త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Best Investment | అప్పట్లో 60 వేలు పెట్టుబడి పెడితే.. ఇప్పుడు నెలకు 14.5 లక్షలు.. ఎలా సాధ్యమైందంటే?

అదంతా ఓకే కానీ.. ఇంతకీ మీ అంకుల్ 25 కోట్లు మొత్తం ఎఫ్‌డీలో పెట్టారా? వడ్డీ పర్సెంటేజ్ ఎంత ఇస్తున్నారు. టీడీఎస్ టాక్సులు గట్రా ఏమైనా ఉన్నాయా? అంటూ నెటిజన్లు తమ సందేహాలను వెలిబుచ్చుతున్నారు.

J

Viral news | Published On Mar 14, 2026, 4.23 pm IST

Best Investment | అప్పట్లో 60 వేలు పెట్టుబడి పెడితే.. ఇప్పుడు నెలకు 14.5 లక్షలు.. ఎలా సాధ్యమైందంటే?
Advertisement

Best Investment | చాలామంది డబ్బులు సంపాదిస్తారు కానీ.. వాటిని ఎలా పొదుపు చేయాలో తెలియదు. లక్షలు సంపాదించడం కాదు.. లక్షలు పొదుపు చేసినోడి దగ్గరే డబ్బు ఉంటుంది అనేది జగమెరిగిన సత్యం. కానీ.. చాలామందికి అసలు డబ్బును ఎలా పొదుపు చేయాలి.. ఆ డబ్బే మనకు ఇంకా డబ్బును సంపాదించేలా ఏం చేయాలి? ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? అనేది తెలియదు. మా.. అంటే బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం, ఆర్‌డీ, మ్యూచువల్ ఫండ్స్ తప్పితే పెద్దగా ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి చాలామందికి తెలియదు. కానీ.. ఈ వ్యక్తి ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ తెలిస్తే మాత్రం సలాం కొట్టాల్సిందే. ఇది కదా బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఐడియా అంటే అంటూ ఆయన్ను మెచ్చుకోకుండా ఉండలేం.

1990 లో 60 వేలతో నాలుగు ఎకరాలు కొని

స్టాక్ మార్కెట్ ట్రేడర్ అయిన స్వప్నిల్ కొమ్మవార్ తన అంకుల్ ఇన్వెస్ట్‌మెంట్ గురించి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు. 1990లో ఆయన ఎకరానికి రూ.15 వేలు పెట్టి నాలుగు ఎకరాలు కొన్నాడట. దానికి 60 వేలు అయింది. కొన్నేళ్లలోనే తను కొన్న ప్లేస్ అభివృద్ధి చెందింది. టౌన్ కాస్త జిల్లా అయింది. దీంతో అతడికి ఉన్న నాలుగు ఎకరాల్లో రెండు ఎకరాలను డీమార్ట్ కొనుక్కుంది. 25 కోట్లు ఇచ్చి మరీ డీమార్ట్ ఆ స్థలాన్ని కొనుక్కుంది. ఆ 25 కోట్లలో రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా తీసుకెళ్లి బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశాడట. దీంతో ఎఫ్‌డీ నుంచి నెలకు ఆ వ్యక్తి 14.5 లక్షలు కేవలం వడ్డీగానే వస్తున్నాయి. అసలు 25 లక్షలు అలాగే బ్యాంకులో ఉన్నాయి. నెలకు వచ్చే ఈ వడ్డీ అదనం. కొన్ని సార్లు సంపద అనేది దశాబ్దాల కింద పెట్టిన చిన్న, సరైన పెట్టుబడి నుంచే వస్తుంది అంటూ ఆ స్వప్నిల్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

60 వేల నుంచి 25 కోట్ల వరకు జర్నీ అదుర్స్ అంటున్న నెటిజన్లు

ఎక్స్‌లో పెట్టిన ఆ ట్వీట్ కాస్త క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ పోస్టుపై రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. 60 వేలు పెట్టుబడి పెడితే 25 కోట్లా వావ్.. కానీ ఇది అందరికీ కలిసిరాదు. ఏరియాను బట్టి వాల్యూను బట్టి లక్ మారుతుంది అంటూ కొందరు కామెంట్లు చేయగా, సహనం అనేది ముఖ్యం. అన్ని సంవత్సరాల నుంచి ఓపికతో ఆ లాండ్‌ని అమ్మకుండా ఉంచడం అనేది గ్రేట్. సహనానికి దక్కిన లాభం ఇది అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

అదంతా ఓకే కానీ.. ఇంతకీ మీ అంకుల్ 25 కోట్లు మొత్తం ఎఫ్‌డీలో పెట్టారా? వడ్డీ పర్సెంటేజ్ ఎంత ఇస్తున్నారు. టీడీఎస్ టాక్సులు గట్రా ఏమైనా ఉన్నాయా? అంటూ నెటిజన్లు తమ సందేహాలను వెలిబుచ్చుతున్నారు.

https://x.com/KommawarSwapnil/status/2032051476541878354

 

Advertisement
Advertisement