FIFA 2026 | రోడ్రీకి గోల్డెన్ బాల్.. మెస్సీకి సిల్వర్ బాల్
FIFA 2026 | ఫిఫా ప్రపంచకప్-2026లో స్పెయిన్‌ను విశ్వవిజేతగా నిలిపిన కెప్టెన్ రోడ్రీకి అత్యున్నత అవార్డు దక్కింది. టోర్నీలో అత్యుత్తమ ఆటగాడిగా ఎంపిక చేస్తూ ఫిఫా గోల్డెన్ బాల్‌ను అందజేసింది. అయితే, ఈ నిర్ణయం మాత్రం ఫుట్‌బాల్ అభిమానుల్లో కొత్త చర్చకు తెరలేపింది. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ ప్రదర్శనకు ఈ అవార్డు దక్కాల్సిందంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
FIFA 2026 | ఫిఫా ప్రపంచకప్-2026లో స్పెయిన్‌ను విశ్వవిజేతగా నిలిపిన కెప్టెన్ రోడ్రీకి అత్యున్నత అవార్డు దక్కింది. టోర్నీలో అత్యుత్తమ ఆటగాడిగా ఎంపిక చేస్తూ ఫిఫా గోల్డెన్ బాల్‌ను అందజేసింది. అయితే, ఈ నిర్ణయం మాత్రం ఫుట్‌బాల్ అభిమానుల్లో కొత్త చర్చకు తెరలేపింది. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ ప్రదర్శనకు ఈ అవార్డు దక్కాల్సిందంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్లో అర్జెంటీనాపై అదనపు సమయంలో 1-0 తేడాతో గెలిచిన స్పెయిన్.. జట్టు విజయంతో పాటు వ్యక్తిగత అవార్డుల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. రోడ్రీ గోల్డెన్ బాల్ అందుకోగా.. స్పెయిన్ గోల్‌కీపర్ ఉనాయ్ సిమోన్ గోల్డెన్ గ్లోవ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. యువ డిఫెండర్ పావు కుబార్సీ టోర్నీ ఉత్తమ యువ ఆటగాడిగా ఎంపికయ్యాడు. మరోవైపు మెస్సీకి సిల్వర్ బాల్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అద్భుతమైన ప్రదర్శనతో అర్జెంటీనాను వరుసగా రెండో ప్రపంచకప్ ఫైనల్‌కు చేర్చిన మెస్సీ.. టోర్నీలో 8 గోల్స్ చేయడంతో పాటు 4 అసిస్టులు నమోదు చేశాడు. అంతేకాదు, ఐదు సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. ఫ్రాన్స్ కెప్టెన్ కైలియన్ ఎంబాపేకు గోల్డెన్ బూట్ దక్కింది. టోర్నీలో 10 గోల్స్ చేసిన అతడు అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. మెస్సీ రెండో స్థానంలో నిలిచి సిల్వర్ బూట్‌ను అందుకున్నాడు.
మెస్సీకా.. రోడ్రీనా? కొనసాగుతున్న చర్చ
రోడ్రీకి గోల్డెన్ బాల్ ప్రకటించిన వెంటనే స్టేడియంలో కొందరు అభిమానులు ‘మెస్సీ.. మెస్సీ’ అంటూ నినాదాలు చేయడం ఈ వివాదానికి మరింత ఊతమిచ్చింది. మెస్సీకి అవార్డు దక్కాల్సిందనే వాదనకు బలమైన కారణాలే ఉన్నాయి. 39 ఏళ్ల వయసులోనూ అతడు అర్జెంటీనా ఎటాకింగ్‌కు కీలకంగా మారాడు. కీలక సమయాల్లో గోల్స్, అసిస్టులతో జట్టును ముందుకు నడిపించాడు. అయితే, రోడ్రీకి అనుకూలంగా పలువురు బలమైన వాదనలు వినిపిస్తున్నారు. స్పెయిన్ టీమ్‌కు అతనే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. మిడ్‌ఫీల్డ్‌లో ఆట వేగాన్ని నియంత్రిస్తూ.. బంతిపై ఆధిపత్యం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మెరుపు గణాంకాలు లేకపోయినా.. జట్టు విజయానికి అతడి ప్రభావం ఎంతో ఉందని ఫిఫా సాంకేతిక బృందం గుర్తించింది. రోడ్రీకి టోర్నీలో ఒకే ఒక్క మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రావడం, ఫైనల్లో విజేత గోల్‌కి ముందే మైదానం వీడడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ కొందరు అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మెస్సీ తన దాడి సామర్థ్యంతో అర్జెంటీనాను మరో ఫైనల్‌కు చేర్చాడని అతడి మద్దతుదారులు చెబుతున్నారు.
ప్రపంచకప్ అవార్డులు ఇలా..
గోల్డెన్ బాల్: రోడ్రీ (స్పెయిన్)
సిల్వర్ బాల్: లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా)
గోల్డెన్ బూట్: కిలియన్ ఎంబాపే (ఫ్రాన్స్) – 10 గోల్స్
సిల్వర్ బూట్: లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా)
గోల్డెన్ గ్లోవ్: ఉనాయ్ సిమోన్ (స్పెయిన్)
బెస్ట్ యంగ్ ప్లేయర్ : పావు కుబార్సీ (స్పెయిన్)

ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Lionel Messi | అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ రిటైర్మెంట్
ఆగస్టు 31, 2026

CM Revanth Reddy | ఆర్టీసీకి రూ.11 వేల కోట్లు చెల్లించాం.. 72 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం: రేవంత్‌రెడ్డి
ఆగస్టు 31, 2026

CM Revanth | ఒకే ఒక్కడు తెలంగాణను రూ.8.11లక్షల కోట్ల అప్పుల్లో ముంచిండు.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్
ఆగస్టు 31, 2026
తాజావార్తలు
- ●Lionel Messi | అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ రిటైర్మెంట్
- ●Harish Rao | రేవంత్ రెడ్డీ.. 'నంది ఎవరో.. పంది ఎవరో..' నీ 1000 రోజుల పాలనే తేటతెల్లం చేస్తోంది
- ●Cheyutha Pensions | చేయూత పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే..?
- ●Bharat Gaurav Award | మాజీ డీజీపీ అంజనీ కుమార్‌కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు
- ●SCR | 17 రైల్వే ప్రాజెక్టులకు డీపీఆర్‌లు.. 2023 కి.మీ. మేర విస్తరణ
- ●OTT | 5 కోట్ల బడ్జెట్ - 130 కోట్ల కలెక్షన్స్ - విజయ్, రష్మిక బ్లాక్‌బస్టర్ మూవీ ... ఓటీటీలో ఫ్రీ స్ట్రీమింగ్

Lionel Messi | అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ రిటైర్మెంట్

Harish Rao | రేవంత్ రెడ్డీ.. 'నంది ఎవరో.. పంది ఎవరో..' నీ 1000 రోజుల పాలనే తేటతెల్లం చేస్తోంది

Cheyutha Pensions | చేయూత పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే..?

Bharat Gaurav Award | మాజీ డీజీపీ అంజనీ కుమార్‌కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు



