పాకిస్థాన్ సెనేట్‌లోకి గాడిద ఎంట్రీ.. ఇంటర్నెట్‌లో నవ్వుల వెల్లువ : వీడియో
పాకిస్థాన్ సెనేట్‌లో లైవ్ సెషన్ మధ్యలో ఓ గాడిద అకస్మాత్తుగా సభలోకి ప్రవేశించడంతో కలకలం రేగింది. వీడియో వైరల్ అవుతుండగా భద్రతపై విమర్శలు, సోషల్ మీడియాలో సెటైర్లు, మీమ్స్ వెల్లువెత్తాయి. ఇంటర్నెట్ అంతా నవ్వుల్లో మునిగిపోయింది.
Viral news | Published On Dec 8, 2025, 9.15 pm IST
Donkey Storms Pakistan Senate During Live Session: Hilarious Viral Video Sparks Security Debate
––––––––––––––––––––––––––––
సంక్షిప్తంగా:
పాకిస్తాన్ పార్లమెంట్‌లో సమావేశాలు జరుగుతుండగానే అకస్మాత్తుగా హాల్లోకి గాడిద రావడంతో సభ్యుల భద్రతపై సందేహాలతో పాటు సోషల్ మీడియా అంతా నవ్వుల్లో మునిగిపోయింది. మీమ్స్, కామెంట్లతో నెటిజన్లు ఇంటర్నెట్ను హోరెత్తించారు. ఈమధ్యకాలంలో సోషల్‌మీడియాలో నవ్వులపువ్వులు పూయించిన సంఘటన ఇదే అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
––––––––––––––––––––––––––––
త్రినేత్ర, న్యూ ఢిల్లీ:
పాకిస్థాన్ రాజకీయాలు అంటే వివాదాలు సహజం. అయితే ఈసారి అక్కడి సెనేట్ సభలో ఏం జరిగిందో తెలిస్తే నమ్మలేరు. తర్వాత నవ్వకుండా ఉండలేరు… నమ్మశక్యం కాని సీన్. ఒక గాడిద నేరుగా సెనేట్ చాంబర్‌లోకి నడుచుకుంటూ వెళ్లి అల్లకల్లోలం చేసింది. కాసేపట్లోనే ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతూ ఇంటర్నెట్ అంతా నవ్వులతో మోగిపోయింది.
పాక్ సెనేట్‌లో షాకింగ్ సీన్ : సభలోకి 'గార్దభ' సభ్యుడి ప్రవేశం
వీడియోలో మంత్రులు, సభ్యులు గాడిదను చూసి ఒక్కసారిగా పక్కకు తప్పుకోవడం, కొందరు ఆశ్చర్యపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ గార్దభం బల్లల మీదెక్కి ఫైళ్లు చెల్లా చెదురు చేయడమే కాకుండా, భద్రతా సిబ్బంది అడ్డుకునే ప్రతీ ప్రయత్నాన్ని అస్సలు పట్టించుకోలేదు. నిదానంగా కొంతమంది ఎంపీలను ‘పలకరిస్తూ’ చాంబర్‌లోనే తిరిగింది. అయితే అది ఎప్పుడు బయటకెళ్లిందో తెలియదు. ‘సహచర’ సభ్యులతోనేనా? లేక ఒంటరిగానా అనేది ఆ వీడియోలో లేదు.
Watch : Watch: A donkey just stormed into Pakistan’s Parliament…
Opposition or ruling party?
Hard to tell 😂😂😂 pic.twitter.com/aUcAJT3Luj— Hinduism_and_Science (@Hinduism_sci) December 4, 2025
సెనేట్ భద్రతపై విమర్శలు – సోషల్ మీడియాలో వర్షం
ఈ ఘటనతో పాకిస్థాన్ పార్లమెంట్ భద్రతా వ్యవస్థపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షం కూడా దీనిని అవకాశంగా తీసుకుని ప్రభుత్వాన్ని తూర్పారబట్టింది. “ఇది ప్రభుత్వపాలనా స్థితిగతుల ప్రతీక” అని ఘాటుగా విమర్శించింది.
ఇక సోషల్ మీడియాలో అయితే నవ్వుల పండగే.
— ఒకరు, “పార్లమెంట్‌లో నిజంగా ఉపయోగకరమైన మెంబర్ దొరికాడు!” అని కామెంట్ చేశారు.
— మరొకరు, “ఇంతకీ అధికార పక్ష సభ్యుడా, విపక్ష సభ్యుడా!” అని హాస్యం విరజిమ్మాడు.
— ఇంకొకరు, “ఇది AI టెక్నాలజీ అనుకుంటా!” అని సరదాగా రాశారు.
— మరో యూజర్, “తన కుటుంబంలోకే అడుగుపెట్టాడు, అందులో తప్పేం ఉంది?” అంటూ సెటైర్ వేశారు.
కొంతమంది నెటిజన్లు ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్‌పై కూడా వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు—
“పార్లమెంట్‌లో ఎందుకు వచ్చావు ఆసిం మునీర్?” అని ఒకరు, సైన్యాధ్యక్షుడికి సెనేట్‌లో ఏం పని? అంటూ మరొకరు, చివరికి పాకిస్థాన్‌కు ఒక మంచి రాజకీయ నాయకుడు దొరికాడంటూ ఇంకొకరు మీమ్స్ షేర్ చేశారు.
ఈ ఘటన ఎలా జరిగిందో తెలుసుకునేందుకు అధికారులు CCTV ఫుటేజీని చెక్ చేస్తుండగా, ఇదే తొలిసారి కాదని తెలిసింది. 2023లో ఒక వీధికుక్క కూడా పార్లమెంట్‌లోకి చొరబడిన ఘటన అప్పట్లో పెద్ద దుమారం రేపిన విషయం గుర్తుచేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Viral Metro Challenge | ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ‘ఫోన్ స్టికింగ్’ మెట్రో ఛాలెంజ్.. ఈ వైరల్ వీడియోల వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
సెప్టెంబర్ 5, 2026

Nepal Floods | నేపాల్‌లో వరద బీభత్సం… వీడియోలు
ఆగస్టు 27, 2026

Bihar protests | ప్రధాని మోదీ రాజీనామా చేయాలనే పోస్టర్ పట్టుకున్నాడని.. పాట్నాలో ఆరేండ్ల బాలుడి అరెస్ట్..! వీడియో
ఆగస్టు 26, 2026
తాజావార్తలు
- ●కేంద్రం కొత్త జీడీపీ లెక్కలు.. 7.8% వృద్ధి వెనుక ₹6.05 లక్షల కోట్ల ట్విస్ట్!
- ●Bhagyashri Borse | రష్యా, ఉక్రెయిన్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో మలయాళం మూవీ - హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే
- ●Harish Rao Dubbaka Speech | కాంగ్రెస్ తెచ్చిన కరువే ఇది.. రైతుల ఉసురు పోసుకుంటున్న రేవంత్ రెడ్డి
- ●IPO | ఈ వారంలో 11 ఐపీవోలు.. రూ.7వేల కోట్లకు ఇష్యూలు..
- ●Uniforms | డెంగీ భయం.. బాలికలు స్కర్ట్స్ ధరించొద్దన్న మంత్రి
- ●AstraZeneca | ఆస్ట్రాజెనెకా భారీ విజయం.. కొత్త బ్రెస్ట్ క్యాన్సర్ ఔషధానికి యూఎస్ఎఫ్డీఏ అనుమతి..

కేంద్రం కొత్త జీడీపీ లెక్కలు.. 7.8% వృద్ధి వెనుక ₹6.05 లక్షల కోట్ల ట్విస్ట్!

Bhagyashri Borse | రష్యా, ఉక్రెయిన్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో మలయాళం మూవీ - హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే

Harish Rao Dubbaka Speech | కాంగ్రెస్ తెచ్చిన కరువే ఇది.. రైతుల ఉసురు పోసుకుంటున్న రేవంత్ రెడ్డి

IPO | ఈ వారంలో 11 ఐపీవోలు.. రూ.7వేల కోట్లకు ఇష్యూలు..



