందుకు రూ. 10,000 కోట్ల 'ఏటీఎఫ్ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్' ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) వెల్లడించారు. కేంద్రం నిర్ణయంతో విమానయాన సంస్థలపై భారం తగ్గనుంది.
కాగా, మిడిల్ ఈస్ట్‌లో (West Asia) ఇటీవలే చోటుచేసుకున్న పరిణామాల వల్ల అంతర్జాతీయంగా ఏటీఎఫ్ ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చి, మే నెలల మధ్య అంతర్జాతీయ ఏటీఎప్ ధరలు 2.5 రెట్లు పెరిగాయి. అదే సమయంలో దేశీయంగా ఏటీఎఫ్ ధరలు మార్చిలో లీటరుకు రూ.60.5 ఉండగా.. మే నాటికి రూ.142కు చేరుకున్నాయి. దీంతో విమానయాన సంస్థలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలకు ఊరట కల్పిస్తూ.. దేశీయ విమాన సర్వీసుల కోసం ATF ధరను ప్రభుత్వం లీటరుకు రూ. 75.6 గా గరిష్ట పరిమితి (Cap) విధించింది.
Also Read..
జూబ్లీ బస్టాప్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం.. టైర్ల కింద ఇరుక్కుపోయిన బైకర్
అభిమాని చేసిన పనికి షాకైన జాన్వీకపూర్..! అసలేమైందంటే..?
2027లో కచ్చితంగా పాదయాత్ర చేస్తా.. ఆ లోపు ఫిట్ అవుతా : కేటీఆర్
సంబంధిత వార్తలు

Commercial LPG prices hiked | వాణిజ్య సిలిండర్‌పై మళ్లీ బాదుడు.. సీఎన్జీ, జెట్ ఇంధన ధరలూ పెంపు
సెప్టెంబర్ 1, 2026

Cabinet Decisions | రూ. 9,450 కోట్ల భారీ రైల్వే విస్తరణ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం.. ఏపీకి దక్కిన ప్రాధాన్యం
ఆగస్టు 19, 2026

Telangana BJP | బండి అవుట్.. ఈటల, అరుణ ఇన్
ఆగస్టు 18, 2026
తాజావార్తలు
- ●Kharge | లైట్స్.. కెమెరా.. ఇన్‌యాక్షన్‌లా ఆర్థిక వ్యవస్థపై ప్రచారం.. ప్రధాని మోదీపై ఖర్గే సెటైర్లు..!
- ●Rashmika Mandanna | మైసా ఆగమనం అప్పుడే - నెల రోజుల గ్యాప్‌లో రెండు సినిమాలతో రష్మిక డబుల్ ట్రీట్
- ●Sugar Storage | చక్కెర నిల్వలపై కేంద్రం కీలక నిర్ణయం.. డీలర్లకు కొత్త పరిమితి
- ●CJP protest Delhi | ఢిల్లీలో సెప్టెంబర్ 5 నిరసన క్యాన్సిల్.. సుప్రీంకోర్టులో కేంద్రం కీలక ప్రకటనతో సీజేపీ వెనక్కి
- ●MLA Prashanth Reddy | కాంగ్రెస్‌తో మంతనాలు చేయలేదని లక్ష్మీనరసింహస్వామి గుడిలో ఉండి చెబుతున్నా.. కవిత చెప్పగలరా?
- ●PM Modi | ఉగ్రవాదం ఎవరికీ వ్యూహాత్మక సంపదగా మారకూడదు.. ప్రపంచానికి ప్రధాని మోదీ గట్టి సందేశం

Kharge | లైట్స్.. కెమెరా.. ఇన్‌యాక్షన్‌లా ఆర్థిక వ్యవస్థపై ప్రచారం.. ప్రధాని మోదీపై ఖర్గే సెటైర్లు..!

Rashmika Mandanna | మైసా ఆగమనం అప్పుడే - నెల రోజుల గ్యాప్‌లో రెండు సినిమాలతో రష్మిక డబుల్ ట్రీట్

Sugar Storage | చక్కెర నిల్వలపై కేంద్రం కీలక నిర్ణయం.. డీలర్లకు కొత్త పరిమితి

CJP protest Delhi | ఢిల్లీలో సెప్టెంబర్ 5 నిరసన క్యాన్సిల్.. సుప్రీంకోర్టులో కేంద్రం కీలక ప్రకటనతో సీజేపీ వెనక్కి



