త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | భ‌జ‌న మీడియాకు బ‌ల్బులు ఎగిరిపోయిన‌య్ : కేటీఆర్

KTR | ఢిల్లీలో జరిగిన ఒక కొత్త తరహా ఆందోళన వల్ల కేవలం ప్రభుత్వం మాత్రమే వణకలేదు.. మీడియాకు కూడా చెమటలు పట్టాయి.. భజన మీడియా బల్బులు ఎగిరిపోయిన‌య్‌.. పిల్లలు గోదీ మీడియాను నిలదీశారని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.

S

Telangana | Published On Aug 1, 2026, 4.31 pm IST

KTR | భ‌జ‌న మీడియాకు బ‌ల్బులు ఎగిరిపోయిన‌య్ : కేటీఆర్
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : ఢిల్లీలో జరిగిన ఒక కొత్త తరహా ఆందోళన వల్ల కేవలం ప్రభుత్వం మాత్రమే వణకలేదు.. మీడియాకు కూడా చెమటలు పట్టాయి.. భజన మీడియా బల్బులు ఎగిరిపోయిన‌య్‌.. పిల్లలు గోదీ మీడియాను నిలదీశారని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సుంద‌ర‌య్య విజ్ఞాన కేంద్రంలో నిర్వ‌హించిన న‌వ తెలంగాణ 11వ వార్షికోత్స‌వ కార్య‌క్ర‌మంలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

ప‌త్రిక‌ల మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థ‌కంగా మారింది ఇవాళ‌. ఒక్క సిరా చుక్క ల‌క్ష మెద‌ళ్ల‌కు క‌ద‌లిక‌, క‌లం క‌త్తి కంటే గొప్ప‌ది అని చెప్పొచ్చు. ఒక ప‌త్రిక ప‌దివేల సైన్యంతో స‌మానం అని చెప్పొచ్చు. ఈ కొటేష‌న్లు వ‌ర్త‌మాన కాలంలో స‌రిపోతాయా..? లేదా వాటికి కాలం చెల్లిందా..? అనేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది అని ఆయ‌న అన్నారు.

ప‌తాక శీర్షిక‌లు మేనేజ్ చేస్తే సరిపోతుందా..?

ఒక మీడియా ఉనికి కోసం పోరాడుతుంది. ఇంకో మీడియానేమో ఊగిస‌లాడుతుంది. మ‌రొక మీడియా ఉర్రుత‌లూగిస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మారాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. దేశం, రాష్ట్రంలోనే కాదు.. ప్ర‌పంచ‌మంత‌టా మీడియా నియంత్ర‌ణ‌, హెడ్‌లైన్ మేనెజ్‌మెంట్‌, డైవ‌ర్ష‌న్ టాక్టిక్స్ ఆన‌వాయితీగా మారిపోయాయి. ప‌తాక శీర్షిక‌లు మేనేజ్ చేస్తే సరిపోతుందా..? ప్ర‌జ‌ల ప‌ర్సెప్ష‌న్‌ మేనేజ్ చేయొచ్చా ఆలోచ‌న చేయాల్సిన ప‌రిస్థితి. న్యూస్ చానెల్స్ మీద గుత్తాధిప‌త్యం సంపాదించి కేవ‌లం న్యూస్ ఏది రావాలి..? మ‌న వ్యూస్‌ను న్యూస్ రూపంలో ప్ర‌జ‌ల నెత్తిమీద ఎలా రుద్దాలి అనేది జ‌రుగుతుంద‌న్నారు కేటీఆర్.

అధికారం అనేది బ్ర‌హ్మ‌ప‌దార్థం

సోష‌ల్ మీడియా ఒక‌ర‌కంగా మంచిది.. మ‌రొర‌కంగా చెడ్డ‌ది. ప్ర‌జ‌లు ఏది ఫాలో అవుతున్నారు ఏది కోరుకుంటున్నారో అదే నిర్ణ‌యిస్తుంది. ప్ర‌భుత్వంలో, ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ప్ర‌జ‌లు ఏం కోరుకుంటున్నారో తెలియ‌క‌ కింద‌మీద ప‌డిపోతుంటాం.. అధికారం అనేది బ్ర‌హ్మ‌ప‌దార్థం. ప్ర‌భుత్వంలో ఉన్న పెద్ద‌ల‌తో పాటు మేం న‌మ్ముతున్న‌ది ఏంటంటే..? మీడియాను మేనేజ్ చేయ‌డం ద్వారా ప‌ర్సెప్ష‌న్‌ మేనేజ్ చేయొచ్చు.. ప్ర‌శాంత్ కిశోర్ లాంటి స్ట్రాట‌జిస్టులు చెప్పేదంటే నేరెటివ్ డ్రైవ్ చేయాల‌ని ప‌దేప‌దే చెబుతుంటారు అని కేటీఆర్ గుర్తు చేశారు.

వాట్సాప్ యూనివ‌ర్సిటీ అంకుళ్ల‌కు, ఇన్‌స్టాగ్రామ్ పిల్ల‌ల‌కు మ‌ధ్య పోరాటం పోటెత్తింది

కానీ వీటికి భిన్నంగా గ‌త వారం ఢిల్లీలో ఏం జ‌రిగిందో చూశాం. క‌న్వెన్ష‌న‌ల్ పాలిటిక్స్ భిన్నంగా యువ‌త‌రం క‌దం తొక్కింది. ఒక కొత్త త‌ర‌హా ఆందోళ‌న‌, ఆలోచ‌నతో ఢిల్లీ పుర‌వీధుల్లో క‌దం తొక్కితే ప్ర‌భుత్వం ఒక్క‌టే వ‌ణ‌క‌లేదు. మీడియాకు కూడా చెమ‌ట‌లు ప‌ట్టించింది.. భ‌జ‌న మీడియాకు మాత్రం బ‌ల్బులు ఎగిరిపోయిన‌య్‌. 20 రోజుల త‌ర్వాత మేం గుర్తు వ‌చ్చామా అని నిల‌దీస్తుంటే చెమ‌లు ప‌ట్టే ప‌రిస్థితి. గోదీ మీడియా అని డైరెక్ట్‌గా అన్న‌రు. వారు దేనికి భ‌య‌ప‌డే బ్యాచ్ కాదు. ఈడీ, సీబీఐ, ఐటీ వారి మీద‌ ప‌ని చేయ‌దు. మోదీ ఎవ‌రితోనైతే పెట్టుకోవ‌ద్దో వారితోనే పెట్టుకున్నారు. మొన్న జ‌రిగిన పోరాటం వాట్సాప్ యూనివ‌ర్సిటీ అంకుళ్ల‌కు, ఇన్‌స్టాగ్రామ్ పిల్ల‌ల‌కు మ‌ధ్య జ‌రిగింది. ఫ‌స్ట్ రౌండ్ ఎవ‌రు గెలిచారో మీరు చూశారు. పోరాటం పోటెత్తింది అని కేటీఆర్ పేర్కొన్నారు.

ప్ర‌తిప‌క్షాలు చేయలేని ప‌ని పిల్ల‌లు చేశారు..

ఇప్పుడున్న పిల్ల‌ల‌కు దేశం మీద ప‌ట్టింపు లేదు. సోయి లేదు అనుకుంటాం.. కానీ ఢిల్లీలో చూసిన త‌ర్వాత వారికి మాకంటే ఎక్కువ ఉంద‌ని అర్థ‌మైంది. ఎందుకంటే ప‌త్రిక‌లు, మీడియా ప‌ట్టించుకోలేదు. మీడియా, చానెల్స్ చ‌ర్చ పెట్ల‌లేదు. ల‌క్ష‌ల మంది క‌దం తొక్కారు. నామ్ బ‌యాల‌జిక్ అన్న వారి మెడ‌లు వంచారు. ప్ర‌తిప‌క్షాలుగా మేం చేయ‌లేని ప‌ని దేశ యువ‌త‌రం చేసి చూపించింది. తోవ చూపెట్టింది. మీరు కూడా బ‌యాలాజిక‌లే అని గుర్తు చేయ‌వ‌చ్చు అని బ్ర‌హ్మాండంగా చూపించారు. ప్ర‌భుత్వంలో ఉన్న‌ప్పుడు మీడియా మేనేజ్‌మెంట్ చేస్తే ప్ర‌జ‌ల ప‌ర్సెప్ష‌న్ మేనేజ్ చేయొచ్చ‌నే అభిప్రాయం ఉంటుంది. కానీ మొన్న ఢిల్లీలో ప్ర‌ధాని అర్ధ‌రాత్రి ఇన్‌స్టాలో వీడియో పెట్టాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది అని కేటీఆర్ గుర్తు చేశారు.

Advertisement
Advertisement