RBI | పాత నోట్లను మార్చుకునేందుకు ఆర్‌బీఐ మళ్లీ అవకాశం ఇచ్చిందా..?
RBI | గతంలో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్లను మార్చుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టిందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న వార్తలను నమ్మవద్దని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) తన ఫ్యాక్ట్ చెక్ విభాగం ద్వారా తెలియజేసింది.
RBI | గతంలో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్లను మార్చుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టిందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న వార్తలను నమ్మవద్దని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) తన ఫ్యాక్ట్ చెక్ విభాగం ద్వారా తెలియజేసింది. 2016 నవంబర్ నెలలో అప్పటి కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ నోట్లను మార్చుకునేందుకు ఆర్‌బీఐ గడువు ఇచ్చింది. అప్పట్లో రూ.2000 నోట్లను కూడా ప్రవేశపెట్టారు. అయితే ప్రస్తుతం పాత నోట్లను మార్చుకునేందుకు ఆర్‌బీఐ మళ్లీ కొత్త నియమాలను ప్రవేశపెట్టిందని ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది. ఆర్‌బీఐ అలాంటి ఏ నియమాన్ని కూడా ప్రవేశపెట్టలేదని, సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మవద్దని, ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ లేదా ఆర్‌బీఐ సోషల్ మీడియా ఖాతాల ద్వారా సమాచారాన్ని ధ్రువీకరించుకోవాలని సూచించింది.
https://twitter.com/PIBFactCheck/status/2045112707939267051
తప్పుడు సమాచారంపై ఫిర్యాదు చేయవచ్చు..
ఆర్‌బీఐ ఎలాంటి నియమాలను ప్రవేశపెట్టలేదని తెలియజేస్తూ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టింది. సదరు ఫేక్ వార్తలకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను కూడా అందులో షేర్ చేసింది. అలాంటి సమాచారాన్ని అధికారిక వేదికల ద్వారా తెలుసుకోవాలని, సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి వార్తలను నమ్మొద్దని కోరింది. ఏదైనా అలాంటి సమాచారం కనిపిస్తే తమకు తెలియజేయాలని సూచించింది. సామాజిక మాధ్యమాల్లో అనుమానాస్పదంగా కనిపించే సందేశాలు, ఫొటోలు, వీడియోలను ప్రజలు తమ దృష్టికి తీసుకురావచ్చని తెలిపింది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగానికి ఆ వివరాలను వాట్సప్ ఫోన్ నంబర్ 8799711259 లేదా factcheck@pib.gov.in అనే ఈ-మెయిల్‌కు పంపవచ్చని సూచించింది.
సంబంధిత వార్తలు

Fact Check Elephant Saving Tiger | వరదల్లో పులిని కాపాడిన ఏనుగు : మూగ జీవాలకూ భావోద్వేగాలు.. కానీ అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే!
జులై 9, 2026

Apple | మళ్లీ కార్డ్ పేమెంట్స్.. యాపిల్ యూజర్లకు గుడ్ న్యూస్..
జులై 6, 2026

RBI | క్లెయిమ్ చేయని నగదును బ్యాంకుల నుంచి ఎప్పుడైనా పొందవచ్చు.. స్పష్టత ఇచ్చిన ఆర్‌బీఐ..
జులై 2, 2026
తాజావార్తలు
- ●Fact Check Elephant Saving Tiger | వరదల్లో పులిని కాపాడిన ఏనుగు : మూగ జీవాలకూ భావోద్వేగాలు.. కానీ అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే!
- ●BSNL | సరికొత్త శాటిలైట్ లాంచ్ చేసిన బీఎస్ఎన్ఎల్.. రూ.1.34లక్షల ఫోన్ ఎవరి కోసం.. ప్రత్యేకతలు ఏంటంటే..?
- ●Minister Ponnam | సమస్యల పరిష్కారం కోసం కొండా సురేఖను కలిసిన మంత్రి పొన్నం..
- ●The Furious Review | ది ఫ్యూరియస్ రివ్యూ - లోకేష్ కనగరాజ్ ఖైదీతో కంపేరిజన్స్ - యాక్షన్ లవర్స్ మిస్సవ్వొద్దు
- ●Medigadda Barrage | మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల.. ఆ మూడు లిఫ్టులు వాడితేనే సేఫ్ : రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం కీలక సలహా
- ●JP Nadda | దేశానికే ఆదర్శంగా బీబీనగర్ ఎయిమ్స్ : కేంద్రమంత్రి జేపీ నడ్డా

Fact Check Elephant Saving Tiger | వరదల్లో పులిని కాపాడిన ఏనుగు : మూగ జీవాలకూ భావోద్వేగాలు.. కానీ అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే!

BSNL | సరికొత్త శాటిలైట్ లాంచ్ చేసిన బీఎస్ఎన్ఎల్.. రూ.1.34లక్షల ఫోన్ ఎవరి కోసం.. ప్రత్యేకతలు ఏంటంటే..?

Minister Ponnam | సమస్యల పరిష్కారం కోసం కొండా సురేఖను కలిసిన మంత్రి పొన్నం..

The Furious Review | ది ఫ్యూరియస్ రివ్యూ - లోకేష్ కనగరాజ్ ఖైదీతో కంపేరిజన్స్ - యాక్షన్ లవర్స్ మిస్సవ్వొద్దు



