త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cold Waves | చలితో వ‌ణుకుతున్న తెలంగాణ‌

Cold Waves | తెలంగాణ (Telangana) రాష్ట్రం చ‌లిగాలుల (Cold Waves)కు వ‌ణికిపోతోంది. రోజు రోజుకూ చ‌లి తీవ్రత పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో చ‌లి, పొగ‌మంచు ప్ర‌భావం కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే రెండు, మూడు రోజులు మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని వాతావ‌ర‌ణ శాఖ (Meteorological Department) హెచ్చ‌రించింది (Warning).

A

Telangana | Published On Dec 31, 2025, 1.09 pm IST

Cold Waves | చలితో వ‌ణుకుతున్న తెలంగాణ‌
Advertisement

Cold Waves | తెలంగాణ (Telangana) రాష్ట్రం చ‌లిగాలుల (Cold Waves)కు వ‌ణికిపోతోంది. రోజు రోజుకూ చ‌లి తీవ్రత పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో చ‌లి, పొగ‌మంచు ప్ర‌భావం కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే రెండు, మూడు రోజులు మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని వాతావ‌ర‌ణ శాఖ (Meteorological Department) హెచ్చ‌రించింది (Warning). రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో క‌నిష్ట ఉష్ణోగ్ర‌త‌లు (Lowest Temperatures) సాధార‌ణం కంటే 2-3 డిగ్రీలు త‌క్కువ‌గా న‌మోద‌య్యే అవ‌కాశం ఉంటుంద‌ని పేర్కొంది.

ప‌డిపోతున్న క‌నిష్ట ఉష్ణోగ్ర‌త‌లు

రాష్ట్రంలో రోజురోజుకూ క‌నిష్ట ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోతూనే ఉన్నాయి. రాష్ట్ర‌వ్యాప్తంగా 10 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయంటే ప‌రిస్థితిని అంచ‌నా వేయ‌వ‌చ్చు. చాలా ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 6 నుంచి 12 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఆయా జిల్లాల్లో వ‌చ్చే మూడు రోజులు చలి తీవ్ర‌త మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని స్ప‌ష్టం చేసింది. రాష్ట్ర‌వ్యాప్తంగా సాధార‌ణ క‌నిష్ట ఉష్ణోగ్ర‌త‌లు నాలుగు నుంచి ఆరు డిగ్రీల వ‌ర‌కు త‌గ్గాయ‌ని పేర్కొంది.

అత్య‌ల్పంగా 5.6 డిగ్రీలు

రాష్ట్రంలో అత్య‌ల్ప ఉష్ణోగ్ర‌త కుమ్ర‌మ్ భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండ‌లం గిన్నెధ‌రిలో 5.6 డిగ్రీలుగా న‌మోదైంది. అదే జిల్లా సిర్పూర్‌లో 6.7 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 6.8 డిగ్రీలు, హైద‌రాబాద్‌లోని శేరిలింగంప‌ల్లిలో 8.8 డిగ్రీల క‌నిష్ట ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement