Loan Recovery Agents | లోన్ తీసుకుని కట్టకపోతే నరకమే.. పెరిగిపోతున్న రికవరీ ఏజెంట్ల దారుణాలు..
Loan Recovery Agents | అభయ్ (పేరు మార్చాం) అనే 40 ఏళ్ల వ్యక్తి ఢిల్లీలో నివాసం ఉంటున్నాడు. తన భార్య అత్యవసర వైద్య చికిత్స కోసం కొంత అప్పు చేశాడు. మొదట కొన్ని నెలలు అతను లోన్‌ను సరిగ్గానే టైముకు చెల్లించాడు. కానీ ఒక్క నెల లోన్ ఈఎంఐ మిస్ అయింది. దీంతో రికవరీ ఏజెంట్లు అతన్ని వేధించడం మొదలు పెట్టారు.
Loan Recovery Agents | అభయ్ (పేరు మార్చాం) అనే 40 ఏళ్ల వ్యక్తి ఢిల్లీలో నివాసం ఉంటున్నాడు. తన భార్య అత్యవసర వైద్య చికిత్స కోసం కొంత అప్పు చేశాడు. మొదట కొన్ని నెలలు అతను లోన్‌ను సరిగ్గానే టైముకు చెల్లించాడు. కానీ ఒక్క నెల లోన్ ఈఎంఐ మిస్ అయింది. దీంతో రికవరీ ఏజెంట్లు అతన్ని వేధించడం మొదలు పెట్టారు. అసభ్య పదాలతో దూషిస్తూ అతన్ని మాటలతో వేధించడమే కాకుండా ఇల్లు, ఆఫీస్‌కు వచ్చి అతనిపై దాడి చేసేందుకు కూడా యత్నించారు. లోన్ చెల్లించాలని, లేకపోతే హింసిస్తామని బెదిరింపులకు సైతం పాల్పడ్డారు. ఇది కేవలం అభయ్‌కు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ప్రస్తుతం చాలా మంది రుణ గ్రహీతలకు ఎదురవుతున్న సమస్యే. లోన్ కట్టకపోతే బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు చట్ట ప్రకారం వెళ్లకుండా రుణ గ్రహీతలను బెదిరిస్తూ హింసకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలోనే లోన్ రికవరీ ఏజెంట్ల దారుణాలు కూడా రోజు రోజుకీ పెరిగిపోతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.
వేధింపుల కాల్స్ అధికం..
లోన్ కట్టని రుణ గ్రహీతలకు న్యాయ సహాయం అందిస్తున్న ఓ నిపుణుల బృందం తాజాగా వెల్లడించిన గణాంకాలు అందరినీ షాక్‌కు గురి చేస్తున్నాయి. తాము 35వేల మందికి పైగా లోన్ కట్టని రుణ గ్రహీతలకు ఇప్పటి వరకు న్యాయ సహాయం అందించామని వారు తెలిపారు. ఈ క్రమంలోనే వారిలో 39 శాతం మంది తమకు రికవరీ ఏజెంట్ల నుంచి వేధింపుల కాల్స్ వచ్చినట్లు తెలిపారు. అలాగే వారిలో మరో 28 శాతం మందికి లోన్ చెల్లించాలనే వేధింపుల కాల్స్ మరీ ఎక్కువగా వచ్చాయని తెలిపారు. చాలా మంది బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు చెందిన రికవరీ ఏజెంట్లు వారికి ఆ విధమైన కాల్స్ చేశారని తెలిపారు. ఇక 11 శాతం మంది బాధితుల ఇళ్లు, ఆఫీసులకు లోన్ రికవరీ ఏజెంట్లు వచ్చి వేధింపులకు గురి చేసినట్లు వెల్లడించారు. అలాగే మరో 8 శాతం మందికి లోన్ రికవరీ ఏజెంట్ల నుంచి పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పి బెదిరింపు కాల్స్ వచ్చాయని అన్నారు. ఇలా ఏటా లోన్ రికవరీ ఏజెంట్ల చర్యలు మరింతగా పెరుగుతున్నాయని తెలిపారు.

లోన్ ఎందుకు చెల్లించలేకపోతున్నారంటే..?
ఇక రుణ గ్రహీతలు లోన్ ఈఎంఐలను సరిగ్గా ఎందుకు చెల్లించడం లేదు అనే కారణాలను కూడా ఆ నిపుణల బృందం వెల్లడించింది. వారిలో 31 శాతం మందికి అధిక ఈఎంఐల భారం ఉండడం కారణంగా లోన్ చెల్లించలేదని తేలింది. అలాగే మరో 28 శాతం మందికి జీతం కన్నా అధిక మొత్తంలో ఈఎంఐలే ఉన్నాయని తేల్చారు. మరో 19 శాతం మంది అత్యధిక లోన్లు తీసుకోవడం వల్ల ఈఎంఐలను సరిగ్గా చెల్లించలేదు. 12 శాతం మంది మెడికల్ లాంటి అత్యవసర వైద్య ఖర్చుల కారణంగా లోన్ తీసుకుని ఆ తరువాత దాన్ని చెల్లించలేకపోయారని, అందుకనే రుణ గ్రహీతలు చాలా మంది ఈఎంఐలను సరిగ్గా కట్టడం లేదని తేల్చారు.
క్రిమినల్ మార్గాలను అనుసరిస్తున్నారు..
కాగా సదరు నిపుణుల బృందానికి చెందిన డైరెక్టర్ అనురాగ్ మెహ్రా ఈ విషయంపై మాట్లాడుతూ చాలా మంది లోన్ తీసుకున్న తరువాత సరిగ్గా ఈఎంఐలను చెల్లించడం లేదని, అయితే ఈఎంఐ లేదా క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకపోతే దాన్ని క్రిమినల్ కేసుగా చూస్తున్నారని, అది నేరం కాదని, కేవలం రెండు పార్టీల మధ్య తలెత్తే ఒక సివిల్ తగాదా అని తెలిపారు. దీనికి బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు క్రిమినల్ విధానంలో వెళ్తున్నాయని, లోన్లను, బిల్లులను రికవరీ చేసేందుకు నేర మార్గాన్ని అనుసరిస్తున్నాయని, ఆర్‌బీఐ నియమాల ప్రకారం ఇది చాలా తప్పని, శిక్షార్హమైన నేరమని తెలిపారు. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు చట్ట ప్రకారం లోన్‌ను రికవరీ చేసుకోవాలని, క్రిమినల్ మార్గాన్ని అనుసరించడం కరెక్ట్ కాదని అన్నారు. కానీ చాలా వరకు బ్యాంకులు ఆర్‌బీఐ నియమాలను పాటించడం లేదన్నారు. ఈ క్రమంలోనే ప్రైవేటు బ్యాంకులు ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నాయని, ఆ బ్యాంకులపైనే బాధితులు ఎక్కువగా ఫిర్యాదు చేస్తున్నారని అన్నారు.

న్యాయ సలహా అవసరం..
ఆర్‌బీఐ తెలిపిన గణాంకాల ప్రకారం 2023-24 కాలానికి గాను ప్రైవేటు సెక్టార్ బ్యాంకులపై వినియోగదారుల ఫిర్యాదులు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 34.39 శాతం పెరిగాయని, 2024-25 కాలానికి ఆ ఫిర్యాదుల సంఖ్య ఏకంగా 37.53 శాతానికి పెరిగిందని అన్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రైవేటు బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు అసలు ఆర్‌బీఐ నియమాలను పాటించడం లేదని అర్థమవుతుందని తెలిపారు. అయితే రుణ గ్రహీతలు లోన్ చెల్లించకపోయినా, క్రెడిట్ కార్డుల బిల్లులు కట్టే స్థితిలో లేకపోయినా న్యాయ సహాయం తీసుకోవచ్చని అన్నారు. కానీ చాలా మందికి ఈ విషయంపై అవగాహన లేదన్నారు. ఈ కారణంగా రికవరీ ఏజెంట్ల వేధింపులకు గురవుతున్నారని, కొందరు ప్రాణాలను సైతం కోల్పోతున్నారని అన్నారు. అలాంటి బాధితులకు న్యాయ సలహా అందిస్తే రికవరీ ఏజెంట్ల వేధింపులను చాలా వరకు తగ్గించవచ్చని అన్నారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






