త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Phone Tapping Case | సీఎం గారూ మీ ఫోన్ ట్యాప్ అయిందా..?

Phone Tapping Case | రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసు( Phone Tapping Case ) సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో తుది చార్జిషీటు దాఖ‌లుకు స‌మ‌యం ఆసన్న‌మైంది.

S

Telangana | Published On Aug 4, 2026, 7.17 pm IST

Phone Tapping Case | సీఎం గారూ మీ ఫోన్ ట్యాప్ అయిందా..?
Advertisement

Phone Tapping Case | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసు( Phone Tapping Case ) సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో తుది చార్జిషీటు దాఖ‌లుకు స‌మ‌యం ఆసన్న‌మైంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి వాంగ్మూలం న‌మోదు చేయాలా..? వ‌ద్దా..? అనే విష‌యంపై ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని హైద‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ తెలిపారు. ఈ కేసు దర్యాప్తు పూర్తి చేసి ఈ నెలాఖరు నాటికి తుది చార్జ్‌షీట్‌ దాఖలు చేయాలని నిర్ణయించామ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉండటం పలుమార్లు ఫోన్‌ ట్యాపింగ్‌పై వ్యాఖ్యలు చేశారు. అనేక బహిరంగ సభల్లో తన ఫోన్‌ను ప్రభుత్వం ట్యాప్‌ చేస్తోందని ఆరోపించారు. సిట్‌ అధికారులు తమకు లభించిన కొంత డేటా ఆధారంగా దర్యాప్తు చేసి 600 మందికి పైగా సాక్షుల్ని గుర్తించారు. సేకరించిన ఆధారాలు, దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా ఈ సాక్షుల నుంచి వాంగ్మూలాలు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసు అధికారులు, ఓఎస్డీలతో పాటు రాజకీయ నాయకులు, ఇతరుల పైనా ఆరోపణలు వచ్చాయి. కొందరు అరెస్టు కావడంతో పాటు మరికొందరిని విచారించారు. అయితే ఇప్పటి వరకు అధికారుల మినహా మిగిలిన వారి పాత్రలపై పూర్తి స్పష్టత రాలేదని, అది వచ్చిన తర్వాతే నిందితుల జాబితా ఖరారు అవుతుంది.

సాక్షుల విచారణ ప్రక్రియ పూర్తి అయింది.ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నుంచి కొన్ని నివేదికలు రావాల్సి ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు దర్యాప్తులో తేలిన అంశాల ప్రకారం ఆ సమయంలో ఐజీ ర్యాంకులో అనేక మంది అధికారులు అందుబాటులో ఉన్నా ప్రభాకర్‌రావును కీలక పోస్టులో కొనసాగించడం, ఆయనకు ఎక్స్‌టెన్షన్‌ ఇవ్వడాన్ని క్విడ్‌ ప్రొకోగా పరిగణిస్తున్నాం. తుది చార్జ్‌షీట్‌ దాఖలు అయిన తర్వాత ట్యాపింగ్‌ కేసులో డిశ్చార్జ్‌ పిటిషన్లు, క్వాష్‌ పిటిషన్లు దాఖలు అవుతాయి. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్తుందని అంచనా వేస్తూ చార్జ్‌షీట్, నిందితుల జాబితాలు రూపొందిస్తున్నాం. వాస్తవానికి గత నెల 27 నాటికే తుది చార్జ్‌షీట్‌ దాఖలు చేయాలని సిట్‌ భావించింది. అయితే ఫోరెన్సిక్‌ నివేదికల్లో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలతో దర్యాప్తు కొనసాగించాల్సి రావడంతో ఆలస్యమైంది.
ఈ కేసు నమోదైన తొలినాళ్లల్లో సినీ రంగం, వ్యాపార రంగాలకు సంబంధించి అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ వాటికి ఆధారాలు లభించలేదు అని స‌జ్జ‌నార్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement