Lionel Messi | అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ రిటైర్మెంట్
Lionel Messi | అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అధికారికంగా వెల్లడించారు.
Lionel Messi | త్రినేత్ర.న్యూస్ : అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అధికారికంగా వెల్లడించారు. ఇంటర్నేషనల్ కెరీర్‌కు ముగింపు పలకడం తనను ఎంతో బాధించినప్పటికీ.. రిటైర్మెంట్‌కు సమయం ఆసన్నమైందని తెలిపారు. 2026 ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ చేతిలో ఓటమి పాలైన రెండు రోజులకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

2022లో ఖతార్‌లో జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో అర్జెంటీనాకు కెప్టెన్‌గా వ్యవహరించి కప్ అందించిన మెస్సీ మొత్తం 207 మ్యాచ్‌లలో 125 గోల్స్ సాధించి.. అర్జెంటీనా తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన, అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచారు. తన దేశానికి 2022 ఫిఫా ప్రపంచ కప్, 2021, 2024 రెండు కోపా అమెరికా టైటిళ్లను అందించారు. 2026 ప్రపంచ కప్‌లో ఆయన సారథ్యంలో అర్జెంటీనా రన్నరప్‌గా నిలిచింది. అర్జెంటీనా నేషనల్ టీంలో ఉండడాన్ని ప్రేమిస్తాను.. ప్రేమించాను.. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను అని మెస్సీ పేర్కొన్నారు.

'నేను నా శక్తినంతా ధారపోశాను, నా దగ్గర ఇవ్వడానికి ఇంకేమీ మిగల్లేదు.. నా తరువాత చాలా గొప్ప యువ ఆటగాళ్లు వస్తున్నారు.. వారికి కూడా అవకాశాలు దక్కాలి' అని మెస్సీ అన్నారు.
తాజావార్తలు
- ●BRS Party | అసెంబ్లీ సమావేశాలు.. కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ నెల 6న బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం
- ●Basavaraju Saraiah | ధైర్యముంటే రాండి.. ఇండిపెండెంట్‌గా పోటీ చేద్దాం.. నేన్ రెడీ
- ●Stock Markets | తీవ్ర ఒడిదుడుకుల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సూచీలకు స్వల్ప లాభాలు..
- ●Ashwini Manohar Paul | 100 అడుగుల లోయలోకి దూకి.. ముగ్గురు పిల్లలతో కలిసి మహిళా రెజ్లర్ ఆత్మహత్య
- ●గాంధీ భవన్లో ‘పాత గురుతులు’.. పాలనలో ‘వలస వెలుగులు’: రేవంత్ మార్క్ కాంగ్రెస్‌లో అసలు కేడర్ ప్రశ్న!
- ●Anasuya | వివాదానికి వెరైటీగా పుల్‌స్టాప్ - అనసూయ కృష్ణాష్టమి డ్యాన్స్ వీడియో వైరల్

BRS Party | అసెంబ్లీ సమావేశాలు.. కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ నెల 6న బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం

Basavaraju Saraiah | ధైర్యముంటే రాండి.. ఇండిపెండెంట్‌గా పోటీ చేద్దాం.. నేన్ రెడీ

Stock Markets | తీవ్ర ఒడిదుడుకుల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సూచీలకు స్వల్ప లాభాలు..

Ashwini Manohar Paul | 100 అడుగుల లోయలోకి దూకి.. ముగ్గురు పిల్లలతో కలిసి మహిళా రెజ్లర్ ఆత్మహత్య






