Car Loan EMI | రూ.6 లక్షల విలువ చేసే కార్ కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి..? ఈఎంఐ ఎంత అవుతుంది..?
Car Loan EMI | కారు కొనాలని చాలా మందికి ఉంటుంది. కానీ కేవలం కొందరికి మాత్రమే ఆ స్థోమత ఉంటుంది. అయితే కార్ లోన్ తీసుకునే వెసులుబాటు ఉంది కనుక డౌన్ పేమెంట్ చెల్లిస్తే చాలు, కారును చాలా సులభంగా సొంతం చేసుకోవచ్చు. కానీ కార్ లోన్ ఈఎంఐకి సరిపోయినంత సంపాదన వస్తుందా, లేదా అన్న విషయాన్ని కూడా ముందుగానే బేరీజు వేసుకోవాలి.
Car Loan EMI | కారు కొనాలని చాలా మందికి ఉంటుంది. కానీ కేవలం కొందరికి మాత్రమే ఆ స్థోమత ఉంటుంది. అయితే కార్ లోన్ తీసుకునే వెసులుబాటు ఉంది కనుక డౌన్ పేమెంట్ చెల్లిస్తే చాలు, కారును చాలా సులభంగా సొంతం చేసుకోవచ్చు. కానీ కార్ లోన్ ఈఎంఐకి సరిపోయినంత సంపాదన వస్తుందా, లేదా అన్న విషయాన్ని కూడా ముందుగానే బేరీజు వేసుకోవాలి. లేదంటే సంపాదన లేకుండా కారును కొంటే ఈఎంఐల భారం మెడకు చుట్టుకుంటుంది. దీంతో లోన్ కట్టలేకపోతారు. ఆ తరువాత సమస్యల్లో చిక్కుకుంటారు. అయితే కార్ కొనాలని చూస్తున్నవారు రూ.6 లక్షల విలువైన మోడల్‌ను కనుక కొంటే దానికి డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి, నెలకు ఈఎంఐ ఎంత అవుతుంది, వడ్డీ రేటు ఎంత.. అన్న వివరాలను షోరూం నిర్వాహకులు వెల్లడిస్తున్నారు.
కనీస డౌన్ పేమెంట్..
మార్కెట్‌లో చీప్ అండ్ బెస్ట్ కార్లు చాలా వరకు రూ.6 లక్షల ఎక్స్ షోరూం ధరకు అందుబాటులో ఉన్నాయి. అలాంటి మోడల్స్‌లో టాటా ఆల్ట్రోజ్ కూడా ఒకటి. ఈ కారు ప్రస్తుతం అమ్మకాల్లో టాప్ స్థానంలో ఉంది. ఇక ఈ కార్‌కు చెందిన బేస్ వేరియెంట్ ఎక్స్ షోరూం ధర ఢిల్లీలో రూ.6.30 లక్షలుగా ఉంది. అంటే ఉదాహరణకు కారు ధర రూ.6 లక్షలు అనుకుంటే అందులో కచ్చితంగా కనీసం రూ.1 లక్షను డౌన్ పేమెంట్‌గా చెల్లించాలి. దీని వల్ల 5 ఏళ్ల కాలవ్యవధితో తీసుకునే కార్ లోన్ ఈఎంఐ చాలా వరకు తగ్గుతుంది. ఇక రూ.1 లక్ష డౌన్ పేమెంట్ అనంతరం మిగిలిన రూ.5 లక్షలను లోన్‌గా పొందవచ్చు. చాలా వరకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు చాలా తక్కువ వడ్డీ రేట్లకే కార్ లోన్లను అందిస్తున్నాయి. కనుక కనీసం 9 శాతం వడ్డీ రేటుతో కార్ లోన్ పొందవచ్చు. ఈ క్రమంలో లోన్ కాలవ్యవధిని 5 ఏళ్లకు పెట్టుకుంటే అప్పుడు ఫిక్స్‌డ్ వడ్డీ రేటును పొందవచ్చు. దీంతో లోన్ ముగిసే వరకు కూడా వడ్డీ రేటు ఒకే విధంగా ఉంటుంది.

రూ.5 లక్షల లోన్‌కు..
ఇక రూ.1 లక్ష డౌన్ పేమెంట్ పోను మిగిలిన రూ.5 లక్షలకు కార్ లోన్‌ను 9 శాతం ఫిక్స్‌డ్ వడ్డీ రేటుతో 5 ఏళ్ల కాలవ్యవధికి తీసుకుంటే అప్పుడు నెలకు దాదాపుగా ఈఎంఐ రూ.10,379 వరకు అవుతుంది. ఇది చాలా మందికి బడ్జెట్‌లోనే ఉంటుంది. నెలకు రూ.50వేల వరకు వేతనం పొందేవారు లేదా ఆదాయం వచ్చే వారు చాలా సులభంగా ఈ ఈఎంఐని చెల్లించవచ్చు. ఇక 5 ఏళ్ల కాలవ్యవధిలో మొత్తం వినియోగదారుడు చెల్లించే వడ్డీ రూ.1,22,751 అవుతుంది. దీంతో కార్ లోన్ మొత్తం వడ్డీతో కలుపుకుని రూ.6,22,751 చెల్లిస్తారు. దీనికి ముందుగా చెల్లించిన డౌన్ పేమెంట్‌ను కూడా కలిపితే అప్పుడు కారు ధర రూ.7,22,751 అవుతుంది. ఈ విధంగా తక్కువ వడ్డీతో కార్ లోన్ ను కార్ ను ఎవరైనా సరే సొంతం చేసుకోవచ్చు.
రూ.16 లక్షల లోన్‌కు..
అయితే ఇంకాస్త ఎక్కువ ఆదాయం ఉండి, కాస్త పెద్ద కారు కావాలని కోరుకునేవారు రూ.20 లక్షలకు కారును కొనుగోలు చేస్తే అప్పుడు కూడా పైన తెలిపిన సూత్రం ప్రకారమే డౌన్ పేమెంట్‌ను చెల్లించాలి. దీంతో ఈఎంఐ భారం తగ్గుతుంది. ఉదాహరణకు కారు ధర రూ.20 లక్షలు అయితే రూ.4 లక్షలను డౌన్ పేమెంట్‌గా చెల్లించాలి. దీంతో రూ.16 లక్షలను లోన్‌గా తీసుకోవచ్చు. అప్పుడు 9 శాతం వడ్డీ రేటు అనుకుంటే 5 ఏళ్ల కాలవ్యవధికి నెలకు ఈఎంఐ రూ.33,213 మాత్రమే అవుతుంది. ఈ క్రమంలో నెలకు అధిక ఆదాయం లేదా వేతనం వచ్చేవారికి ఈ ఈఎంఐని చెల్లించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇలా కార్ లోన్‌ను ముందుగానే పూర్తిగా లెక్కించి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో లోన్‌ను సులభంగా చెల్లించి చివరకు కార్‌ను సొంతం చేసుకోవచ్చు. పైగా ఈఎంఐల భారం, ఆర్థిక భారం పడకుండా ఉంటుంది. ఇలా మధ్య తరగతి వారికి కూడా కార్ చాలా సులభంగా సొంతమవుతుంది.
సంబంధిత వార్తలు

Credit Cards | క్రెడిట్ కార్డులను ఇలా వాడితేనే లాభం.. లేదంటే అప్పుల భారం..
మే 16, 2026

Home Loan | హోం లోన్‌ను 10 ఏళ్లు ముందుగానే ముగించాలంటే ఏం చేయాలి.. చాట్ జీపీటీ ఆసక్తికర సమాధానం..
మే 5, 2026

Home Loan Interest | హోం లోన్ తీసుకుంటున్నారా..? ఈ చిన్న సూచన పాటిస్తే భారీ ఎత్తున వడ్డీ ఆదా అవుతుంది..!
ఫిబ్రవరి 15, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



