LIC New Jeevan Shanti Policy | ఎల్ఐసీలో ఇలా చేస్తే.. ఏడాదికి రూ.1 లక్ష పొందవచ్చు..
LIC New Jeevan Shanti Policy | దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకోవాలని పెద్దలు చెబుతుంటారు. ఆ మాట అనేక అంశాలకు కచ్చితంగా వర్తిస్తుందని చెప్పవచ్చు. వయస్సులో ఉన్నప్పుడే డబ్బును సంపాదించుకోవాలి. వృద్ధాప్య దశకు వచ్చాక శరీరం సహకరించదు. రిటైర్మెంట్ కోరుకుంటుంది. ఆ వయస్సులో పనిచేసే శక్తి ఉండదు.
LIC New Jeevan Shanti Policy | దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకోవాలని పెద్దలు చెబుతుంటారు. ఆ మాట అనేక అంశాలకు కచ్చితంగా వర్తిస్తుందని చెప్పవచ్చు. వయస్సులో ఉన్నప్పుడే డబ్బును సంపాదించుకోవాలి. వృద్ధాప్య దశకు వచ్చాక శరీరం సహకరించదు. రిటైర్మెంట్ కోరుకుంటుంది. ఆ వయస్సులో పనిచేసే శక్తి ఉండదు. కనుక అప్పటికే డబ్బు సంపాదించుకుని రిటైర్మెంట్ తీసుకోవాలి. దీని వల్ల మలి దశ రోజుల్లో సంతోషంగా ఉండవచ్చు. అయితే ప్రస్తుతం దేశంలో చాలా మందికి మాత్రం ఆ వీలు ఉండడం లేదు. వృద్ధాప్యంలోనూ శ్రమిస్తున్నారు. కానీ సరైన వయస్సులో డబ్బు సంపాదిస్తున్నప్పుడు రిటైర్మెంట్ గురించి ముందుగానే ఆలోచిస్తే ఆయా బాధలు పడాల్సిన అవసరం ఉండదు. రిటైర్ అయ్యాక చేతిలో డబ్బు ఉంటుంది. దీంతో సంతోషంగా జీవితాన్ని ఆస్వాదించవచ్చు. ఇక ఎల్ఐసీ కూడా సరిగ్గా అలాంటి ప్లాన్‌నే అందిస్తోంది. న్యూ జీవన్ శాంతి పేరిట ఓ రిటైర్మెంట్ పాలసీని ప్రజలకు అందిస్తోంది. దీని వల్ల ఎవరైనా సరే రిటైర్మెంట్ అనంతరం నెల నెలా ఖర్చులకు డబ్బు కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. జీవితం ముగిసే వరకు కూడా నెల నెలా పెన్షన్ ఇస్తారు.
వేతనం ఆగిన వెంటనే పెన్షన్..
ఎల్ఐసీ అందిస్తున్న న్యూ జీవన్ శాంతి పాలసీని తీసుకుంటే అందులో వినియోగదారులు ఒకేసారి డబ్బును పొదుపు చేయాలి. నెలవారి లేదా వార్షికంగా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఒకసారి పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాక కొన్నేళ్ల వరకు ఆగాల్సి ఉంటుంది. అంటే ఫలానా వయస్సులో రిటైర్ అవుదామని అనుకుంటే అప్పటి వరకు ఇంకా ఎన్నేళ్ల సమయం ఉంది, ఎంత పెట్టుబడి పెడి పెట్టాలి, రిటైర్ అయ్యాక నెలకు ఎంత పెన్షన్ అవసరం అవుతుంది.. అన్న విషయాలను ముందుగానే లెక్కించి ఆ తరువాత ఈ పాలసీలో డబ్బు పెట్టాలి. దీంతో కొన్నేళ్ల అనంతరం రిటైర్ అయిన వెంటనే నెల నెలా పెన్షన్ ఇస్తారు.ఈ క్రమంలో రిటైర్ అయ్యాక నెల నెలా వేతనం రాదు కాబట్టి అప్పటికే ఈ ప్లాన్ వెంటనే యాక్టివేట్ అవుతుంది కనుక నెలనెలా పెన్షన్‌ను పొందవచ్చు. దీని వల్ల వేతనం ఆగిన వెంటనే పెన్షన్ పొందినట్లు అవుతుంది. దీంతో నెల నెలా ఖర్చులకు డబ్బుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలా ఈ స్కీమ్ పనిచేస్తుంది.

రెండు రకాల ఆప్షన్లు..
ఈ పాలసీలో భాగంగా వినియోగదారులు రెండు రకాల ఆప్షన్లను ఎంచుకోవచ్చు. ఒక ఆప్షన్‌లో భాగంగా పెట్టుబడి పెట్టిన అనంతరం పాలసీదారుడు కొన్నేళ్లకు రిటైర్మెంట్ తీసుకుంటే అతనికి అతను చనిపోయే వరకు నెల నెలా పెన్షన్ ఇస్తారు. ఆ తరువాత అతను పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని అతని నామినీకి అందజేశారు. ఇక మరో ఆప్షన్‌లో భాగంగా పాలసీని భార్యభర్త ఇద్దరూ కలిపి తీసుకోవచ్చు. అలాంటి సందర్భంలో ముందుగా ప్రధాన పాలసీదారుకు రిటైర్మెంట్ సమయంలో పెన్షన్ ఇస్తారు. ఆ పాలసీదారు చనిపోతే ఆ తరువాత భాగస్వామికి పెన్షన్ ఇస్తారు. ఇక ఆ వ్యక్తి కూడా కొంత కాలానికి చనిపోతే వారి నామినీకి పెట్టుబడి మొత్తాన్ని అందజేస్తారు. ఇలా ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి పాలసీ పనిచేస్తుంది.
ఎంతైనా పొదుపు చేయవచ్చు..
అయితే రిటైర్మెంట్ అనంతరం నెలకు ఎంత పెన్షన్ కావాలో పాలసీని తీసుకునేటప్పుడే నిర్ణయించుకోవచ్చు. దీని వల్ల మార్కెట్ ఒడిదుడుకులు, ఇతర ఎలాంటి ప్రభావాలు పెన్షన్‌పై పడవు. ముందుగా నిర్ణయించినట్లే కచ్చితమైన పెన్షన్‌ను ఇస్తారు. కనుక ఈ పాలసీ చాలా సురక్షితమైనదని చెప్పవచ్చు. ఇక ఉదాహరణ చూస్తే ఒక వ్యక్తి వయస్సు 55 ఏళ్లు అనుకుంటే అతను మరో 5 ఏళ్లలో రిటైర్ అవుదామని చూస్తుంటే రూ.11 లక్షలు ఇందులో పెట్టుబడి పెట్టాడని భావిస్తే అప్పుడు అతనికి రిటైర్మెంట్ దశలో.. అంటే 5 ఏళ్ల అనంతరం అతనికి ఏడాదికి రూ.1 లక్ష పెన్షన్ ఇస్తారు. అదే నెలవారి ఆప్షన్ ఎంచుకుంటే నెలకు రూ.8వేలను పెన్షన్‌గా చెల్లిస్తారు. ఇలా ఈ స్కీమ్‌లో డబ్బును పొదుపు చేయవచ్చు. ఈ స్కీమ్‌లో చేరేందుకు కనీస వయస్సు 30 ఏళ్లు ఉండాలి. గరిష్టంగా 79 ఏళ్లు ఉండవచ్చు. ఈ పాలసీలో కనీసం రూ.1.50 లక్షలను పెట్టుబడిగా పెట్టాలి. గరిష్టంగా ఎంతైనా పొదుపు చేయవచ్చు. నిర్దిష్టమైన మొత్తంలో పెన్షన్ కావాలనుకుంటే అందుకు తగిన విధంగా డబ్బును పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఇక డబ్బును పెట్టిన అనంతరం పాలసీదారుడు 1 ఏడాది నుంచి 12 ఏళ్ల మధ్య ఎంతైనా వ్యవధిని నిర్దేశించుకోవచ్చు. ఆ వ్యవధి పూర్తయిన వెంటనే పెన్షన్ ను అందించడం ప్రారంభిస్తారు. ఇలా ఈ పాలసీ చాలా మందికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



