త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fact Check Elephant Saving Tiger | వరదల్లో పులిని కాపాడిన ఏనుగు : మూగ జీవాలకూ భావోద్వేగాలు.. కానీ అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే!

ఇండోనేషియా వరదల్లో కొట్టుకుపోతున్న పులిని ఓ ఏనుగు కాపాడిందంటూ ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే, ఈ ఎమోషనల్ వీడియో వెనుక ఉన్న అసలు నిజం ఇదే!

J

Viral news | Published On Jul 9, 2026, 11.55 pm IST

Fact Check Elephant Saving Tiger | వరదల్లో పులిని కాపాడిన ఏనుగు : మూగ జీవాలకూ భావోద్వేగాలు.. కానీ అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే!
Advertisement
  • సుమత్రా వరదల్లో చిక్కుకున్న పులిని ఓ ఏనుగు కాపాడినట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ 
  • ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థలు ఈ వీడియోను పరిశీలించి, ఇది కృత్రిమ మేధ (AI) తో సృష్టించిన ఫేక్ వీడియోగా నిర్ధారణ
  • వాస్తవానికి అడవిలో ఏనుగులు, పులులు మిత్రులు కావు. పైగా పులుల వల్ల ఏనుగు పిల్లలకు ఎప్పుడూ ప్రమాదమే
  • ఈ వీడియో ఏఐ (AI) అని తెలియడంతో, నెటిజన్లు దీన్ని గుడ్డిగా నమ్మిన వారిపై మీమ్స్, సెటైర్లు

Fact Check Elephant Saving Tiger | త్రినేత్ర.న్యూస్ : ఆపదలో ఉన్నప్పుడు సాయం చేయాలనే భావోద్వేగాలు మనుషులకే కాదు, మూగ జీవాలకు కూడా ఉంటాయని నమ్మించేలా ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇండోనేషియా (Indonesia) లోని సుమత్రా దీవుల్లో ఆకస్మికంగా వచ్చిన వరదల్లో కొట్టుకుపోతున్న ఓ పులిని.. సాటి జంతువైన సుమత్రన్ ఏనుగు (Sumatran elephant) కాపాడిందన్నది ఆ వీడియో సారాంశం. అయితే, ఈ అద్భుత దృశ్యం వెనుక ఉన్న వాస్తవం తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఫ్యాక్ట్ చెకింగ్ (Fact-checking) సంస్థలు ఈ వీడియో గుట్టు రట్టు చేశాయి.

సోషల్ మీడియాలో వైరల్ క్లెయిమ్

'కాక్రోచ్ జనతా పార్టీ' తన ఎక్స్ (X) సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో.. వేగంగా ప్రవహిస్తున్న వరద నీటిలో ఓ పులి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడటం, దాన్ని ఓ ఏనుగు తన ప్రాణాలకు తెగించి రక్షించడం కనిపిస్తుంది. ఇది చూసిన చాలామంది మనుషుల్లాగే జంతువుల్లోనూ భావోద్వేగాలు (Emotions) ఉంటాయని ఎమోషనల్ అవుతూ వీడియోను విపరీతంగా షేర్ చేశారు.

కానీ, అసలు నిజం ఏంటంటే..

ఇదంతా కృత్రిమ మేధ (AI) చేసిన మాయాజాలం. ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థలు డీప్ అనాలసిస్ చేసి ఇది కంప్లీట్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) తో క్రియేట్ చేసిన ఫేక్ వీడియో (Fake video) అని తేల్చాయి. వీడియోను డిటెక్షన్ టూల్స్‌తో పరిశీలించగా అది వంద శాతం ఏఐ జనరేటెడ్ (AI-Generated) అని ఆధారాలతో సహా బయటపడింది.

లాజిక్ మిస్సయిన నెటిజన్లు

జంతువుల సహజ స్వభావం ప్రకారం చూసుకున్నా.. అడవిలో ఏనుగులు, పులులు ఎప్పటికీ మిత్రులు కాలేవు. వరదల్లాంటి విపత్కర పరిస్థితుల్లో ఏనుగులు అడవి పులులను కాపాడే సాహసం అస్సలు చేయవు. నిజానికి పులుల వల్ల ఏనుగు పిల్లల (Elephant calves) కు ఎప్పుడూ ప్రాణహాని ఉంటుంది.

ఇక ఈ ఫేక్ వీడియో అసలు బండారం బయటపడటంతో నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. కనీసం ఒరిజినల్ వీడియోకు, ఏఐ (AI) వీడియోకు తేడా గమనించకుండా గుడ్డిగా నమ్మేస్తున్న వారిని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. "ఈ వీడియో తీసిన కెమెరామెన్‌కు సెల్యూట్.. ఆ వరద నీటి మధ్యలో నిలబడి ప్రాణాలకు తెగించి మరీ వీడియో తీశాడు" అంటూ సెటైరికల్ కామెంట్స్ పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఏది పడితే అది నమ్మేముందు కాస్త ఫాక్ట్ చెక్ చేసుకోవడం ఎంత ముఖ్యమో ఈ ఘటనే పెద్ద ఉదాహరణ.

Advertisement

తాజావార్తలు

Advertisement