e-PAN కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలని ఈ-మెయిల్ వచ్చిందా..? అయితే జాగ్రత్త..!
e-PAN | ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్-చెక్ విభాగం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న ఓ ఫేక్ ఈ-మెయిల్‌పై ప్రజలను హెచ్చరించింది. ఆ ఈ-మెయిల్‌లో వినియోగదారులు తమ e-PAN కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఉందని అధికారులు తెలిపారు. అయితే ఆ సందేశం పూర్తిగా ఫేక్ అని స్పష్టం చేశారు.
Technology | Published On Mar 14, 2026, 5.12 pm IST
e-PAN | ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్-చెక్ విభాగం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న ఓ ఫేక్ ఈ-మెయిల్‌పై ప్రజలను హెచ్చరించింది. ఆ ఈ-మెయిల్‌లో వినియోగదారులు తమ e-PAN కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఉందని అధికారులు తెలిపారు. అయితే ఆ సందేశం పూర్తిగా ఫేక్ అని స్పష్టం చేశారు. ఇటువంటి ఈ-మెయిళ్లకు స్పందించకూడదని, అందులో ఇచ్చిన లింకులను క్లిక్ చేయకూడదని ప్రజలకు సూచించారు. ప్రభుత్వ ఫ్యాక్ట్-చెక్ విభాగం ఎక్స్ లో చేసిన పోస్టులో ఆ ఈ-మెయిల్ మోసపూరితమైనదని పేర్కొంది. అనుమానాస్పద ఈ-మెయిళ్లు, ఫోన్ కాల్స్ లేదా SMSల ద్వారా వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని వినియోగదారులను హెచ్చరించింది.
అలాంటి వాటికి స్పందించవద్దు..
మీకు కూడా e-PAN కార్డ్‌ను డౌన్‌లోడ్ చేయాలని కోరుతూ ఈ-మెయిల్ వచ్చిందా? ఆ ఈ-మెయిల్ Fake. ఆర్థిక లేదా సున్నితమైన సమాచారాన్ని పంపాలని కోరే ఈ-మెయిళ్లు, లింకులు, కాల్స్, SMSలకు స్పందించవద్దు.. అని పోస్టులో పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లు తరచూ ఇటువంటి ఫేక్ ఈ-మెయిళ్లను పంపిస్తారని సూచనలో పేర్కొన్నారు. సాధారణంగా అలాంటి ఈ-మెయిళ్లలో ఒక లింక్ ఇస్తారు. ఆ లింక్ ద్వారా e-PAN కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరుతారు. అది నిజమైనదిగా కనిపించేలా ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే ఈ సందేశాలు అధికారిక సంస్థల నుంచి పంపినవి కావని స్పష్టం చేశారు. ఇవి పెద్ద ఎత్తున జరిగే ఫిషింగ్ ప్రయత్నాలలో భాగమని అన్నారు. వినియోగదారుల నుంచి రహస్య సమాచారాన్ని సేకరించడమే నేరగాళ్ల లక్ష్యమని తెలిపారు.
వ్యక్తిగత లేదా ఆర్థిక వివరాలను ఎవరూ కోరరు..
ఈ నేపథ్యంలో ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం ఫిషింగ్ ఈ-మెయిళ్లను ఎలా రిపోర్టు చేయాలో వివరించే లింకును కూడా ఆ ఎక్స్ పోస్టులో అందించింది. ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం ఫిషింగ్, ఫేక్ ఈ-మెయిళ్ల గురించి ప్రజలను పలుమార్లు హెచ్చరించింది. ఈ-మెయిల్ ద్వారా వ్యక్తిగత వివరాలను కోరమని లేదా మీ PIN నంబర్లు, పాస్‌వర్డ్‌లు లేదా క్రెడిట్ కార్డ్, బ్యాంక్ ఖాతాలు వంటి ఆర్థిక ఖాతాలకు సంబంధించిన యాక్సెస్ సమాచారాన్ని పంపమని ఎప్పుడూ కోరదు.. అని ఆ విభాగం తెలిపింది. ఇన్‌కమ్ ట్యాక్స్ శాఖకు చెందిన అధికారి అని చెప్పుకుంటూ ఎవరైనా ఈ-మెయిల్ పంపినా లేదా ఇన్‌కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌కు వెళ్లాలని సూచించినా కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఈ జాగ్రత్తలు పాటించాలి..
మొదటగా, ఆ ఈ-మెయిల్‌కు ఎలాంటి సమాధానం పంపకూడదు. రెండవది, ఈ-మెయిల్‌లో ఉన్న అటాచ్‌మెంట్‌లను తెరవకూడదు. ఎందుకంటే వాటిలో మీ స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్‌ను దెబ్బతీసే కోడ్ లేదా మాల్‌వేర్ లేదా వైరస్ ఉండే అవకాశం ఉంది. మూడవది, ఈ-మెయిల్‌లో ఇచ్చిన లింకులను క్లిక్ చేయకూడదు. ఒకవేళ క్లిక్ చేసినా బ్యాంక్ ఖాతా లేదా క్రెడిట్ కార్డ్ వివరాలు వంటి గోప్య సమాచారాన్ని నమోదు చేయకూడదు. నాలుగవది, ఆ సందేశంలో ఉన్న లింకును కట్ చేసి బ్రౌజర్‌లో పేస్ట్ చేయకూడదు. ఐదవది, యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్, యాంటీ స్పైవేర్, ఫైర్‌వాల్‌ను ఉపయోగించాలి. అవి ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్ అయి ఉండాలి. ఎందుకంటే కొన్ని ఫిషింగ్ ఈ-మెయిళ్లలో కంప్యూటర్‌కు లేదా ఫోన్‌కు హానికరమైన లేదా ఇంటర్నెట్‌లో మీ కార్యకలాపాలను గమనించే సాఫ్ట్‌వేర్ ఉండే అవకాశాలు ఉంటాయి.
దీనికి ఫార్వర్డ్ చేయండి..
మీకు మోసపూరిత ఈ-మెయిల్ వచ్చినట్లయితే దానిని webmanager@incometax.gov.in అనే ఈ-మెయిల్ కు ఫార్వర్డ్ చేయాలని సూచించారు. అదే ఇమెయిల్ ప్రతిని incident@cert-in.org.in కు కూడా పంపవచ్చని తెలిపారు. అదనంగా, ఆ ఈ-మెయిల్‌కు సంబంధించిన ఇంటర్నెట్ హెడ్డర్‌ను కూడా పంపాలని సూచించారు. ఎందుకంటే అందులో అదనపు సమాచారం ఉంటుందని, దాంతో పంపిన వ్యక్తిని గుర్తించవచ్చని తెలిపారు. ఈ-మెయిల్ లేదా హెడ్డర్‌ను పంపిన తర్వాత ఆ సందేశాన్ని పూర్తిగా తొలగించాలని అధికారులు సూచించారు.
సంబంధిత వార్తలు

Fact Check Elephant Saving Tiger | వరదల్లో పులిని కాపాడిన ఏనుగు : మూగ జీవాలకూ భావోద్వేగాలు.. కానీ అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే!
జులై 9, 2026

Instagram | మెటాకు కేంద్రం నోటీసులు.. ఇన్‌స్టా యాడ్స్‌పై వివరణ కోరిన ఐటీశాఖ..!
జులై 3, 2026

SIM Swapping | సిమ్ స్వాపింగ్ మోసాలతో జాగ్రత్త.. నిర్లక్ష్యం చేస్తే బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయి..
జూన్ 23, 2026
తాజావార్తలు
- ●Fact Check Elephant Saving Tiger | వరదల్లో పులిని కాపాడిన ఏనుగు : మూగ జీవాలకూ భావోద్వేగాలు.. కానీ అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే!
- ●BSNL | సరికొత్త శాటిలైట్ లాంచ్ చేసిన బీఎస్ఎన్ఎల్.. రూ.1.34లక్షల ఫోన్ ఎవరి కోసం.. ప్రత్యేకతలు ఏంటంటే..?
- ●Minister Ponnam | సమస్యల పరిష్కారం కోసం కొండా సురేఖను కలిసిన మంత్రి పొన్నం..
- ●The Furious Review | ది ఫ్యూరియస్ రివ్యూ - లోకేష్ కనగరాజ్ ఖైదీతో కంపేరిజన్స్ - యాక్షన్ లవర్స్ మిస్సవ్వొద్దు
- ●Medigadda Barrage | మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల.. ఆ మూడు లిఫ్టులు వాడితేనే సేఫ్ : రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం కీలక సలహా
- ●JP Nadda | దేశానికే ఆదర్శంగా బీబీనగర్ ఎయిమ్స్ : కేంద్రమంత్రి జేపీ నడ్డా

Fact Check Elephant Saving Tiger | వరదల్లో పులిని కాపాడిన ఏనుగు : మూగ జీవాలకూ భావోద్వేగాలు.. కానీ అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే!

BSNL | సరికొత్త శాటిలైట్ లాంచ్ చేసిన బీఎస్ఎన్ఎల్.. రూ.1.34లక్షల ఫోన్ ఎవరి కోసం.. ప్రత్యేకతలు ఏంటంటే..?

Minister Ponnam | సమస్యల పరిష్కారం కోసం కొండా సురేఖను కలిసిన మంత్రి పొన్నం..

The Furious Review | ది ఫ్యూరియస్ రివ్యూ - లోకేష్ కనగరాజ్ ఖైదీతో కంపేరిజన్స్ - యాక్షన్ లవర్స్ మిస్సవ్వొద్దు



