Mumbai Cop Vinod Kalukhe | సీజేపీ ఆందోళనల్లో స్పెషల్ అట్రాక్షన్: ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ముంబై ‘పూకీ’ కాప్.. ఇతని స్టోరీ ఇదే!
సీజేపీ ఆందోళనల సమయంలో ముంబైకి చెందిన ఓ కానిస్టేబుల్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అతడు సిగ్గుపడిన విధానానికి ఫిదా అయిన జెన్ జెడ్ ఏకంగా 'పూకీ' కాప్‌గా మార్చేశారు.
Viral news | Published On Jul 26, 2026, 10.00 pm IST
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం ముంబైలో జరిగిన ఆందోళనల్లో వినోద్ కలుఖే అనే కానిస్టేబుల్ వీడియో వైరల్
- ఒక ఇంగ్లీష్ పాటకు కానిస్టేబుల్ రియాక్షన్ చూసి జెన్ జెడ్ (Gen Z) 'పూకీ' అంటూ నామకరణం
- తను వైరల్ అయిన వీడియోను మరో క్రియేటర్ చూపించగా.. అతడు సిగ్గుపడిన తీరుకు నెటిజన్లు ఫిదా
- తీవ్రమైన రాజకీయ ఆందోళనల్లోనూ మీమ్స్, ట్రెండ్స్‌తో వినూత్న నిరసనలు తెలిపిన యువత
Mumbai Cop Vinod Kalukhe | త్రినేత్ర.న్యూస్ : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ దేశవ్యాప్తంగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆందోళనల్లో ఎన్నో సీరియస్ ఘటనలు చోటుచేసుకున్నా.. మధ్యలో కొన్ని సరదా క్షణాలు కూడా సోషల్ మీడియాను విపరీతంగా ఆకర్షించాయి. అందులో ముంబైకి చెందిన మహారాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్ వినోద్ కలుఖే (Vinod Kalukhe) రియాక్షన్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. జెన్ జెడ్ (Gen Z) అతడిని ముద్దుగా ఇంటర్నెట్ 'పూకీ' (Pookie) అంటూ ట్రెండ్ చేస్తోంది.
ఆ వీడియోలో ఏముందంటే..
ముంబైలోని ప్రసిద్ధ శివాజీ పార్క్ (Shivaji Park) వద్ద ఈ వైరల్ క్లిప్ రికార్డ్ అయ్యింది. కంటెంట్ క్రియేటర్ నిధి పవార్.. కానిస్టేబుల్ వినోద్ వద్దకు వెళ్లి, అతని గురించే వైరల్ అవుతున్న ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను (Reel) తన ఫోన్‌లో చూపించింది. అందులో తనను తాను చూసుకున్న ఆ పోలీసు అధికారి, ఆశ్చర్యంతో పాటు సిగ్గుతో చిరునవ్వులు చిందించాడు. అతను అలా బ్లష్ (Blush) అయిన విధానం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. కఠినంగా ఉండే ఖాకీ డ్రెస్‌లో ఇంత క్యూట్ రియాక్షనా అని మురిసిపోయిన నెటిజన్లు.. అతనికి 'పూకీ కాప్' (Pookie Cop) అనే బిరుదు ఇచ్చేశారు.
అసలు ఈ ట్రెండ్ ఎలా మొదలైంది?
నిధి పవార్ వీడియో కంటే కొద్ది రోజుల ముందే వినోద్ కలుఖే ఫేమస్ అయ్యాడు. ముంబైలో ఆందోళనలు జరుగుతున్నప్పుడు శ్రేయా చద్దా అనే మరో క్రియేటర్ ఈ కానిస్టేబుల్‌తో ఓ వీడియో తీసింది. "ఎవ్రీబడీ నోస్ దట్ ఐ యామ్ ఎ గుడ్ గర్ల్, ఆఫీసర్" అనే లనా డెల్ రే (Lana Del Rey) సాంగ్ ఆడియోను వాడుతూ సరదాగా రికార్డ్ చేసింది. ఆ వీడియో ఆన్‌లైన్‌లో విపరీతంగా వైరల్ కావడంతో కామెంట్స్ సెక్షన్ మొత్తం 'పూకీ' అంటూ ప్రశంసలతో నిండిపోయింది.
View this post on Instagram
ఆందోళనలకు జెన్ జెడ్ ఫ్లేవర్
ఆ తర్వాత ఈ ట్రెండ్ మరింత ఊపందుకుంది. చాలామంది యువ క్రియేటర్లు, నిరసనకారులు పోలీసులతో ఇలాగే వీడియోలు తీస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం ప్రారంభించారు. ఒక చిన్న ట్రెండ్‌గా మొదలై, ఏకంగా సీజేపీ ఆందోళనలకే ఒక బ్రాండ్‌గా మారిపోయింది.
ఒకవైపు ధర్నా, ప్రసంగాలు, ర్యాలీలతో వాతావరణం సీరియస్‌గా ఉన్నప్పటికీ.. జెన్ జెడ్ యువత తమదైన శైలిలో మీమ్స్ (Memes), ట్రెండింగ్ ఆడియోలు, షార్ట్ వీడియోలతో నిరసనలకు కొత్త ఫ్లేవర్ అద్దారు. ఈ మూమెంట్ చాలా పాలిటికల్‌గా ఉన్నప్పటికీ.. అందులో హ్యూమర్ పండిస్తూ ఆందోళనలను అందరికీ చేరువయ్యేలా చేశారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో శనివారం ఈ నిరసనలు ముగిసినప్పటికీ.. వినోద్ కలుఖే సిగ్గుపడిన ఆ క్యూట్ మూమెంట్ (Cute Moment) మాత్రం ఆన్‌లైన్‌లో ఇంకా చక్కర్లు కొడుతూనే ఉంది. యాక్టివిజం (Activism) తో పాటు హ్యూమర్‌ను ఎలా బ్యాలెన్స్ చేయవచ్చో ఈ తరం నిరూపించింది.
View this post on Instagram
తాజావార్తలు
- ●Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల
- ●Serial Actress | మోడ్రన్ లుక్‌లో గుండె నిండా గుడి గంటలు మీనా
- ●PM Modi Exam Reforms | ఎగ్జామ్ పేపర్ లీక్స్‌కు చెక్: రంగంలోకి నందన్ నిలేకని.. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ!
- ●Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ
- ●Rasha Thadani | అమ్మ స్టార్ హీరోయిన్ - నాన్న పెద్ద ప్రొడ్యూసర్ - శ్రీనివాస మంగాపురం హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
- ●Malayalam OTT | ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ - సీన్ సీన్‌కో మలుపు

Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల

Serial Actress | మోడ్రన్ లుక్‌లో గుండె నిండా గుడి గంటలు మీనా

PM Modi Exam Reforms | ఎగ్జామ్ పేపర్ లీక్స్‌కు చెక్: రంగంలోకి నందన్ నిలేకని.. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ!

Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ



