Money Saving | ఆదాయం సరిపోవడం లేదా..? అయితే 70-10-10-10 రూల్‌ను పాటించండి..!
Money Saving | చాలా మంది నెలవారి ఖర్చులకు సరిపడా డబ్బును సంపాదిస్తుంటారు. ఉద్యోగం లేదా వ్యాపారం ద్వారా ఆ మొత్తాన్ని ఆర్జిస్తుంటారు. దీంతో జీవితం సాఫీగా సాగిపోతుంది. అయితే ఏవైనా అనుకోని ఖర్చులు వస్తే మాత్రం ఒక్కసారిగా ఆర్థిక స్థిరత్వం అస్తవ్యస్తమవుతుంది. ఖర్చులు పెరిగిపోతాయి. దీంతో నెలవారి అవసరాలకు తరచూ చేసే ఖర్చు సరిపోదు.
Money Saving | చాలా మంది నెలవారి ఖర్చులకు సరిపడా డబ్బును సంపాదిస్తుంటారు. ఉద్యోగం లేదా వ్యాపారం ద్వారా ఆ మొత్తాన్ని ఆర్జిస్తుంటారు. దీంతో జీవితం సాఫీగా సాగిపోతుంది. అయితే ఏవైనా అనుకోని ఖర్చులు వస్తే మాత్రం ఒక్కసారిగా ఆర్థిక స్థిరత్వం అస్తవ్యస్తమవుతుంది. ఖర్చులు పెరిగిపోతాయి. దీంతో నెలవారి అవసరాలకు తరచూ చేసే ఖర్చు సరిపోదు. అది పెరుగుతుంది. ఈ క్రమంలో క్రెడిట్ కార్డులను ఎక్కువగా వాడడం లేదా లోన్లను తీసుకోవడం చేస్తుంటారు. దీని వల్ల ఆర్థిక భారం మరింత పెరుగుతుంది. ఇలా ఎప్పటికప్పుడు ఖర్చులు పెరిగిపోతూనే ఉంటాయి. అలాంటి స్థితిలో ఖర్చులను తట్టుకోలేక చేతులెత్తేస్తారు. చాలా మందికి జీవితంలో ఇలాగే జరుగుతుంది. దీంతో అనేక కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నం అవుతుంటాయి. అయితే ఇలాంటి పరిస్థితి రావొద్దంటే ఉద్యోగులు లేదా వ్యాపారులు ఎవరైనా సరే తమకు నెల నెలా వచ్చే ఆదాయాన్ని ఒక నిర్దిష్టమైన నిష్పత్తిలో విభజించి ఖర్చు చేయాలని, దీంతో ఎలాంటి పరిస్థితులను అయినా సరే చాలా సులభంగా ఎదుర్కొంటారని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకు గాను వారు 70-10-10-10 అనే రూల్‌ను పాటించాలని చెబుతున్నారు.
ఏంటీ 70-10-10-10 రూల్..?
ఎవరైనా తమకు వచ్చే ఆదాయాన్ని 70-10-10-10 అనే నిష్పత్తిలో విభజించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆదాయం మొత్తంలో 70 శాతాన్ని రోజువారి లేదా నెలవారి ఖర్చులకు ఉపయోగించాలి. 10 శాతాన్ని స్వల్ప కాలిక పొదుపు ఖాతాల్లో జమ చేయాలి. మరో 10 శాతం మొత్తాన్ని దీర్ఘకాలిక పొదుపు ఖాతాల్లో జమ చేయాలి. ఇక మొత్తం ఆదాయంలో చివరి 10 శాతం డబ్బును అప్పులు చెల్లించేందుకు లేదా నైపుణ్యాలను మెరుగు పరుచుకునేందుకు, కొత్త అవకాశాలను సృష్టించేందుకు ఖర్చు చేయాలి. ఈ విధంగా ఆ మొత్తాన్ని విభజించి ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో ఇందులోనే డబ్బు పొదుపు అవుతుంది. పైగా రోజూ అవసరం ఉండే ఖర్చులు తీరుతాయి. నూతన అవకాశాలను సృష్టించుకుని డబ్బును మరింత సంపాదించేందుకు వీలు కలుగుతుంది.

ఏయే అవసరాలకు ఎంత మొత్తం..?
మొత్తం ఆదాయంలో 70 శాతం డబ్బును రోజువారి అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. అంటే ఇంటి అద్దె, కిరాణా సరుకులు, బిల్స్, ఇన్సూరెన్స్, పిల్లల చదువులు, వినోదం వంటి వాటికి కేటాయించాలి. ఇక 10 శాతం డబ్బును స్వల్పకాలిక ఖాతాల్లో పొదుపు చేయాలి. ఇది ఎమర్జెన్సీ ఫండ్ గా పనిచేస్తుంది. అంటే అత్యవసర వైద్య ఖర్చులు లేదా వాహనాల మరమ్మత్తుల ఖర్చులు, పుట్టిన రోజు వేడుకలు, టూర్లకు వెళ్లడం వంటి వాటికి పనిచేస్తుంది. అయితే ఈ ఖర్చులకు చాలా మంది క్రెడిట్ కార్డులు లేదా లోన్లను ఉపయోగిస్తారు. దీని వల్ల నెలవారి ఖర్చుల భారం పెరుగుతుంది. కనుక అలా జరగకుండా ఉండాలంటే అలాంటి ఖర్చులకు ముందుగానే డబ్బును పొదుపు చేయాలి. దీంతో ఖర్చులు పెరగకుండా, ఆర్థిక భారం పడకుండా ఉంటుంది.
ఇలా చేస్తే ఆదాయం పెరుగుతుంది..
ఇక మొత్తం ఆదాయంలో మరో 10 శాతం డబ్బును దీర్ఘకాలిక ఖాతాల్లో పొదుపు చేయాలి. అంటే మ్యుచువల్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు, స్టాక్స్, సిప్ లు, పీపీఎఫ్, ఎన్‌పీఎస్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీములు, సుకన్య సమృద్ధి యోజన, చైల్డ్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ వంటి పొదుపు స్కీముల్లో జమ చేయాలి. ఇది పిల్లలు పెద్దయ్యాక వారి చదువులు లేదా వ్యాపారం, వివాహం వంటి అవసరాలకు పనిచేస్తుంది. ఇక చివరి 10 శాతం డబ్బును అప్పులు చెల్లించేందుకు, ఈఎంఐలు, వడ్డీలు చెల్లించేందుకు, స్కిల్స్‌ను మెరుగు పరుచుకునేందుకు, నూతన ఉద్యోగ లేదా ఉపాధి అవకాశాలను సృష్టించుకునేందుకు ఖర్చు చేయాలి. దీని వల్ల అప్పులు చెల్లిపోవడంతోపాటు స్కిల్స్ కూడా మెరుగు పడతాయి. దాంతో కొత్త ఉద్యోగంతో మరింత వేతనంతో పనిచేయవచ్చు. లేదా ఉపాధిని సృష్టించుకోవచ్చు. దీని వల్ల ఆదాయం పెరుగుతుంది. డబ్బును మరింతగా పొదుపు చేయవచ్చు. ఖర్చులు ఎలాగూ నియంత్రణలో ఉంటాయి కనుక డబ్బు చాలా వరకు పొదుపు అవుతుంది. ఆర్థిక భారం పడకుండా చూసుకోవచ్చు. ఇలా ఈ 70-10-10-10 రూల్‌ను పాటిస్తే కచ్చితంగా ఎవరికైనా డబ్బు ఆదా అవడంతోపాటు ఖర్చులు, ఆర్థిక భారం చాలా వరకు తగ్గుతుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
సంబంధిత వార్తలు

ఆఫర్లో కొన్నారా.. ఆఫర్ చూసి కొన్నారా? పండుగ షాపింగ్‌లో అసలు లెక్క ఇదే!
అక్టోబర్ 3, 2026

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.15వేలు తగ్గిన పసిడి ధర.. ఇన్వెస్టర్లకు కీలక హెచ్చరిక..
సెప్టెంబర్ 24, 2026

Corpus | రూ.1 కోటి సంపాదించాలా.. అయితే ముందు రూ.10 లక్షలు దాటండి.. ఎందుకంటే..?
సెప్టెంబర్ 10, 2026
తాజావార్తలు
- ●Bollywood Debut | అడవి నుంచి కెమెరా ముందుకు..! మాజీ మహిళా మావోయిస్టులకు బాలీవుడ్ ఛాన్స్
- ●Parliamentary Committee on Defence 2026 | పార్లమెంట్ రక్షణ కమిటీ పునర్వ్యవస్థీకరణ: తెలంగాణ నుంచి దామోదర్ రావు, ఏపీ నుంచి కేశినేని చిన్నికి చోటు.. చైర్మన్‌గా రాధా మోహన్ సింగ్
- ●TG Weather | తెలంగాణకు ఐఎండీ తీపి కబురు.. మళ్లీ జోరందుకోనున్న వానలు..!
- ●Kayadu Lohar | రెట్రో లుక్‌లో కయదు - క్యూట్ ఫాటోలతో మాయ చేసిన ప్యారడైజ్ హీరోయిన్
- ●Hyderabad Police Overstaying Foreigners | వీసా గడువు ముగిసినా హైదరాబాద్‌లోనే అక్రమంగా ఉంటూ విదేశీయులు ఏం చేస్తున్నారంటే?
- ●Priyanka Chopra | ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించిన ఒకే ఒక తమిళ మూవీ - దళపతి విజయ్ హీరో - యూట్యూబ్‌లో ఫ్రీ స్ట్రీమింగ్

Bollywood Debut | అడవి నుంచి కెమెరా ముందుకు..! మాజీ మహిళా మావోయిస్టులకు బాలీవుడ్ ఛాన్స్

Parliamentary Committee on Defence 2026 | పార్లమెంట్ రక్షణ కమిటీ పునర్వ్యవస్థీకరణ: తెలంగాణ నుంచి దామోదర్ రావు, ఏపీ నుంచి కేశినేని చిన్నికి చోటు.. చైర్మన్‌గా రాధా మోహన్ సింగ్

TG Weather | తెలంగాణకు ఐఎండీ తీపి కబురు.. మళ్లీ జోరందుకోనున్న వానలు..!

Kayadu Lohar | రెట్రో లుక్‌లో కయదు - క్యూట్ ఫాటోలతో మాయ చేసిన ప్యారడైజ్ హీరోయిన్



