Foul Smell Chicken | కుళ్లిన చికెన్ డెలివరీ చేశారని కస్టమర్ రచ్చ.. వీడియో వైరల్
బ్రో.. ఎందుకు అంత కష్టం. తిన్నగా చికెన్ షాపునకు వెళ్లి అప్పుడే కోసిన కోడి నుంచి ఫ్రెష్ చికెన్ తెచ్చుకుంటే అయిపోతుండె కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు. అన్ని వస్తువుల కోసం ఆన్‌లైన్ యాప్స్‌ని నమ్ముకోవద్దు గురూ.
Viral news | Published On Dec 29, 2025, 5.45 pm IST
Foul Smell Chicken | ఈరోజుల్లో అంతా ఆన్‌లైన్ డెలివరీలే. ఇంట్లోనే కూర్చొని కావాల్సినవన్నీ జనాలు ఆర్డర్ చేసుకుంటున్నారు. 10 నిమిషాల్లో డెలివరీ చేస్తుండటంతో బయటికి షాపునకు వెళ్లి వచ్చే టైమ్ కన్నా తక్కువ టైమ్‌లో ఇంటి వద్దకే సరుకులు వస్తుండటంతో ఆన్‌లైన్ ఆర్డర్ యాప్స్ మీదనే ఆధారపడుతున్నారు. వాళ్లు డెలివరీ చేసే వస్తువుల నాణ్యతను మాత్రం చాలామంది కస్టమర్లు పట్టించుకోవడం లేదు. తాజాగా ఓ కస్టమర్ ఇలాగే ఆన్‌లైన్ యాప్ నుంచి చికెన్ ఆర్డర్ చేశాడు. చికెన్ డెలివరీ అయ్యాక దాన్ని మంచిగా మసాలా దట్టించి వండాడు. తీరా తిందామని చూస్తే ఆ చికెన్ కుళ్లిన వాసన వస్తోంది. అన్ని ముక్కలు అలాగే పాచిపోయిన వాసన వస్తుండటంతో ఎంతో ఇష్టంగా వండుకున్న చికెన్ మొత్తాన్ని డస్ట్‌బిన్‌లో పడేశాడు. చికెన్‌తో వచ్చిన కవర్‌ని గమనిస్తే దాని మీద ఎక్స్‌పైరీ డేట్ అయిపోయి ఉండటంతో కస్టమర్ ఖంగుతిన్నాడు.
కంజ్యూమర్ కోర్టుకి వెళ్తా
వండిన చికెన్‌ను డస్ట్ బిన్‌లో పడేసి చికెన్ కవర్ మీద ఉన్న ఎక్స్‌పైరీ డేట్ అన్నింటిని కలిపి వీడియో తీసి వాటిని యాప్‌కి పంపించి రిపోర్ట్ చేశాడు. దీంతో రిఫండ్ ఇస్తామని యాప్ నిర్వాహకులు వెల్లడించినప్పటికీ.. ఒకవేళ ఆ చికెన్‌ని పొరపాటున తిని ఉంటే ఫుడ్ పాయిజన్ అయితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? దాన్ని వండటం కోసం ఎంత టైమ్ వేస్ట్ అయింది. ఎన్ని ఇన్‌గ్రేడియెంట్స్ వేస్ట్ అయ్యాయి.. అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. ఇలా కాదు కానీ.. తాను దీనిపై కంజ్యూమర్ కోర్టుకి వెళ్తా అని అక్కడే ఫిర్యాదు చేస్తా అని చెప్పుకొచ్చాడు. కాకపోతే తనకు లీగల్‌గా ఈ విషయాలు తెలియవని.. ఎవరైనా నెటిజన్లు దీని గురించి వివరాలు చెప్తే తాను కోర్టులో ఆ యాప్‌పై కేసు ఫైల్ చేస్తా అని మరో వీడియోలో ఆ కస్టమర్ చెప్పుకొచ్చాడు. ఆ కస్టమర్ చికెన్ బాధలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందించారు.
బ్రో.. ఎందుకు అంత కష్టం. తిన్నగా చికెన్ షాపునకు వెళ్లి అప్పుడే కోసిన కోడి నుంచి ఫ్రెష్ చికెన్ తెచ్చుకుంటే అయిపోతుండె కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు. అన్ని వస్తువుల కోసం ఆన్‌లైన్ యాప్స్‌ని నమ్ముకోవద్దు గురూ.. అంటూ కొందరు సలహాలు ఇచ్చారు. మరికొందరు మాత్రం మంచి పనిచేశావు. ఇలాంటి విషయాలను అందరితో పంచుకుంటేనే మరోసారి ఎవ్వరైనా ఇలాంటివి ఆర్డర్ చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారని మెచ్చుకున్నారు.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
సంబంధిత వార్తలు

Thirsty Monkey Viral Video | నీళ్ల కోసం నడిరోడ్డు మీద నిలబడి బస్సును ఆపిన కోతి.. గుండెను పిండేసే ఘటన : వీడియో వైరల్
మే 21, 2026

Mohali child kidnapping | దారుణం: తాతయ్య కళ్లెదుటే 4 ఏళ్ల చిన్నారి కిడ్నాప్.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
మే 20, 2026

Rakul Preet Singh | సినిమా ప్రమోషన్స్ తెచ్చిన తంటాలు – వివాదంలో చిక్కుకున్న రకుల్…
మే 11, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



