Lockup Season 2 | యాభై మిలియన్ల వ్యూస్‌తో లాకప్ సీజన్ 2 రికార్డ్ – ఫైనల్‌కు ముందే విన్నర్ పేరు లీక్?
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న లాకప్ షో సీజన్ 2 విన్నర్ ఎవరన్నది గ్రాండ్ ఫినాలేకు ముందే లీకయ్యింది. శివాంగి జోషి విజేతగా నిలిచినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. విన్నర్‌గా నిలిచిన శివాంగికి కోటి రూపాయల ప్రైజ్ మనీ దక్కినట్లు సమాచారం.
Entertainment | Published On Aug 4, 2026, 7.32 pm IST
Lockup Season 2 | నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న లాకప్ సీజన్ 2 ఇండియన్ రియాలిటీ షోస్ గత రికార్డులు మొత్తం తిరగరాసింది. ఓటీటీ హిస్టరీలోనే హయ్యెస్ట్ వ్యూస్ దక్కించుకున్న రియాలిటీ షోగా నిలిచింది. లాకప్ సీజన్ 2 జూన్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
కంగనా రనౌత్...
లాకప్ ఫస్ట్ సీజన్‌కు కంగనా రనౌత్ హోస్ట్‌గా కనిపించింది. సెకండ్ సీజన్‌కు ఫరాఖాన్, రితేష్ దేశ్‌ముఖ్ హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఫస్ట్ సీజన్‌తో పాటు పోలిస్తే సెకండ్ సీజన్ వివాదాలు, కంటెస్టెంట్ల దూకుడైన ఆటతీరుతో ఆసక్తికరంగా సాగుతోంది. నాలుగు వారాల్లోనే ఈ షో యాభై మిలియన్ల వ్యూయింగ్ అవర్స్‌ను దాటేసింది.
నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్...
నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఇండియన్ రియాలిటీ షోస్‌లో హయ్యెస్ట్ వ్యూస్‌తో లాకప్ సీజన్ 2 నంబర్ వన్ ప్లేస్‌లో ఉంది. ఇప్పటివరకు 1.9 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్ వ్యూస్ వచ్చినట్లు నెట్‌ఫ్లిక్స్ పేర్కొన్నది. 1.5 మిలియన్ల వ్యూస్‌తో ఇండియాస్ గాట్ టాలెంట్ షో ఇన్నాళ్లు టాప్ ప్లేస్‌లో కొనసాగుతూ వచ్చింది. ఆ రికార్డును లాకప్ సీజన్ 2 దాటేసింది. వరల్డ్ వైడ్‌గా నెట్‌ఫ్లిక్స్ లో హయ్యెస్ట్ వ్యూయర్‌షిప్‌ను దక్కించుకున్న షోలో లాకప్ 2 ఎనిమిదో స్థానంలో ఉంది.
సోషల్ మీడియా సెలిబ్రిటీలు...
లాకప్ సీజన్ 2లో పలువురు టీవీ, సోషల్ మీడియా సెలిబ్రిటీలు కంటెస్టెంట్స్‌గా పాల్గొన్నారు. రామ్ కుమార్, శివాంగి జోషి, శిల్పా షిండే, సునీత ఆహుజా, రియాజ్ అలీ, యోగేష్ రావత్, ఆకాంక్ష చౌదరితో పాటు పలువురు కంటెస్టెంట్స్‌గా అడుగుపెట్టారు.
గ్రాండ్ ఫినాలే ఎప్పుడంటే?
లాకప్ సీజన్ 2 ఫైనల్ వీక్‌కు చేరుకుంది. ఆగస్ట్ 5న గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ జరుగనుంది. సీజన్ 2 విన్నర్‌గా శివాంగి జోషి నిలిచినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. విజేతగా నిలిచిన శివాంగి కోటి రూపాయల ప్రైజ్ మనీ దక్కించుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఫస్ట్ రన్నరప్‌గా శ్రేయా కల్రా, సెకండ్ రన్నరప్‌గా యోగేష్ రావత్ నిలిచినట్లు సమాచారం. తర్వాతి స్థానాలను శిల్పా షిండే, రామ్ కపూర్ దక్కించుకున్నట్లు చెబుతున్నారు.
ప్రీ ఫైనల్ టాస్క్‌లో విన్నర్‌గా నిలిచిన యోగేష్ రావత్ 10 లక్షల ప్రైజ్‌మనీ దక్కించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rashmika Mandanna | అఫీషియల్ : ఓటీటీలోకి రష్మిక మందన్న బాలీవుడ్ రొమాంటిక్ మూవీ – తెలుగులో రిలీజ్
ఆగస్టు 2, 2026

Flipkart | ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. ఇలా చేస్తే ప్రతి నెలా నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ..
ఆగస్టు 1, 2026

Telugu OTT | లేటెస్ట్ తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది – మహేష్‌బాబు నిర్మాత
జులై 28, 2026
తాజావార్తలు
- ●RS Praveen Kumar | కాళేశ్వరం కూలేశ్వరం కాదు : ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
- ●Phone Tapping Case | సీఎం గారూ మీ ఫోన్ ట్యాప్ అయిందా..?
- ●TVS | 6న కొత్తపల్లి జయశంకర్ జయంతి సభ
- ●King Cobra | ఏం పిల్లరా బాబు.. నాగుపామును అలా పట్టేసింది.. వీడియో
- ●Nagarjuna | బాలకృష్ణ ప్రొడ్యూసర్ - నాగార్జున హీరో - రేర్ కాంబినేషన్లో సినిమా అనౌన్స్ కానీ...
- ●PM eBus Sewa | వరంగల్‌కు మరో 100 ఎలక్ట్రిక్ బస్సులు.. వెల్లడించిన ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి

RS Praveen Kumar | కాళేశ్వరం కూలేశ్వరం కాదు : ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్

Phone Tapping Case | సీఎం గారూ మీ ఫోన్ ట్యాప్ అయిందా..?

TVS | 6న కొత్తపల్లి జయశంకర్ జయంతి సభ

King Cobra | ఏం పిల్లరా బాబు.. నాగుపామును అలా పట్టేసింది.. వీడియో



