త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vaibhav Suryavanshi | మ‌ళ్లీ చిత‌క్కొట్టిన వైభ‌వ్‌.. టీ20ల్లో అరుదైన చ‌రిత్ర సృష్టించిన సూర్య‌వంశీ

Vaibhav Suryavanshi | భారత యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. 16 ఏళ్లలోపే రెండు అర్ధశతకాలు నమోదు చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం 15 ఏళ్ల 121 రోజుల వయసులో ఉన్న వైభవ్.. ఆదివారం హరారే స్పోర్ట్స్‌ క్లబ్‌లో జరిగిన టీ20 సిరీస్‌ మూడో మ్యాచ్‌లో ఈ ఘనతను అందుకున్నాడు.

P

Entertainment | Published On Jul 26, 2026, 7.30 pm IST

Vaibhav Suryavanshi | మ‌ళ్లీ చిత‌క్కొట్టిన వైభ‌వ్‌.. టీ20ల్లో అరుదైన చ‌రిత్ర సృష్టించిన సూర్య‌వంశీ
Advertisement

Vaibhav Suryavanshi | భారత యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. 16 ఏళ్లలోపే రెండు అర్ధశతకాలు నమోదు చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం 15 ఏళ్ల 121 రోజుల వయసులో ఉన్న వైభవ్.. ఆదివారం హరారే స్పోర్ట్స్‌ క్లబ్‌లో జరిగిన టీ20 సిరీస్‌ మూడో మ్యాచ్‌లో ఈ ఘనతను అందుకున్నాడు. జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో వైభవ్‌ సూర్యవంశీ 49 బంతుల్లో 81 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో నాలుగు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లు ఉన్నాయి. అంతకుముందు ఇదే సిరీస్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ వైభవ్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 19 బంతుల్లోనే 50 పరుగులు చేసి తన సత్తా చాటాడు. ఆ ఇన్నింగ్స్‌లో నాలుగు సిక్సర్లు, నాలుగు ఫోర్లు బాదాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అతి పిన్న వయసులో అర్ధశతకం సాధించిన ఆటగాడిగానూ వైభవ్‌ రికార్డు నెలకొల్పాడు. 15 ఏళ్ల 118 రోజుల వయసులోనే ఈ ఘనత సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు.

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోరు సాధించింది. 20 పరుగుల వద్ద అభిషేక్‌ శర్మ (2) వికెట్‌ కోల్పోయిన భారత్‌ను వైభవ్‌, ఇషాన్‌ కిషన్‌ కలిసి ఆదుకున్నారు. రెండో వికెట్‌కు 50 బంతుల్లో 75 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును పటిష్ఠ స్థితికి చేర్చారు. ఇషాన్‌ కిషన్‌ 26 బంతుల్లో 29 పరుగులు చేసి వెనుదిరిగిన తర్వాత.. వైభవ్‌ సూర్యవంశీతో కలిసి శ్రేయస్‌ అయ్యర్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 29 బంతుల్లో 50 పరుగులు జోడించారు. వైభవ్‌ 81 పరుగులతో కీలక పాత్ర పోషించగా, కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ 27 పరుగులు చేశాడు. రింకూ సింగ్‌ 14 బంతుల్లో మూడు బౌండరీలతో 25 పరుగులు సాధించాడు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్‌ ఎవాన్స్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. సికందర్‌ రజా, బ్లెస్సింగ్‌ ముజరబాని, వెస్లీ మధెవెరే తలో వికెట్‌ తీశారు. చిన్న వయసులోనే వైభవ్‌ సూర్యవంశీ ప్ర‌ద‌ర్శ‌న భారత క్రికెట్‌లో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement