Startup Culture India | డ్యూటీ అయ్యాక పడుకుంటే ‘అన్‌ప్రొఫెషనల్’ అంటారా? స్టార్టప్ కల్చర్‌పై భగ్గుమంటున్న నెటిజన్లు
ఆఫీస్ అయ్యాక నిద్రపోయినందుకు ఓ ఉద్యోగిని "అన్‌ప్రొఫెషనల్" అన్న స్టార్టప్ కంపెనీ. తల్లికి ఫోన్ చేసి మరీ క్లాస్ పీకడంతో నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది.
Viral news | Published On Jul 9, 2026, 4.56 pm IST
- రూ.23 వేల జీతానికి పనిచేస్తున్న ఓ స్టార్టప్ ఉద్యోగి కథ నెట్టింట వైరల్
- ప్రాజెక్ట్ డెడ్‌లైన్ పేరుతో రాత్రి 2 గంటల వరకు పనిచేయాలని యాజమాన్యం ఒత్తిడి
- అనారోగ్యంతో అతడు నిద్రపోగా, కొలీగ్స్ వాట్సప్ కాల్ చేసి అతడి తల్లికి ఫిర్యాదు
- దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతూ, వర్క్‌ప్లేస్ బౌండరీస్ గురించి చర్చ
Startup Culture India | త్రినేత్ర.న్యూస్ : మొదటి ఉద్యోగం అనగానే ఎవరికైనా ఎంతో ఉత్సాహం ఉంటుంది. ముఖ్యంగా స్టార్టప్ (Startup) కంపెనీల్లో చేరే యువత.. కొత్త విషయాలు నేర్చుకోవచ్చని, కెరీర్ ఫాస్ట్‌గా గ్రో అవుతుందని ఆశిస్తారు. కానీ వర్క్ మీద ఉన్న ఉత్సాహాన్ని (Work enthusiasm) ఎక్కడ ఆపాలో, పర్సనల్ లైఫ్ (Personal life) ఎక్కడ మొదలుపెట్టాలో తెలియకపోతే తీవ్ర ఇబ్బందులు తప్పవు. తాజాగా ఓ యువకుడు డ్యూటీ అయిపోయాక నిద్రపోయినందుకు.. అతడిని "అన్‌ప్రొఫెషనల్" (Unprofessional) అంటూ కంపెనీ ఉద్యోగులు దూషించిన ఘటన రెడిట్ (Reddit) వేదికగా తీవ్ర చర్చకు దారితీసింది.
అసలేం జరిగిందంటే?
రెడిట్ పోస్ట్ ప్రకారం.. ఆ యువకుడు నెలకు రూ.23,000 జీతంతో ఓ ఎర్లీ-స్టేజ్ స్టార్టప్‌లో చేరాడు. అతడి రెగ్యులర్ ఆఫీస్ టైమింగ్స్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. కానీ ఒకరోజు ప్రాజెక్ట్ డెడ్‌లైన్ (Project deadline) ఉందని, టీమ్ మొత్తం రాత్రి 2 గంటల వరకు పనిచేయాలని యాజమాన్యం కండిషన్ పెట్టింది. రోజంతా సిస్టమ్ ముందు కూర్చోవడంతో కళ్లు తీవ్రంగా స్ట్రెయిన్ (Eye strain) అయ్యాయని.. మందులు వేసుకుని పడుకున్నానని ఆ యువకుడు తెలిపాడు.
తల్లికి ఫోన్ చేసి మరీ క్లాస్
అతడు నిద్రపోతున్న సమయంలో రాత్రి పూట కొలీగ్స్ వాట్సప్ గ్రూప్ కాల్ చేశారు. ఫోన్ మోగుతూనే ఉండటంతో అతడి తల్లి ఫోన్ లిఫ్ట్ చేసింది. అయితే, తర్వాత రోజు ఉదయం కాల్ చేయమని చెప్పాల్సింది పోయి.. "ఇది ఫుల్ టైమ్ జాబ్, తను ఇలా ఎలా పడుకుంటాడు?" అంటూ ఆమెను ప్రశ్నించారు. అతడి ప్రవర్తన "అన్‌ప్రొఫెషనల్" అని ఆరోపించారు.
మిస్డ్ కాల్స్ కన్నా.. తన తల్లికి ఫోన్ చేసి మాట్లాడిన తీరు ఆ యువకుడిని తీవ్రంగా బాధించింది. "నేను ఓవర్‌రియాక్ట్ అవుతున్నానా? లేక వాళ్లే ప్రొఫెషనల్ బౌండరీస్ (Professional boundaries) దాటారా?" అంటూ రెడిట్ యూజర్లను సలహా అడిగాడు.

నెటిజన్ల ఫైర్.. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఏదీ?
ఈ పోస్ట్ నిమిషాల్లోనే వైరల్ (Viral) అయింది. ఆఫీస్ టైమ్స్ తర్వాత ఎంప్లాయ్ ఫ్యామిలీకి కాల్ చేయడం పూర్తిగా తప్పు అని నెటిజన్లు మండిపడుతున్నారు. వెంటనే రిజైన్ చేయొద్దని.. కొత్త జాబ్ చూసుకున్నాకే అక్కడి నుంచి బయటపడాలని కొందరు సలహా ఇచ్చారు. స్టార్టప్ కల్చర్‌లో ఇలాంటి "టాక్సిక్" (Toxic) వాతావరణం కామన్ అయిపోయిందని.. ఎక్కువ గంటలు పనిచేస్తేనే కమిట్‌మెంట్ ఉన్నట్లు భావిస్తున్నారని విమర్శించారు.
నేటి తరం యువత కేవలం భారీ ప్యాకేజీల కోసమే పనిచేయడం లేదు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ (Work-life balance), మేనేజర్ల సపోర్ట్, హెల్తీ వర్క్ కల్చర్.. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఆరోగ్యం బాగోలేక పడుకుంటే ఫ్యామిలీకి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వడం ఆర్గనైజేషనల్ కల్చర్‌పై ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతోంది.
ఫ్రెషర్స్ నేర్చుకోవాల్సిన పాఠాలు
కంపెనీలో ఏం జరిగిందనేది పూర్తిగా నిర్ధారించలేకపోయినా.. ఈ వైరల్ డిస్కషన్ ఫస్ట్ జాబ్‌లో చేరే గ్రాడ్యుయేట్స్ (Graduates) కు కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్పుతోంది.
- ఆఫర్ లెటర్ తీసుకునే ముందు వర్కింగ్ అవర్స్ (Working hours), ఓవర్‌టైమ్ రూల్స్ గురించి స్పష్టంగా తెలుసుకోండి.
- క్రిటికల్ ప్రాజెక్టుల సమయంలో మేనేజర్లతో ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేయండి.
- మొదటి నుంచే ఆఫీస్ వర్క్‌కు, పర్సనల్ లైఫ్‌కు మధ్య స్ట్రాంగ్ బౌండరీస్ (Boundaries) సెట్ చేసుకోండి.
- శారీరక, మానసిక ఆరోగ్యానికే ఎప్పుడూ తొలి ప్రాధాన్యత ఇవ్వండి.
- కేవలం శాలరీ ప్యాకేజీ, బ్రాండ్ వాల్యూ మాత్రమే కాదు.. ఆ కంపెనీ కల్చర్ (Company culture) ఎలా ఉందో ఆరా తీయండి.
కెరీర్ అనేది కేవలం కష్టపడి పనిచేయడమే కాదు.. మన పనికి, వ్యక్తిగత జీవితానికి సమానమైన గౌరవం దొరికే వాతావరణాన్ని ఎంచుకోవడం కూడా!
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

ల్యాప్‌టాప్ షట్‌డౌన్… మైండ్ ఇంకా ఆన్లైన్! ఐటీ ఉద్యోగులను వేధించే బర్నౌట్
అక్టోబర్ 2, 2026

Gen Z Job Rejection | కోటి రూపాయల ప్యాకేజీని వదులుకున్న 25 ఏళ్ల కుర్రాడు.. కారణం తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు
ఆగస్టు 16, 2026

Work From Bike | బైక్‌పై ల్యాప్‌టాప్‌తో యువకుడి ప్రయాణం.. తీవ్రంగా స్పందించిన సజ్జనార్
జూన్ 13, 2026
తాజావార్తలు
- ●TUWJ | హెల్త్ కార్డుల కోసం జర్నలిస్టుల పోస్టు కార్డు ఉద్యమం
- ●ల్యాప్‌టాప్ షట్‌డౌన్… మైండ్ ఇంకా ఆన్లైన్! ఐటీ ఉద్యోగులను వేధించే బర్నౌట్
- ●Tamil Nadu | తమిళనాడులో హైవే బోర్డులపై హిందీ.. ఇద్దరు అధికారుల సస్పెండ్
- ●V Prakash | ప్రత్యేక దేశం కోసం పోరాడాల్సి వస్తుంది : వీ ప్రకాశ్
- ●Harish Rao | టీజీ-ట్రాన్స్‌కో ప్రైవేటీకరణను ఆపండి.. రాహుల్‌కు హరీశ్‌రావు లేఖ
- ●AISF | ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. అధ్యక్ష, కార్యదర్శిగా మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్

TUWJ | హెల్త్ కార్డుల కోసం జర్నలిస్టుల పోస్టు కార్డు ఉద్యమం

ల్యాప్‌టాప్ షట్‌డౌన్… మైండ్ ఇంకా ఆన్లైన్! ఐటీ ఉద్యోగులను వేధించే బర్నౌట్

Tamil Nadu | తమిళనాడులో హైవే బోర్డులపై హిందీ.. ఇద్దరు అధికారుల సస్పెండ్

V Prakash | ప్రత్యేక దేశం కోసం పోరాడాల్సి వస్తుంది : వీ ప్రకాశ్



