త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi Exam Reforms | ఎగ్జామ్ పేపర్ లీక్స్‌కు చెక్: రంగంలోకి నందన్ నిలేకని.. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ!

విద్యార్థుల భవిష్యత్తు కోసం మోదీ కీలక నిర్ణయం. ఎగ్జామ్స్ లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు నందన్ నిలేకని ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్. పూర్తి వివరాలు ఇవే!

J

National | Published On Jul 26, 2026, 7.34 pm IST

PM Modi Exam Reforms | ఎగ్జామ్ పేపర్ లీక్స్‌కు చెక్: రంగంలోకి నందన్ నిలేకని.. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ!

సంక్షిప్త సారాంశం

భారతదేశ పరీక్షా విధానాన్ని ప్రక్షాళన చేసేందుకు ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్‌ను ప్రకటించారు. ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నందన్ నిలేకని నేతృత్వంలో ఈ 'హై పవర్డ్ టాస్క్ ఫోర్స్' పని చేయనుంది. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, అత్యధికంగా టెక్నాలజీ వినియోగంపై ఈ కమిటీ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తుంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నిరసనల విరమణ జరిగిన మరుసటి రోజే మోదీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Advertisement

PM Modi Exam Reforms | త్రినేత్ర.న్యూస్ : దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణ, పేపర్ లీకేజీలపై వస్తున్న ఆందోళనల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారతదేశ ఎగ్జామినేషన్ సిస్టమ్‌ను (Examination System) పూర్తిగా సమీక్షించి, పారదర్శకంగా మార్చేందుకు ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నందన్ నిలేకని (Nandan Nilekani) నేతృత్వంలో ఒక 'హై పవర్డ్ టాస్క్ ఫోర్స్'ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రధాని మోదీ ఎక్స్‌ (X) వేదికగా పోస్ట్ చేసిన వీడియో సందేశంలో ఈ కీలక ప్రకటన చేశారు.

వారికి జైలు శిక్ష తప్పదు.. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు రెడీ

"విద్యార్థుల భవిష్యత్తు కోసం భారత ప్రభుత్వం నిరంతరం అనేక చర్యలు తీసుకుంటోంది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న వారు ఇప్పటికే జైళ్లలో మగ్గుతున్నారు. దీనికోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను (Fast-track courts) కూడా ఏర్పాటు చేశాం. రేపు పార్లమెంట్‌లో కఠినమైన న్యాయ నిబంధనలతో కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నాం" అని హిందీలో మాట్లాడిన వీడియోలో మోదీ స్పష్టం చేశారు. ఈ టాస్క్ ఫోర్స్ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే రాబోయే పరీక్షల విశ్వసనీయతను కాపాడేలా చర్యలు ఉంటాయన్నారు.

మరింత టెక్నాలజీ.. పూర్తి పారదర్శకత

"భవిష్యత్తు గురించి మనం గట్టిగా ఆలోచించాలి. మన పరీక్షా విధానంపై విద్యార్థులకు నమ్మకం కలగాలి, అది పూర్తిగా పారదర్శకంగా (Transparent) ఉండాలి. అలాగే ఈ విధానంలో గరిష్ట స్థాయిలో టెక్నాలజీ (Technology) వినియోగం జరగాలి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టెక్నాలజీ ఎక్స్‌పర్ట్ నందన్ నిలేకని ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశాం. ఇది ఎగ్జామినేషన్ రిఫార్మ్స్ (Examination reforms) పై పూర్తిగా ఫోకస్ చేస్తుంది" అని ప్రధానమంత్రి తన ప్రసంగంలో వివరించారు.

జాతీయ స్థాయి ఎగ్జామ్స్ లో అవకతవకలకు వ్యతిరేకంగా 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనల నడుమ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే ఆందోళనకారులు తమ నిరసనను విరమించిన మరుసటి రోజే.. ప్రధాని మోదీ ఈ టాస్క్ ఫోర్స్‌ను అనౌన్స్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement