Amazon Pay FD | అమెజాన్ పే యాప్‌లో ఇకపై ఎఫ్‌డీ కూడా చేయవచ్చు.. ఆసక్తికరమైన వడ్డీ రేట్లు..
Amazon Pay FD | ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇప్పటికే అమెజాన్ పే పేరిట యూపీఐ ద్వారా నగదు ట్రాన్స్‌ఫర్, బిల్లు చెల్లింపుల సేవలను అందిస్తున్న విషయం విదితమే. ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ చెల్లింపుల యాప్స్ ప్రస్తుతం పలు బిల్లు చెల్లింపులకు గాను సర్వీస్ చార్జిలను వసూలు చేస్తున్నాయి.
Amazon Pay FD | ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇప్పటికే అమెజాన్ పే పేరిట యూపీఐ ద్వారా నగదు ట్రాన్స్‌ఫర్, బిల్లు చెల్లింపుల సేవలను అందిస్తున్న విషయం విదితమే. ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ చెల్లింపుల యాప్స్ ప్రస్తుతం పలు బిల్లు చెల్లింపులకు గాను సర్వీస్ చార్జిలను వసూలు చేస్తున్నాయి. కానీ అమెజాన్ పే లో ఎలాంటి చార్జిలను వసూలు చేయడం లేదు. దీంతో అమెజాన్ పే ను వాడే వినియోగదారుల సంఖ్య ప్రస్తుతం గణనీయంగా పెరుగుతోంది. అయితే అమెజాన్ పే మరో నూతన సేవను అందుబాటులోకి తెచ్చింది. అందులో ఇకపై వినియోగదారులు ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ)లను కూడా చేయవచ్చు. కనిష్టంగా కేవలం రూ.1000 తోనే ఎఫ్‌డీని ప్రారంభించవచ్చు. ఇక దీనికి గాను ఆసక్తికరమైన వడ్డీ రేట్లను కూడా అందిస్తున్నారు.
కనీసం రూ.1000తోనే..
అమెజాన్ పే ద్వారా ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తే వినియోగదారులు ఏకంగా 8 శాతం మేర వడ్డీ రేట్లను పొందవచ్చు. ఇక ఎఫ్‌డీ సేవలకు గాను శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్, స్లైస్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వంటి 5 బ్యాంకులతోపాటు శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ వంటి ఎన్‌బీఎఫ్‌సీలతోనూ అమెజాన్ పే భాగస్వామ్యం అయింది. ఈ క్రమంలో ఆయా బ్యాంకుల్లో వినియోగదారులు కనీసం రూ.1000తోనే ఎఫ్‌డీ ఖాతాను తెరవచ్చు. అయితే ఇందుకు ప్రత్యేకంగా సేవింగ్స్ ఖాతాలను తెరవాల్సిన పనిలేదు. నేరుగా ఎఫ్‌డీ ఖాతాలను ఓపెన్ చేయవచ్చు. ఇక ఈ ఎఫ్‌డీపై వినియోగదారులకు 8 శాతం మేర వడ్డీ రేటు లభిస్తుంది. 1 ఏడాది నుంచి 5 ఏళ్ల కాలవ్యవధికి ఎఫ్‌డీ వేయవచ్చు. సీనియర్ సిటిజెన్‌కు అయితే అన్ని బ్యాంకుల్లోనూ అదనంగా మరో 0.5 శాతం మేర వడ్డీరేటు లభిస్తుంది. ఇక శ్రీరామ్ ఫైనాన్స్‌లో ఎఫ్‌డీని వేస్తే మహిళలకు అదనంగా 0.5 శాతం వడ్డీ రేటును ఇస్తున్నారు.
రూ.5 లక్షల వరకు బీమా..
ఈ సందర్భంగా అమెజాన్ పే సీఈవో వికాస్ బన్సల్ మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో చాలా మంది ఎఫ్‌డీ లను వేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారని తెలిపారు. డబ్బును పొదుపు చేసేందుకు అందుబాటులో ఉన్న అత్యంత ఉత్తమమైన, సురక్షితమైన మార్గాల్లో ఎఫ్‌డీ ఒకటిగా మారిందని తెలిపారు. చాలా మంది ప్రజలు ఎఫ్‌డీల పట్ల కూడా ఆసక్తిని చూపిస్తున్నారని అన్నారు. అందుకనే తమ ప్లాట్ ఫామ్‌పై ఈ సేవలను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే వినియోగదారులు 2026లో ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు తమ ప్లాట్‌ఫామ్‌పై అందుబాటులో ఉన్న ఎఫ్‌డీ సేవలను ఉపయోగించుకోవచ్చని అన్నారు. దేశంలో ఏ బ్యాంకుల్లో అయినా సరే ఎఫ్‌డీ వేస్తే వినియోగదారుల డబ్బుకు రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ సదుపాయం ఉంటుందని, కనుక ఎఫ్‌డీ ని నిరభ్యంతరంగా వేయవచ్చని అన్నారు. అలాగే వినియోగదారులు తమ ప్లాట్ ఫామ్‌పై ఎఫ్‌డీ ఓపెన్ చేస్తే తమకు కావల్సిన బ్యాంకును లేదా ఎన్‌బీఎఫ్‌సీని ఎంచుకోవచ్చని, వాటిల్లో అత్యుత్తమ వడ్డీ రేట్లను పొందవచ్చని సూచించారు.
సంబంధిత వార్తలు

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Fire TV Stick HD | అమెజాన్ కొత్త ఫైర్ టీవీ స్టిక్ హెచ్డీ విడుదల.. అద్భుతమైన ఫీచర్లతో అప్ గ్రేడ్..
మే 19, 2026

SIP Vs Lumpsum | SIP వర్సెస్ లంప్సమ్.. 2026లో ఏది బెస్ట్?
మే 15, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



