Aye Jude vs Naa Anveshana | ఏయ్ జూడ్ తెలుసు కదా. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్. కరెంట్ టాపిక్స్‌పై తనదైన శైలిలో విశ్లేషణ చేయడం మనోడి స్టైల్. తాజాగా నా అన్వేషణ విషయంలోనూ రెస్పాండ్ అయ్యాడు. దానికి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేశాడు. సీతమ్మ మీద, రాముడి మీద, హిందు దేవుళ్ల మీద విమర్శలు చేసిన అన్వేష్‌ని ఈ వీడియోలో ఏయ్ జూడ్ ఏకిపారేశాడు. నా సీతమ్మ మీద, నా రాముడి మీద, నా హనుమంతుడి మీద, నా శివుడి మీద.. ఇలా నా హిందు దేవుళ్ల మీద విమర్శలు చేసే నా కొడకల్లారా ఖబడ్దార్ అంటూ హెచ్చరించాడు. డైరెక్ట్‌గా నా అన్వేషణను తిట్టకుండా హిందువులపై, హిందూ దేవుళ్లపై విమర్శలు చేసేవారిని ఉద్దేశిస్తూ ఏయ్ జూడ్ వీడియో చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.