Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల
Agadha Movie | ప్రముఖ దర్శకనిర్మాత ఎంఎస్ రాజు తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘అగధ’ ప్రచార కార్యక్రమాలు వినూత్నంగా ప్రారంభమయ్యాయి. డివైన్ మిస్టిక్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ప్రచార జాతరకు హైదరాబాద్‌లోని ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ–పోచమ్మ అమ్మవారి ఆలయంలో ఆదివారం శ్రీకారం చుట్టారు.
Entertainment | Published On Jul 26, 2026, 8.15 pm IST
Agadha Movie | ప్రముఖ దర్శకనిర్మాత ఎంఎస్ రాజు తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘అగధ’ ప్రచార కార్యక్రమాలు వినూత్నంగా ప్రారంభమయ్యాయి. డివైన్ మిస్టిక్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ప్రచార జాతరకు హైదరాబాద్‌లోని ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ–పోచమ్మ అమ్మవారి ఆలయంలో ఆదివారం శ్రీకారం చుట్టారు. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు బల్కంపేట ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కథానాయిక కామాక్షి భాస్కర్ల సంప్రదాయ దుస్తుల్లో భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పించారు. కార్యక్రమంలో దర్శకుడు ఎంఎస్ రాజు, నిర్మాత కాశీ విశాలాక్షి బలుసు, సమర్పకులు అజయ్ కేఆర్, హీరో శ్రవణ్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎన్‌వీఎన్ సుబ్బరాజు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్మాత కాశీ విశాలాక్షి బలుసు మాట్లాడుతూ.. ‘‘దేవి చిత్రం సృష్టించిన చరిత్రలాంటి వైబ్స్ ఇప్పుడు ‘అగధ’ విషయంలోనూ కనిపిస్తున్నాయి. పోస్టర్, టీజర్‌తోనే సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆగస్టు 14న భారీ స్థాయిలో విడుదల కానున్న మా సినిమా ప్రచార జాతర అమ్మవారి సన్నిధిలో ప్రారంభం కావడం శుభసూచకం’’ అని తెలిపారు. దర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ.. ‘‘అగధ కథలో అమ్మవారి అంశం కీలకంగా ఉంటుంది. అందుకే బల్కంపేట అమ్మవారి ఆశీస్సులతో ప్రచార కార్యక్రమాలను ప్రారంభించడం ఆనందంగా ఉంది. పెద్ద బడ్జెట్ చిత్రాల తరహాలోనే ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయనున్నాం. త్వరలోనే ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని చెప్పారు. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ పతాకంపై అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు ఈ చిత్రాన్ని నిర్మించారు. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్క గుప్తా, జోవికా విజయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ
జులై 26, 2026

CWG 2026 | గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్.. వెయిట్లిఫ్ట్లో భారత్‌కు సిల్వర్..!
జులై 26, 2026

Mrunal Thakur | మృణాల్ తగ్గేదేలే – హిట్లు లేకపోయినా రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచిన బ్యూటీ
జులై 26, 2026
తాజావార్తలు
- ●Serial Actress | మోడ్రన్ లుక్‌లో గుండె నిండా గుడి గంటలు మీనా
- ●PM Modi Exam Reforms | ఎగ్జామ్ పేపర్ లీక్స్‌కు చెక్: రంగంలోకి నందన్ నిలేకని.. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ!
- ●Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ
- ●Rasha Thadani | అమ్మ స్టార్ హీరోయిన్ - నాన్న పెద్ద ప్రొడ్యూసర్ - శ్రీనివాస మంగాపురం హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
- ●Malayalam OTT | ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ - సీన్ సీన్‌కో మలుపు
- ●Hardik Pandya | పాండ్యాపై కన్నేసిన చెన్నైకి.. ముంబయి ఇండియన్స్‌తో డీల్‌పై సీఎస్కే ఆసక్తి..!

Serial Actress | మోడ్రన్ లుక్‌లో గుండె నిండా గుడి గంటలు మీనా

PM Modi Exam Reforms | ఎగ్జామ్ పేపర్ లీక్స్‌కు చెక్: రంగంలోకి నందన్ నిలేకని.. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ!

Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ

Rasha Thadani | అమ్మ స్టార్ హీరోయిన్ - నాన్న పెద్ద ప్రొడ్యూసర్ - శ్రీనివాస మంగాపురం హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!



