72 LPA Job Offer Rejected | రూ.72 లక్షల భారీ ప్యాకేజీని రిజెక్ట్ చేసిన టెకీ: కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ఏడాదికి ఏకంగా రూ.72 లక్షల భారీ శాలరీ ఆఫర్.. కానీ ఆ టెక్ ఉద్యోగి మాత్రం నో చెప్పేశాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆసక్తికర కథనం మీకోసం.
Viral news | Published On Jun 1, 2026, 6.38 pm IST
72 LPA Job Offer Rejected | త్రినేత్ర.న్యూస్ : కార్పొరేట్ ప్రపంచంలో నెలకు లక్షల్లో జీతం, ఏడాదికి కోట్లలో ప్యాకేజీ అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. అలాంటిది ఏకంగా రూ.72 లక్షల వార్షిక ప్యాకేజీ (72 LPA) ఆఫర్ వస్తే.. అసలు వదులుకుంటారా? కానీ, ఒక సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ మాత్రం ఆ భారీ ఆఫర్‌ను మొహమాటం లేకుండా రిజెక్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ విషయానికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ నిర్ణయంపై నెటిజన్ల మధ్య పెద్ద ఎత్తున డిబేట్ నడుస్తోంది.
అసలేం జరిగిందంటే?
ఒక నెటిజన్ తన ఫ్రెండ్‌కు జరిగిన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. "నా ఫ్రెండ్ ఒకరు రూ.72 లక్షల ప్యాకేజీ ఉన్న జాబ్ ఆఫర్‌ను రిజెక్ట్ చేశాడు. దానికి రీజన్స్ ఏంటంటే.. వారంలో 5 రోజులూ ఆఫీస్‌కు రావాలనే కండిషన్ (Strict WFO), అస్సలు లీవ్ పాలసీ (No leave policy) లేకపోవడం, కనీసం రీలోకేషన్ సపోర్ట్ కూడా ఇవ్వకపోవడం. కానీ నన్ను బాగా ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే.. అంత పెద్ద ఆఫర్ పోయినా అతనిలో ఎలాంటి బాధా లేదు" అంటూ సదరు యూజర్ పోస్ట్ పెట్టారు.
My friend just rejected a 72 LPA offer.
Reasons:
• 5 days strict WFO
• No leave policy
• Zero relocation supportWhat shocked me the most? He had zero sense of loss.
It’s fascinating that people like these exist who are willing to let so much money go because of work life… pic.twitter.com/GtSOLEi4S3
— Ragini Pandey (@pandeyragini24) May 31, 2026
డబ్బు కంటే మానసిక ప్రశాంతత, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ (Work-life balance) ముఖ్యమని భావించే వాళ్లు కూడా ఉంటారని, నేటి తరం ఉద్యోగుల ప్రాధాన్యతలు మారుతున్నాయని ఆమె ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
రిక్రూటర్‌కు పంపిన వాట్సాప్ మెసేజ్ స్క్రీన్‌షాట్ వైరల్
ఆ పోస్ట్‌తో పాటు సదరు అభ్యర్థి కంపెనీ రిక్రూటర్‌కు (Recruiter) పంపిన వాట్సాప్ మెసేజ్ స్క్రీన్‌షాట్ కూడా బయటకు వచ్చింది. ఆ మెసేజ్‌లో ఆఫర్‌ను ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందో చాలా స్పష్టంగా వివరించాడు.
కంపెనీ పెట్టిన నిబంధనలు ఉద్యోగులకు ఏమాత్రం అనుకూలంగా లేవని పేర్కొన్నాడు. కేవలం 25 శాతం శాలరీ హైక్ (Salary hike) కోసం లీవ్స్ లేని కంపెనీలో జాయిన్ అవ్వడం కరెక్ట్ కాదని, పైగా కొత్త నగరానికి మారేందుకు ఎలాంటి రీలోకేషన్ బెనిఫిట్స్ (Relocation benefits) కూడా ఇవ్వట్లేదని నిలదీశాడు. కెరీర్ ప్రారంభంలో ఉంటే ఇలాంటి ఆఫర్లు ఆకర్షణీయంగా అనిపిస్తాయేమో కానీ, ఇప్పుడు చూస్తే ఈ అగ్రిమెంట్ మొత్తం కేవలం కంపెనీ లాభం కోసమే తప్ప ఉద్యోగి గురించి ఆలోచించినట్లు లేదని కుండబద్దలు కొట్టాడు.
సోషల్ మీడియాలో భిన్నమైన కామెంట్లు
ఈ వైరల్ పోస్ట్‌పై ఇంటర్నెట్ లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలామంది సదరు అభ్యర్థి తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.
"కనీసం లీవ్ పాలసీ కూడా లేని కంపెనీలు ఉంటాయా? అసలు అది ఎలాంటి కంపెనీ?" అని ఒకరు కామెంట్ చేయగా.. "అతను చాలా ప్రాక్టికల్‌గా ఆలోచించి కరెక్ట్ నిర్ణయమే తీసుకున్నాడు. బెంగళూరు లాంటి కాస్ట్లీ సిటీకి మారినప్పుడు నెలకు రూ.70-80 వేల ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి. పెయిడ్ లీవ్స్ లేకపోవడం అంటే ఏడాదిలో 12 నెలలు కాకుండా 13 నెలలు పనిచేసినట్లే. పైగా భారీగా టాక్స్ కట్ అవుతుంది. కాబట్టి 25% హైక్ కోసం ఇవన్నీ భరించడం వేస్ట్" అని మరొకరు మద్దతుగా నిలిచారు.
మొత్తానికి, ఈ వైరల్ స్టోరీ కార్పొరేట్ కంపెనీల్లో ఉండాల్సిన కనీస నిబంధనలపై, ఉద్యోగుల మానసిక ప్రశాంతతపై ఒక సరికొత్త చర్చకు దారితీసింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Startup Culture India | డ్యూటీ అయ్యాక పడుకుంటే ‘అన్‌ప్రొఫెషనల్’ అంటారా? స్టార్టప్ కల్చర్‌పై భగ్గుమంటున్న నెటిజన్లు
జులై 9, 2026

Work From Bike | బైక్‌పై ల్యాప్‌టాప్‌తో యువకుడి ప్రయాణం.. తీవ్రంగా స్పందించిన సజ్జనార్
జూన్ 13, 2026

Deepika Padukone | సమయం కాదు క్రియేటివిటీయే ముఖ్యం.. దీపికా పదుకొనే పని గంటలపై సౌరభ్ శుక్లా కామెంట్స్..!
ఫిబ్రవరి 2, 2026
తాజావార్తలు
- ●Mumbai Cop Vinod Kalukhe | సీజేపీ ఆందోళనల్లో స్పెషల్ అట్రాక్షన్: ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ముంబై 'పూకీ' కాప్.. ఇతని స్టోరీ ఇదే!
- ●Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల
- ●Serial Actress | మోడ్రన్ లుక్‌లో గుండె నిండా గుడి గంటలు మీనా
- ●PM Modi Exam Reforms | ఎగ్జామ్ పేపర్ లీక్స్‌కు చెక్: రంగంలోకి నందన్ నిలేకని.. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ!
- ●Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ
- ●Rasha Thadani | అమ్మ స్టార్ హీరోయిన్ - నాన్న పెద్ద ప్రొడ్యూసర్ - శ్రీనివాస మంగాపురం హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!

Mumbai Cop Vinod Kalukhe | సీజేపీ ఆందోళనల్లో స్పెషల్ అట్రాక్షన్: ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ముంబై 'పూకీ' కాప్.. ఇతని స్టోరీ ఇదే!

Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల

Serial Actress | మోడ్రన్ లుక్‌లో గుండె నిండా గుడి గంటలు మీనా

PM Modi Exam Reforms | ఎగ్జామ్ పేపర్ లీక్స్‌కు చెక్: రంగంలోకి నందన్ నిలేకని.. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ!



