Deepika Padukone | సమయం కాదు క్రియేటివిటీయే ముఖ్యం.. దీపికా పదుకొనే పని గంటలపై సౌరభ్ శుక్లా కామెంట్స్..!
Deepika Padukone | బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే గతంలో పని గంటలపై చేసిన వ్యాఖ్యలపై సినీ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రోజుకు ఎనిమిది గంటల పని షిఫ్ట్ ఉండాలని దీపికా కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో విభేదాలు రావడంతో భారీ ప్రాజెక్టులైన స్పిరిట్‌తో పాటు కల్కి 2898 ఏడీ సీక్వెల్‌లో నటించే అవకాశాన్ని కోల్పోయినట్లుగా వార్తలు వచ్చాయి.
Entertainment | Published On Feb 2, 2026, 1.15 pm IST
Deepika Padukone | బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే గతంలో పని గంటలపై చేసిన వ్యాఖ్యలపై సినీ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రోజుకు ఎనిమిది గంటల పని షిఫ్ట్ ఉండాలని దీపికా కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో విభేదాలు రావడంతో భారీ ప్రాజెక్టులైన స్పిరిట్‌తో పాటు కల్కి 2898 ఏడీ సీక్వెల్‌లో నటించే అవకాశాన్ని కోల్పోయినట్లుగా వార్తలు వచ్చాయి. అవకాశాలు చేజారినా ఈ నటి మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆమెకు నటీనటులు మద్దతు తెలిపారు. తాజాగా ఈ అంశంపై రచయిత, నటుడు సౌరబ్ శుక్లా సైతం స్పందించారు.

ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ.. క్రియేటివ్ ఫీల్డ్‌లో పనిగంటలు ఖచ్చితంగా నిర్ణయించలేమన్నారు. షూటింగ్ సమయంలో సమయపాలన కంటే నిరంతరం పని చేయడం ముఖ్యమన్నారు. క్రియేటివిటీ కోసం అవసరమైతే కొంత వరకు అదనంగా పని చేయాల్సి వస్తే దానిపై ఫిర్యాదులు చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. పూర్తిగా పనిలో లీనమైనప్పుడు అనుకోకుండా గంట, అరగంట అదనంగా పని చేయాల్సి వస్తే అసహనం అవసరం లేదన్నారు. ఎందుకంటే అందుకు తగిన ప్రతిఫలం లభిస్తుందని చెప్పారు. సెట్‌లో పనిగంటలపై కాకుండా నటీనటులు కేవలం తమ పనిపై మాత్రమే దృష్టి పెట్టాలన్నారు. గడువు ఉండాల్సిందేనన్న ఆయన.. కానీ అదే ప్రధానమని భావించొద్దని సూచించారు. గడియారం వైపు చూస్తూ ఇప్పుడు ఆరైంది.. ఎనిమిదైంది అని ఆలోచించకుండా.. చేస్తున్న పనిపై దృష్టి పెట్టాలని ఆయన వ్యాఖ్యానించారు.

గతేడాది దీపికా పదుకొనే ఎనిమిది గంటల పని విధానంపై స్పందించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇండస్ట్రీలోని పలువురు అగ్రశ్రేణి నటులు సైతం ఈ విధానాన్ని అవలంభిస్తున్నారని.. తాను తల్లిని అయ్యాక ఇదే విషయంపై మాట్లాడితే అసంబద్ధమని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తాను అన్నదంట్లో తప్పు గానీ, అసంబద్ధమని అనుకోవడం లేదని స్పష్టం చేసింది. ఈ వ్యవస్థలో ఏళ్లుగా పని చేసిన వారికికే మనం ఎలాంటి పరిస్థితుల్లో పని చేస్తున్నామో తెలుస్తుందని.. ఇలాంటి డిమాండ్ చేయడం తాను తొలిసారేం కాదని.. ప్రముఖ హీరోలు ఈ విధానంలో పని చేస్తున్నారని.. అది ఎప్పుడు వార్త కాలేదని దీపికా తనదైన శైలిలో స్పందించింది.
Read Also :
Shriya Saran | రిలీజ్ కానీ సినిమాకు తమిళనాడు స్టేట్ అవార్డులు - శ్రియా మూవీని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
Rakul Preet Singh | హైదరాబాద్‌లోని ఆస్తులన్నీ అమ్మేసిన రకుల్ – కారణం ఇదేనా?
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●China Floods | చైనాలో వరద బీభత్సం: నీటిలో కొట్టుకొచ్చిన 900 విష సర్పాలు.. పాముకాటుతో మహిళ మృతి
- ●Bhatti Vikramarka | రైతు భరోసాకు మరో రూ.1,900 కోట్లు.. ఖమ్మం సభలో డిప్యూటీ భట్టి ప్రకటన
- ●Damodara nd Vivek | ఈఎస్ఐ డిస్పెన్సరీ సేవలు మరింత బలోపేతం చేస్తున్నాం
- ●El Nino Impact Telangana | ఎల్‌నినో టెన్షన్ వద్దు.. ఈ పంటలే ముద్దు!
- ●Venkatesh Son | వెంకటేష్ వారసుడు వచ్చేస్తున్నాడోచ్ - దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరో?
- ●Man Sleeping on Bull | నడి రోడ్డుపై ఎద్దు ఒడిలో హాయిగా నిద్ర.. ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ బ్రో.. వీడియో వైరల్

China Floods | చైనాలో వరద బీభత్సం: నీటిలో కొట్టుకొచ్చిన 900 విష సర్పాలు.. పాముకాటుతో మహిళ మృతి

Bhatti Vikramarka | రైతు భరోసాకు మరో రూ.1,900 కోట్లు.. ఖమ్మం సభలో డిప్యూటీ భట్టి ప్రకటన

Damodara nd Vivek | ఈఎస్ఐ డిస్పెన్సరీ సేవలు మరింత బలోపేతం చేస్తున్నాం

El Nino Impact Telangana | ఎల్‌నినో టెన్షన్ వద్దు.. ఈ పంటలే ముద్దు!





