Mamitha Baiju | ఓటీటీలోకి సూర్య, మమితా బైజు సూపర్ హిట్ మూవీ – పెళ్లి కాకుండానే హీరోయిన్ తల్లిగా మారితే?
సూర్య, మమితా బైజు హీరోహీరోయిన్లుగా నటించన విశ్వనాథ్ అండ్ సన్స్ థియేటర్లలో 250 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. క్లీన్ ఫ్యామిలీ మూవీగా తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించింది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల తర్వాత విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. సెప్టెంబర్ 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది.
Entertainment | Published On Sep 1, 2026, 12.17 pm IST
Mamitha Baiju | సూర్య, మమితా బైజు హీరోహీరోయిన్లుగా నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ ఇటీవలే థియేటర్లలో రిలీజైన బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 250 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ మూవీకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు.
తమిళంలో రూపొందిన ఈ మూవీ తెలుగులోనూ సేమ్ టైటిల్‌తో రిలీజైంది. రెండు భాషల్లో సూపర్ హిట్‌గా నిలిచింది.
నెల రోజుల తర్వాత...
థియేటర్లలో రిలీజైన సరిగ్గా నెల రోజుల తర్వాత విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటీటీలోకి రాబోతుంది. సెప్టెంబర్ 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు భాషలోనూ విడుదల అవుతోంది.
సీనియర్ హీరోయిన్లు...
విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీలో సీనియర్ హీరోయిన్లు రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించారు.
ఏజ్ గ్యాప్ కాన్సెప్ట్...
ఓ జంట ప్రేమకథకు ఏజ్ గ్యాప్ ఎలా అడ్డంకిగా మారిందనే కాన్సెప్ట్‌కు ఫ్యామిలీ ఎమోషన్స్, సరోగసీ అంశాలను జోడించి దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాను తెరకెక్కించారు. సూర్య, మమితా బైజు యాక్టింగ్, కథ, కామెడీ ఆడియెన్స్‌ను మెప్పించాయి. ఎలాంటి అశ్లీలత, అసభ్యత లేని క్లీన్ మూవీగా నిలిచింది.
ఒలింపిక్ విన్నర్....
సంజయ్ విశ్వనాథ్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధిస్తాడు. తండ్రిపై ఉన్న ద్వేషం కారణంగా ప్రేమ, పెళ్లి లాంటి బంధాలకు దూరంగా ఉంటుంటాడు. సరోగసీ ద్వారా ఓ బిడ్డకు తండ్రిగా మారతాడు సంజయ్. సంజయ్ కొడుకుకు ప్రాణాంతకమైన వ్యాధి వస్తుంది. డబ్బు కోసం ట్రీట్‌మెంట్‌కు సాయం చేయడానికి సరోగసీ ద్వారా సంజయ్ బిడ్డకు జన్మనిచ్చిన మ్యాడీ (మమితా బైజు) అంగీకరిస్తుంది. మ్యాడీ రాకతో సంజయ్ జీవితం ఎలా మారిపోయింది? బాబుకు ట్రీట్‌మెంట్ తర్వాత అమెరికా వెళ్లిపోవాల్సిన మ్యాడీ సంజయ్‌పై కోర్టు లో కేసు వేయడానికి కారణమేమిటి? మ్యాడీ ప్రేమను సంజయ్ అంగీకరించాడా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Adarsha Kutumbam | ఫ్యామిలీ మ్యాన్ .. యాక్షన్ బాట పడితే – ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చేసింది – రిలీజ్ డేట్‌పై క్లారిటీ
సెప్టెంబర్ 12, 2026

Trisha | దళపతి విజయ్ మీటింగ్ – త్రిష షూటింగ్ – ఇద్దరూ లండన్‌లోనే!
సెప్టెంబర్ 12, 2026

Renu Desai | లవ్‌స్టోరీతో రేణుదేశాయ్ రీఎంట్రీ – డైరెక్ట్‌గా ఓటీటీలో మూవీ రిలీజ్
సెప్టెంబర్ 12, 2026
తాజావార్తలు
- ●Jupiter Transit 2026 | 12 ఏళ్ల తర్వాత సింహరాశిలోకి గురుడు.. అదృష్టమంటే ఈ మూడురాశుల వారిదే.. మీ రాశి ఉందో చెక్ చేసుకోండి..!
- ●Horoscope | సెప్టెంబర్ 13 రాశిఫలాలు.. అదృష్టం కలిసి రావాలంటే మీ వంతు ప్రయత్నం చేయాల్సిందే!
- ●Palla Rajeshwar reddy | ఆ 29 ఎకరాల భూమి నాది అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా
- ●Harish Rao | 22ఏ నిషేధిత భూములపై పొంగులేటి అబద్దాల ప్రవాహాన్ని పారించారు
- ●TGPSC | టీజీపీఎస్సీ కీలక ప్రకటన.. 544 అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రరీయన్ పోస్టుల నోటిఫికేషన్ రద్దు
- ●TGSRTC | గణేశ్ ఉత్సవాలు.. ఖైరతాబాద్, బాలాపూర్‌కు ప్రత్యేక బస్సులు

Jupiter Transit 2026 | 12 ఏళ్ల తర్వాత సింహరాశిలోకి గురుడు.. అదృష్టమంటే ఈ మూడురాశుల వారిదే.. మీ రాశి ఉందో చెక్ చేసుకోండి..!

Horoscope | సెప్టెంబర్ 13 రాశిఫలాలు.. అదృష్టం కలిసి రావాలంటే మీ వంతు ప్రయత్నం చేయాల్సిందే!

Palla Rajeshwar reddy | ఆ 29 ఎకరాల భూమి నాది అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా

Harish Rao | 22ఏ నిషేధిత భూములపై పొంగులేటి అబద్దాల ప్రవాహాన్ని పారించారు



