Gold Investment | ఐఫోన్ వద్దనుకుని బంగారం కొన్నాడు.. 3 ఏళ్లలో రెండింతలకు పైగా లాభం..
Gold Investment | ఐఫోన్ కొనాలనే కోరికతో దాదాపు మూడేళ్ల పాటు డబ్బు దాచుకున్న ఓ వ్యక్తి చివరకు అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాడు. ఐఫోన్ కొనేందుకు అవసరమైన మొత్తాన్ని సమకూర్చుకోలేకపోవడంతో, భార్య సలహా మేరకు తాను దాచుకున్న డబ్బుతో రెండు బంగారు ఉంగరాలు కొనుగోలు చేసినట్లు తెలియజేస్తున్న ఓ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Viral news | Published On Oct 10, 2026, 11.25 am IST
Gold Investment | ఐఫోన్ కొనాలనే కోరికతో దాదాపు మూడేళ్ల పాటు డబ్బు దాచుకున్న ఓ వ్యక్తి చివరకు అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాడు. ఐఫోన్ కొనేందుకు అవసరమైన మొత్తాన్ని సమకూర్చుకోలేకపోవడంతో, భార్య సలహా మేరకు తాను దాచుకున్న డబ్బుతో రెండు బంగారు ఉంగరాలు కొనుగోలు చేసినట్లు తెలియజేస్తున్న ఓ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ముఖంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ లో ఈ పోస్టును యూజర్లు షేర్ చేస్తున్నారు. అయితే ఆ పోస్టులోని వివరాలను మీడియా సంస్థలు ధ్రువీకరించలేదు. అందులోని వివరాల ప్రకారం ఓ వ్యక్తి మూడేళ్ల కిందట రూ.49,770 ధరకు ఐఫోన్‌ను కొనాలని అనుకున్నాడు. కానీ ఆ మొత్తం సరిపోకపోవడంతో భార్య సలహా మేరకు అదే ధరకు రెండు బంగారు ఉంగరాలను కొనుగోలు చేశాడు. అయితే ప్రస్తుతం బంగారం ధర పెరగడంతో తాను అప్పుడు పెట్టిన పెట్టుబడి ఇప్పుడు రెండింతలకు పైగానే అయింది.
మూడేళ్లలో రెండింతల లాభం..
మూడేళ్ల తర్వాత అదే నగల దుకాణానికి వెళ్లి తన ఉంగరాల ప్రస్తుత విలువ ఎంత ఉంటుందో ఆరా తీయగా, వాటి విలువ దాదాపు రూ.1.14 లక్షలకు చేరినట్లు తెలిసి అతడు ఆశ్చర్యపోయాడని పోస్టులో పేర్కొన్నారు. అంటే సుమారు రూ.64వేలకు పైగా లాభం వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ లెక్కల ప్రకారం దాదాపు రూ.49,770 పెట్టుబడి మూడేళ్లలో రూ.1.14 లక్షలకు పెరిగింది. అంటే పెట్టుబడి విలువ రెండింతలకు పైగా పెరిగినట్లు ఈ వైరల్ కథనం చెబుతోంది. అయితే, బంగారం ధరల పెరుగుదలతో పాటు నగల తయారీ చార్జీలు, కొనుగోలు సమయంలో చెల్లించిన పన్నులు, విక్రయ సమయంలో లభించే వాస్తవ ధర వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే నికర లాభం భిన్నంగా ఉంటుంది. అయినప్పటికీ అన్ని పన్నులు పోను ఇంకా ఎక్కువే లాభం వచ్చింది.
https://twitter.com/Lakshmi_D_N/status/2106997566550474818
మరో ఘటనలో.. ఫోన్ కోసం బంగారం అమ్మి..
బంగారాన్ని సాధారణంగా దీర్ఘకాలికంగా విలువను నిలుపుకునే ఆస్తిగా భావిస్తారు. మరోవైపు, ఐఫోన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కొత్త మోడళ్లు మార్కెట్లోకి వచ్చిన కొద్దీ విలువ కోల్పోయే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వైరల్ పోస్టు బంగారంలో పెట్టుబడి పెట్టడం, ఐఫోన్ కొనడం మధ్య వ్యత్యాసాన్ని ప్రస్తావించింది. ఇదే సమయంలో దీనికి విరుద్ధమైన మరో ఘటన కూడా సోషల్ మీడియాలో చర్చకు వచ్చింది. ఢిల్లీలో ఓ వ్యక్తి తన భార్య కోసం ఐఫోన్ కొనుగోలు చేసేందుకు కుటుంబ వారసత్వంగా వచ్చిన బంగారాన్ని విక్రయించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. నోయిడాలోని డీఎల్ఎఫ్ మాల్ ఆఫ్ ఇండియాలోని యాపిల్ స్టోర్ వద్ద తాజా ఐఫోన్ మోడల్ కొనుగోలు చేసేందుకు క్యూలో నిలబడ్డ ఆ వ్యక్తిని ఓ విలేకరి ప్రశ్నించినట్లు సమాచారం. వైరల్ వీడియోలో, తన భార్య కోసం బర్గండీ రంగు ఐఫోన్ 18 ప్రొ కొనుగోలు చేయాలని అనుకుంటున్నట్లు అతను చెప్పినట్లు కథనాల్లో పేర్కొన్నారు.
View this post on Instagram
బంగారంపై పెట్టుబడి పెట్టాలా..
బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దాన్ని పెట్టుబడిగా ఉంచడం మంచిది కాదా అని విలేకరి ప్రశ్నించగా, తమ వద్ద అమ్మమ్మ, ముత్తాతల కాలం నుంచి వచ్చిన బంగారం చాలా ఉందని, అందులో కొంత విక్రయించి ఐఫోన్ కొనుగోలు చేసేందుకు వచ్చామని ఆ వ్యక్తి చెప్పినట్లు వెల్లడించారు. ఈ రెండు ఘటనలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. తాజా గ్యాడ్జెట్‌లను సొంతం చేసుకోవాలనే పెరుగుతున్న ఆసక్తి, మరోవైపు బంగారం వంటి ఆస్తుల్లో సంపదను నిలుపుకోవాలనే ఆలోచన మధ్య ఉన్న వ్యత్యాసంపై నెటిజన్లు చర్చిస్తున్నారు. అయితే, మొదటి ఘటనకు సంబంధించిన వైరల్ పోస్టును ధ్రువీకరించలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
తాజావార్తలు
- ●RS Praveen Kumar | మీ పని మీరు చూసుకోండి.. ఎలాన్ మస్క్‌కు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కౌంటర్..
- ●Abhijeet Dipke | సొంత ప్రజలతోనే యుద్ధం చేస్తున్న మోదీ సర్కార్: అభిజీత్ దీప్కే
- ●Micro Borrowing | మైక్రో ఫైనాన్స్ లోన్లను తీసుకుంటున్నారా.. ఈ 5 రిస్క్‌లు తెలుసుకోండి..
- ●Abhijeet Dipke | పోలీసుల నిర్బంధంలో అభిజీత్ దీప్కే.. విమానంలోనే అదుపులోకి..
- ●Aurora College | విద్యార్థినులు బట్టలు మార్చుకుంటుండగా ఫొటోలు.. అరోరా కాలేజీ హాస్టల్లో సిబ్బంది అరాచకాలు
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న జోష్.. భారీగా పెరుగుతున్న బంగారం ధరలు..

RS Praveen Kumar | మీ పని మీరు చూసుకోండి.. ఎలాన్ మస్క్‌కు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కౌంటర్..

Abhijeet Dipke | సొంత ప్రజలతోనే యుద్ధం చేస్తున్న మోదీ సర్కార్: అభిజీత్ దీప్కే

Micro Borrowing | మైక్రో ఫైనాన్స్ లోన్లను తీసుకుంటున్నారా.. ఈ 5 రిస్క్‌లు తెలుసుకోండి..

Abhijeet Dipke | పోలీసుల నిర్బంధంలో అభిజీత్ దీప్కే.. విమానంలోనే అదుపులోకి..






