Pre Approved Loans | ప్రీ అప్రూవ్డ్ లోన్స్ అంటే ఏమిటి..? వీటిని తీసుకుంటే ఏమవుతుంది..?
Pre Approved Loans | ప్రస్తుత కాలంలో చాలా వరకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ కస్టమర్లకు ప్రీ అప్రూవ్డ్ లోన్స్‌ను అందిస్తున్నాయి. ఇవి పర్సనల్ లేదా హోమ్ లోన్, కార్ లోన్, టూ వీలర్ లోన్.. ఇలా ఉంటున్నాయి. చాలా మందికి ప్రీ అప్రూవ్డ్ ఆఫర్లు ఉన్నాయంటూ మెసేజ్‌లు కూడా వస్తున్నాయి.
Pre Approved Loans | ప్రస్తుత కాలంలో చాలా వరకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ కస్టమర్లకు ప్రీ అప్రూవ్డ్ లోన్స్‌ను అందిస్తున్నాయి. ఇవి పర్సనల్ లేదా హోమ్ లోన్, కార్ లోన్, టూ వీలర్ లోన్.. ఇలా ఉంటున్నాయి. చాలా మందికి ప్రీ అప్రూవ్డ్ ఆఫర్లు ఉన్నాయంటూ మెసేజ్‌లు కూడా వస్తున్నాయి. దీంతో ముందు వెనుక చూడకుండా లోన్ ఇస్తున్నారు కదా అని చెప్పి కొందరు ఎడా పెడా లోన్లను తీసుకుంటున్నారు. ఆ తరువాత ఇబ్బందుల్లో పడుతున్నారు. అయితే అసలు ప్రీ అప్రూవ్డ్ లోన్స్ అంటే ఏమిటి..? వీటిని బ్యాంకులు ఎందుకు ఇస్తాయి..? వీటికి, సాధారణ లోన్లకు తేడా ఏమిటి..? ప‌్రీ అప్రూవ్డ్ లోన్లను తీసుకుంటే ఏమవుతుంది..? అన్న వివరాలను ఆర్థిక నిపుణులు తెలియజేస్తున్నారు.
తక్కువ రిస్క్ కలిగిన కస్టమర్లకు..
ప్రీ అప్రూవ్డ్ లోన్స్ అంటే కొత్త కస్టమర్లకు ఇచ్చే లోన్లు కాదు. ఇప్పటికే బ్యాంకులో లేదా ఏదైనా ఆర్థిక సంస్థలో కస్టమర్‌గా ఉన్నవారికి ప్రీ అప్రూవ్డ్ లోన్స్ ఇస్తారు. బ్యాంకుల్లో అయితే కస్టమర్ నిర్వహించే లావాదేవీలు, అతని బ్యాంకు బ్యాలెన్స్, క్రెడిట్ కార్డు లేదా ఈఎంఐ చెల్లింపులు ఎలా చేస్తున్నారు, అతను సేవింగ్స్ చేస్తున్నాడా.. అన్న విషయాలను పరిశీలించి కస్టమర్ రిస్క్ ప్రొఫైల్‌ను విశ్లేషిస్తారు. ఈ క్రమంలో ఆ ప్రొఫైల్ తమ నిబంధనలకు అనుగుణంగా చాలా తక్కువ రిస్క్‌ను కలిగి ఉంటే అలాంటి కస్టమర్లకు వారి వేతనం లేదా ఆదాయాన్ని బట్టి నిర్దిష్టమైన మొత్తంలో లోన్‌ను ప్రీ అప్రూవ్ చేస్తారు. అంటే బ్యాంకులు లోన్ ప్రాసెస్‌ను ముగించేస్తాయన్నమాట. కస్టమర్ కేవలం అంగీకారం మాత్రమే తెలపాల్సి ఉంటుంది. ఎంత లోన్ కావాలి, నెలకు ఎంత చెల్లిస్తారు, ఎన్ని ఈఎంఐలు పెట్టాలి, వడ్డీ ఎంత అన్న వివరాలను మాత్రమే తెలుసుకుని కస్టమర్ అంగీకారం తెలిపితే చాలు, కొన్ని క్షణాలు లేదా గంటల్లోనే లోన్ వస్తుంది. డబ్బులు కస్టమర్ బ్యాంకు ఖాతాలోకి క్రెడిట్ అవుతాయి.

వెంటనే లోన్ పొందే వీలు..
ఇక బ్యాంకులు కాకుండా ఆర్థిక సంస్థలు అయినా కూడా దాదాపుగా ఇదే విధానాన్ని పాటిస్తాయి. అప్పటికే ఎవరైనా కస్టమర్ లోన్‌ను క్లోజ్ చేసి ఉంటే అతనికి మళ్లీ లోన్ ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తాయి. కస్టమర్ క్రెడిట్ ప్రొఫైల్, రిస్క్ ప్రొఫైల్‌ను వారు లోన్ ముగిశాక మళ్లీ విశ్లేషిస్తారు. తమకు అనుకూలంగా ఉంటే ఆ కస్టమర్‌కు మళ్లీ లోన్ ఇస్తారు. అయితే కస్టమర్ మళ్లీ లోన్‌కు అప్లై చేయాల్సిన పనిలేకుండా ఆర్థిక సంస్థ వారే లోన్‌ను ముందుగానే ప్రాసెస్ చేసి ఉంచుతారు. ఈ క్రమంలోనూ కస్టమర్ తన అంగీకారాన్ని తెలిపితే చాలు, వెంటనే లోన్ వచ్చేస్తుంది. ఇక ఇతర విషయాలను కూడా లోన్ తీసుకునే సమయంలో చెక్ చేసుకుంటే చాలు, దీంతో కస్టమర్ వెంటనే లోన్ పొందగలుగుతాడు. ఇలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రీ అప్రూవ్డ్ లోన్స్ ను అందిస్తుంటాయి.
అందుకనే ఈ లోన్స్‌ను ఇస్తారు..
ప్రీ అప్రూవ్డ్ లోన్స్ అంటే బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు కస్టమర్ ప్రొఫైల్ బాగుంటే లోన్‌ను ప్రాసెస్ చేసి ఉంచుతాయి. కస్టమర్ అంగీకరించిన వెంటనే లోన్‌ను ఇచ్చేస్తాయి. దీంతో లోన్ ప్రక్రియకు పెద్ద సమయం పట్టదు. అదే సాధారణ పద్ధతిలో లోన్‌ను అప్లై చేస్తే కొన్ని రోజుల వరకు సమయం పడుతుంది. కనుకనే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రీ అప్రూవ్డ్ లోన్స్ ను ఇస్తుంటాయి. పైగా అప్పటికే కస్టమర్ తమతోపాటు చాలా కాలం నుంచి ఆర్థిక లావాదేవీల్లో ఉండడం, అతని ప్రొఫైల్ బాగుండడం వల్ల ఆయా సంస్థలకు తక్కువ రిస్క్ ఉంటుంది. అంటే అలాంటి కస్టమర్లు లోన్‌ను కచ్చితంగా చెల్లిస్తారని ఆయా సంస్థలకు నమ్మకం అన్నమాట. కనుకనే అలాంటి వారికి ప్రీ అప్రూవ్డ్ లోన్స్ ను ఇస్తుంటారు. ఇది వేగవంతమైన ప్రక్రియ మాత్రమే కాదు ఇటు కస్టమర్లకు, అటు బ్యాంకులకు కూడా చాలా అనువుగా ఉంటుంది. దీని వల్ల బ్యాంకులు కూడా కస్టమర్ చెల్లిస్తాడా, లేదా అన్న భయంతో ఉండాల్సిన పనిలేదు. ప్రొఫైల్ రిస్క్ తక్కువ కనుక కచ్చితంగా చెల్లిస్తాడనే నమ్మకంతోనే ప్రీ అప్రూవ్డ్ లోన్స్ ఇస్తారు. ఇలా ఈ లోన్స్ పనిచేస్తాయి.

అవసరం అయితేనే..
అయితే చాలా మందికి అలాంటి ప్రొఫైల్ ఉంటుంది. దీంతో అలాంటి వారికి బ్యాంకులు సులభంగా లోన్లను ఇస్తుంటాయి. అందుకు గాను ఎస్ఎంఎస్‌లు, వాట్సాప్ మెసేజ్‌లు, మెయిల్స్ కూడా పంపిస్తుంటారు. ఈ క్రమంలో కస్టమర్ కొన్ని నిమిషాల్లో లేదా గంటల్లోనే లోన్ పొందేందుకు వీలుంటుంది. అయితే ఈ ప్రక్రియ బాగానే ఉంటుంది. కానీ కొందరు వినియోగదారులు తమకు అవసరం ఉన్నా లేకపోయినా ప్రీ అప్రూవ్డ్ లోన్స్ ఆఫర్ ఉందని చెప్పి లోన్లను అధికంగా తీసుకుంటారు. కానీ నెల నెలా తమకు పడే ఆర్థిక భారాన్ని పట్టించుకోరు. దీంతో ఒకానొక దశలో ఈఎంఐలను చెల్లించలేకపోతారు. అప్పుడు తక్కువ రిస్క్ కస్టమర్ ప్రొఫైల్ కాస్తా అధిక రిస్క్ కలిగిన ప్రొఫైల్‌గా మారుతుంది. ఈ క్రమంలో అలాంటి వారికి అప్పటి నుంచి మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ తరువాత నిజమైన అవసరానికి లోన్ కావాలన్నా లభించదు. ఇలా కొందరు అనవసరంగా తమ మంచి క్రెడిట్ ప్రొఫైల్‌ను కూడా రిస్కీగా మార్చుకుంటారు. కనుక లోన్ ప్రీ అప్రూవ్డ్ అయినా సరే అవసరం ఉంటేనే తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే అనవసరంగా ఈఎంఐల భారం పెరిగి చివరకు లోన్ కట్టలేని పరిస్థితి వస్తుందంటున్నారు.
లోన్‌ను తీసుకుంటే..
ఇక ప్రీ అప్రూవ్డ్ లోన్స్ ను అవసరం ఉండి తీసుకునే వారు కూడా కొన్ని సూచనలను పాటించాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు తెలియజేస్తున్నారు. ప్రీ అప్రూవ్డ్ లోన్స్ నేపథ్యంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కస్టమర్లకు తెలియకుండా కొన్ని చార్జిలను విధిస్తాయని, కనుక అలాంటి చార్జిలు ఏమైనా ఉన్నాయా అని కచ్చితంగా ముందుగానే తెలుసుకోవాలని చెబుతున్నారు. లేదంటే భారీగా చార్జిలను చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే ప్రీ అప్రూవ్డ్ లోన్స్ కు వడ్డీ రేటు అధికంగా ఉంటుందని, తక్కువ రిస్క్ కలిగిన కస్టమర్ కనుక వడ్డీ రేటు ఎంత విధించినా సులభంగా కట్టేస్తారు అనే భావనతో వడ్డీ రేటును అధికంగా విధిస్తారని తెలిపారు. కనుక వడ్డీ రేటును గమనించాలని తెలిపారు. అలాగే ప్రాసెసింగ్ ఫీజు, ఇతర చార్జిల వివరాలను కూడా ముందుగానే కనుక్కోవాలని అన్నారు. ఇక చివరిగా.. ప్రీ అప్రూవ్డ్ లోన్ తీసుకునే వారు తమకు ఉన్న ఖర్చులు, వేతనం, ఆదాయం వంటి వివరాలను బేరీజు వేసుకుని ఎంత ఈఎంఐ అయితే కట్టగలము అన్న విషయాన్ని ముందే తెలుసుకుని ఆ ప్రకారంగా లోన్ తీసుకోవాలని సూచిస్తున్నారు. దీని వల్ల ఈఎంఐల భారం పెరగకుండా ఉంటుందని చెబుతున్నారు.
సంబంధిత వార్తలు

HDFC Bank | హెచ్డీఎఫ్సీ బ్యాంకులో లోన్ తీసుకున్న వారికి గుడ్ న్యూస్.. తగ్గిన వడ్డీ రేట్లు..
మే 8, 2026

Home Loan | హోం లోన్ తీసుకుంటున్నారా.. బెస్ట్ డీల్ లభించాలంటే క్రెడిట్ స్కోర్ ఎంత ఉండాలి..?
మే 3, 2026

Home Buying | ఇంటిని కొనుగోలు చేస్తున్నారా.. ఈ విషయాలను తెలుసుకోవడం తప్పనిసరి..
ఏప్రిల్ 25, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



