త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Lionel Messi Wine and Sprite Drink | వైన్‌లో స్ప్రైట్ కలుపుకొని తాగిన మెస్సీ.. సర్రున ఎగబాకిన కోకకోలా స్టాక్స్

జనవరి 7న మెస్సీ తన అసాధారణ డ్రింక్ గురించి చెప్పగా, ఆ తర్వాత మూడు రోజుల్లోనే కోకకోలా స్టాక్స్ 5 శాతం పెరిగాయి. మూడు రోజుల్లో కోకకోలా కంపెనీ స్టాక్స్ మార్కెట్ వాల్యూ 13 బిలియన్ డాలర్లు పెరిగింది.

J

Viral news | Published On Jan 12, 2026, 6.48 pm IST

Lionel Messi Wine and Sprite Drink | వైన్‌లో స్ప్రైట్ కలుపుకొని తాగిన మెస్సీ.. సర్రున ఎగబాకిన కోకకోలా స్టాక్స్
Advertisement

Lionel Messi Wine and Sprite Drink | త్రినేత్ర.న్యూస్ : సెలబ్రిటీలు ఏం చేసినా సెన్సేషనే. వాళ్లు వేసుకునే డ్రెస్సుల దగ్గర్నుంచి, వాళ్లు తిరిగే కార్లు, తినే ఫుడ్, తాగే డ్రింక్స్ అన్నింటిపైనా ఫోకస్ ఉంటుంది. సెలబ్రిటీలు ఏం చేస్తే అదే చేయడానికి చాలామంది ఫ్యాన్స్ ఉత్సాహం చూపిస్తుంటారు. తాజాగా అర్జెంటినా ఫుట్‌బాల్ దిగ్గజం లియొనెల్ మెస్సీ యూఎస్ స్టాక్ మార్కెట్‌ని షేక్ చేశాడు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన అసాధారణమైన డ్రింకింగ్ అలవాటును మెస్సీ షేర్ చేసుకున్నాడు. తనకు వైన్‌ను డైరెక్ట్‌గా తాగడం కంటే స్ప్రైట్ కలుపుకొని తాగడం ఇష్టం అని చెప్పాడు. అంతే.. మనోడి అసాధారణ అలవాటు స్ప్రైట్ పేరెంట్ కంపెనీ కోకకోలాకి ప్లస్ అయింది. యూఎస్ స్టాక్ మార్కెట్‌లో ఒక్కసారిగా ఆ కంపెనీ స్టాక్స్ పైకి ఎగబాకాయి.

జనవరి 7న మెస్సీ తన అసాధారణ డ్రింక్ గురించి చెప్పగా, ఆ తర్వాత మూడు రోజుల్లోనే కోకకోలా స్టాక్స్ 5 శాతం పెరిగాయి. మూడు రోజుల్లో కోకకోలా కంపెనీ స్టాక్స్ మార్కెట్ వాల్యూ 13 బిలియన్ డాలర్లు పెరిగింది.

ఇలా సెలబ్రిటీల వల్ల స్టాక్ మార్కెట్లలో స్టాక్స్ షేక్ అయిన సందర్బాలు చాలా ఉన్నాయి. ఇదివరకు క్రిస్టియానో రొనాల్డో కూడా తను మీడియాతో మాట్లాడుతున్నప్పుడు పక్కనే ఉన్న కోకకోలా కూల్ డ్రింక్‌ను తీసి కింద పెట్టడంతో అప్పుడు ఆ కంపెనీ షేర్ వాల్యూ ఒక్కసారిగా డ్రాప్ అయింది. 4 బిలియన్ డాలర్లు నష్టపోయింది. ఇప్పుడు మళ్లీ అదే కంపెనీ మెస్సీ వల్ల 13 బిలియన్ డాలర్ల సంపదను పెంచుకుంది.

ఇక.. మెస్సీ అరుదైన మిక్స్‌డ్ డ్రింక్‌ను ఆయన అభిమానులు కూడా ట్రై చేస్తున్నారు. మెస్సీ ఫేవరేట్ డ్రింక్‌ని ట్రై చేసి హుమ్.. బాగుంది. మెస్సీ టేస్ట్ పర్లేదు.. మంచి టేస్టే అంటూ నెటిజన్లు ఆ డ్రింక్‌ను టేస్ట్ చేసి రివ్యూలు ఇస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Day Trading (@daytrading)

Advertisement

తాజావార్తలు

Advertisement