త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Naa Anveshana | నేపాల్, బంగ్లాదేశ్‌లా మన దేశంలో చిచ్చులు పెట్టడానికి నా అన్వేషణకి ఫారెన్ ఫండ్?

అన్వేష్ ఇండియాపై కుట్ర చేస్తున్నాడని.. చాలా రోజుల నుంచి సరిగ్గా వీడియోలు కూడా పెట్టని అన్వేష్‌కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటూ రవి ప్రశ్నించాడు. నేపాల్‌లో ఏం జరిగిందో చూశాం. బంగ్లాదేశ్‌లో ఇప్పుడు ఏం జరుగుతున్నదో చూస్తున్నాం.

J

Viral news | Published On Dec 31, 2025, 6.19 pm IST

Naa Anveshana | నేపాల్, బంగ్లాదేశ్‌లా మన దేశంలో చిచ్చులు పెట్టడానికి నా అన్వేషణకి ఫారెన్ ఫండ్?
Advertisement

Naa Anveshana | ప్రస్తుతం నా అన్వేషణ అన్వేష్ టాపిక్ గురించే సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశమంతా అన్వేష్ టాపిక్ గురించే చర్చ. తెలుగు నటుడు శివాజీ దగ్గర్నుంచి ప్రారంభమైన ఈ టాపిక్ కాస్త యూటర్న్ తీసుకొని హిందువులు, అత్యాచారాలు, సీతమ్మ, ద్రౌపది ఇలా అటూ ఇటూ తిరుగుతూ చివరకు ఫారెన్ ఫండ్ దగ్గరికి వచ్చి ఆగింది. ఇప్పటికే అన్వేష్‌పై తెలుగు రాష్ట్రాల్లో పలు కేసులు నమోదయ్యాయి. పలు హిందూ సంఘాలు అన్వేష్‌పై కేసులు నమోదు చేశారు. ఇవన్నీ పక్కన పెడితే తాజాగా రవి తెలుగు ట్రావెలర్ పేరుతో యూట్యూబ్ చానెల్ నడుపుతున్న ఇన్‌ఫ్లూయెన్సర్, తెలుగు వ్యక్తి రవి.. అన్వేష్‌పై విరుచుకుపడ్డాడు. ఇప్పటికే అన్వేష్ సోషల్ మీడియా చానెళ్లు అన్నింటిని అన్‌ఫాలో చేయాలని వీడియో చేసిన రవి.. తాజాగా అన్వేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక పెద్ద కుట్రనే జరుగుతోందని కొత్త టాపిక్‌ని తీసుకొచ్చాడు.

ఇండియాపై అన్వేష్ కుట్ర

అన్వేష్ ఇండియాపై కుట్ర చేస్తున్నాడని.. చాలా రోజుల నుంచి సరిగ్గా వీడియోలు కూడా పెట్టని అన్వేష్‌కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటూ రవి ప్రశ్నించాడు. నేపాల్‌లో ఏం జరిగిందో చూశాం. బంగ్లాదేశ్‌లో ఇప్పుడు ఏం జరుగుతున్నదో చూస్తున్నాం. అలా మన దేశంలో కూడా మతాలు, కులాల పేరుతో చిచ్చులు పెట్టేందుకు అన్వేష్‌ని పావులా వాడుకొని ఏ దేశమో ఫండ్ ఇస్తోందని ఆరోపించాడు. అయితే.. ఆయన ఎలాంటి ఆధారాలు లేకుండా అన్వేష్‌పై ఆరోపణలు చేశాడు.

అది అమెరికా కావచ్చు.. చైనా కావచ్చు.. యూకే కావచ్చు.. పాకిస్థాన్ కావచ్చు.. ఏ దేశమో తెలియదు కానీ.. ఖచ్చితంగా ఏదో ఒక దేశం అన్వేష్‌కి డబ్బు ఆశ చూపించి భారత్‌లో చిచ్చు పెట్టాలని.. ఇండియాలో మత కలహాలు సృష్టించేలా చేయాలని డబ్బు ముట్టజెప్పిందని.. అందుకే వీడియోలు ఎక్కువగా చేయకుండా మంచి టాపిక్ చూసుకొని ఇండియాలో చిచ్చు పెట్టేందుకు రెడీ అయ్యాడని.. దానికి ఫలితమే ప్రస్తుతం జరుగుతున్న రచ్చ అంటూ చెప్పుకొచ్చాడు రవి. దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో రవి పోస్ట్ చేశాడు. అది నిజమా? అబద్ధమా? అనేది తెలియదు కానీ.. రవి చెప్పిన దాన్ని బట్టి నెటిజన్లు కూడా ఒక అంచనాకు వస్తున్నారు. నిజమేనా.. అన్వేష్ ఇంతకి తెగించాడా? అతడి చానెల్‌ని బ్యాన్ చేయాల్సిందే. ఇంకా ఫాలోవర్స్ తగ్గాలి.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement