Car Loan 2026 | కార్ కొనాలనుకుంటే 2026 మార్చిలోపు కొనేయండి.. ఎందుకంటే..?
Car Loan 2026 | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఈమధ్యనే రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన విషయం విదితమే. ఈ క్రమంలోనే బ్యాంకులు ఆ రేటుకు అనుగుణంగా రుణాలపై వసూలు చేస్తున్న వడ్డీ రేట్లను కూడా తగ్గించాయి. దీంతో కారు, ఇంటి రుణాల వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గాయి.
Car Loan 2026 | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఈమధ్యనే రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన విషయం విదితమే. ఈ క్రమంలోనే బ్యాంకులు ఆ రేటుకు అనుగుణంగా రుణాలపై వసూలు చేస్తున్న వడ్డీ రేట్లను కూడా తగ్గించాయి. దీంతో కారు, ఇంటి రుణాల వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గాయి. దీని వల్ల వినియోగదారులు నెలవారిగా చెల్లించాల్సిన ఈఎంఐ రుసుము కూడా భారీగానే తగ్గింది. ఇక వడ్డీ రేట్లు తగ్గడంతో ప్రస్తుతం చాలా మంది ఇంటి రుణాలతోపాటు కార్ రుణాలను కూడా తీసుకునేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే కొత్త సంవత్సరంలో కార్లను కొనాలని చాలా మంది ప్లాన్ చేస్తున్నారు. కానీ నూతన సంవత్సరంలో కార్‌ను కొనే ఉద్దేశం ఉంటే మార్చి లోపు కార్‌ను తీసుకోవాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
తక్కువ వడ్డీ రేట్లు..
ఈ ఆర్థిక సంవత్సరం 2026 మార్చితో ముగుస్తుందన్న విషయం తెలిసిందే. అయితే అప్పటి వరకు ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లు యథావిధిగా ఉంటాయని సమాచారం. ఆ తరువాత వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. కనుక మార్చి లోపు కార్‌ను కొనాలని, అలాగే ఇంటి రుణాలు తీసుకునే వారికి కూడా ఇది వర్తిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కనుక ఇల్లు లేదా కార్ లోన్ తీసుకుంటే మార్చి లోపు ఆ పని పూర్తి చేయాలని అంటున్నారు. ఇక ప్రస్తుతం చాలా వరకు బ్యాంకులు కార్ లోన్లపై చాలా తక్కువ మొత్తంలో వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. అలాగే పలు బ్యాంకుల్లో ప్రాసెసింగ్ ఫీజును కూడా వసూలు చేయడం లేదు.
ఈ బ్యాంక్‌లో వడ్డీ చాలా తక్కువ..
కార్ లోన్ తీసుకోవాలనుకునే వారికి అన్నింటి కన్నా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే చాలా తక్కువ మొత్తంలో వడ్డీ రేటుకు రుణం అందిస్తున్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 7.40 నుంచి 9.45 మధ్య కార్ లోన్ ఇస్తున్నారు. క్రెడిట్ హిస్టరీ, సిబిల్ బాగుంటే అతి తక్కువగా 7.40 శాతం వడ్డీ రేటుకే లోన్ పొందవచ్చు. ఇక 5 ఏళ్ల కాలానికి గాను రూ.5 లక్షల కార్ లోన్ తీసుకుంటే నెలకు ఈఎంఐ దాదాపుగా రూ.10వేల వరకు అవుతుంది. ఇక ఈ బ్యాంకులో కార్ లోన్‌పై రూ.1000 వరకు ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తున్నారు. ఇక ఆ తరువాత పంజాబ్ నేషనల్ బ్యాంకులో తక్కువ వడ్డీ రేటుకు కార్ లోన్ లభిస్తోంది. ఈ బ్యాంకులో 7.55 నుంచి 9.45 శాతం మేర వడ్డీ రేటుతో కార్ లోన్ పొందవచ్చు. ప్రాసెసింగ్ ఫీజు 0.25 శాతం వరకు వసూలు చేస్తున్నారు.
ఏయే బ్యాంకులో ఎంత..?
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 8.15 నుంచి 11.60 శాతం మధ్య వడ్డీ రేటును కార్ లోన్‌పై అందిస్తుండగా, రూ.2వేల వరకు ప్రాసెసింగ్ ఫీజు తీసుకుంటున్నారు. కెనరా బ్యాంక్‌లో 7.45 నుంచి 11.45 శాతం వడ్డీ రేటు ఉండగా, కొన్ని రోజుల వరకు ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేస్తున్నట్లు తెలిపారు. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కార్ లోన్లపై వడ్డీ రేటు 7.60 నుంచి 12.65 శాతం వరకు ఉండగా, 0.25 శాతం మేర ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. యూకో బ్యాంక్‌లో 7.60 నుంచి 10.25 శాతం వరకు వడ్డీ రేటు ఉంది, ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేదు. ఎస్‌బీఐలో కార్ లోన్‌పై 8.7 శాతం ఫిక్స్‌డ్ వడ్డీ రేటును అందిస్తుండగా, రూ.1500 వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. ఐడీబీఐ బ్యాంకులో 7.35 నుంచి 11.95 శాతం వడ్డీ రేటు ఉంది. రూ.2500 ప్రాసెసింగ్ ఫీజు ఇవ్వాలి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (7.45 నుంచి 11.75), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (7.55 నుంచి 12 శాతం), ఐసీఐసీఐ (8.50), హెచ్‌డీఎఫ్‌సీ (8.20), కర్ణాటక బ్యాంక్ (8 నుంచి 11.50 శాతం), ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ 9.99 శాతం వడ్డీ రేటును కార్ లోన్‌పై ఇస్తుండగా, ఈ బ్యాంకులు అన్నింటిలోనూ 0.25 నుంచి 0.5 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తున్నారు. అయితే 2026 మార్చి లోపు కార్‌ను కొంటే ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది. ఆ తరువాత మారే అవకాశం ఉంటుంది. కనుక కార్ లేదా ఇల్లును కొంటే ఇప్పుడే కొనేయాలని సూచిస్తున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






