World Cup Final | ఓటమి తట్టుకోలేక స్పెయిన్ స్టార్‌పై అర్జెంటీనా ఆటగాడి దాడి.. వైరల్ వీడియో
World Cup Final | ఫిఫా ప్రపంచకప్-2026 ఫైనల్ ముగిసిన వెంటనే మైదానంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. విశ్వవిజేతగా అవతరించిన స్పెయిన్ ఆటగాళ్లు ఆనందోత్సాహాల్లో మునిగితేలుతుండగా.. ఓటమిని జీర్ణించుకోలేకపోయిన అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ లియాండ్రో పరేడెస్ ఆగ్రహంతో ప్రత్యర్థి ఆటగాళ్లపైకి దూసుకెళ్లాడు. క్షణాల్లోనే వాగ్వాదం కాస్త బాహాబాహీగా మారడంతో మైదానంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
World Cup Final | ఫిఫా ప్రపంచకప్-2026 ఫైనల్ ముగిసిన వెంటనే మైదానంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. విశ్వవిజేతగా అవతరించిన స్పెయిన్ ఆటగాళ్లు ఆనందోత్సాహాల్లో మునిగితేలుతుండగా.. ఓటమిని జీర్ణించుకోలేకపోయిన అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ లియాండ్రో పరేడెస్ ఆగ్రహంతో ప్రత్యర్థి ఆటగాళ్లపైకి దూసుకెళ్లాడు. క్షణాల్లోనే వాగ్వాదం కాస్త బాహాబాహీగా మారడంతో మైదానంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘర్షణ క్రీడా ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. తుది విజిల్ పడిన వెంటనే స్పెయిన్ డిఫెండర్ ఎరిక్ గార్సియా విజయ సంబరాల్లో పాల్గొంటుండగా పరేడెస్ అతడిని నిలదీశాడు. మాటామాటా పెరగడంతో గార్సియాపై రెండుసార్లు పిడిగుద్దులు విసిరినట్లు టీవీ కెమెరాల్లో నమోదైంది. పరిస్థితిని చల్లార్చేందుకు గావి మధ్యలోకి రావడంతో పరేడెస్ అతడిపైనా చేయి చేసుకున్నాడు. అర్జెంటీనా ఆటగాడు థియాగో అల్మాడా అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. పరేడెస్ చేయి గావి ముఖానికి తగిలింది. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. పరిస్థితి అదుపు తప్పకుండా అర్జెంటీనా ప్రధాన కోచ్ లియోనెల్ స్కలోనీ వెంటనే జోక్యం చేసుకుని తన ఆటగాళ్లను వెనక్కి తీసుకెళ్లాడు. అనంతరం రిఫరీ పరేడెస్‌కు రెడ్‌కార్డు చూపించి మైదానం నుంచి పంపించాడు.

స్పెయిన్‌దే చరిత్ర..
ఈ ఘర్షణకు కొద్ది నిమిషాల ముందే స్పెయిన్ చారిత్రక విజయాన్ని అందుకుంది. అదనపు సమయం 106వ నిమిషంలో ప్రత్యామ్నాయ ఆటగాడు ఫెర్రాన్ టొరెస్ చేసిన ఏకైక గోల్‌తో అర్జెంటీనాపై 1-0 తేడాతో విజయం సాధించి రెండోసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్ మొత్తం స్పెయిన్ ఆధిపత్యమే కొనసాగింది. 20 షాట్లు నమోదు చేసిన స్పానిష్ జట్టు.. అర్జెంటీనాకు చివరి దశ వరకు ఒక్క అవకాశమూ ఇవ్వలేదు. నిర్ణీత సమయం ముగిసే వేళ ఎంజో ఫెర్నాండెజ్ రెండో ఎల్లో కార్డు కారణంగా మైదానం వీడడంతో అర్జెంటీనా పది మందికే పరిమితమైంది. ఈ విజయంతో టోర్నీ మొత్తం కేవలం ఒక్క గోల్ మాత్రమే చేసి ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా స్పెయిన్ చరిత్ర సృష్టించింది. అంతేకాదు, యూరో కప్, ప్రపంచకప్‌లను వరుసగా రెండుసార్లు కైవసం చేసుకున్న ఏకైక దేశంగా మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. మరోవైపు ఈ ఓటమితో అర్జెంటీనా జైత్రయాత్రకు తెరపడింది. 2021, 2024 కోపా అమెరికా టైటిళ్లు, 2022 ప్రపంచకప్ విజయాల తర్వాత మరోసారి విశ్వవిజేతగా నిలవాలన్న మెస్సీ కల కూడా చెదిరిపోయింది.

🚨 Gavi and Leandro Paredes clash after the final whistle of Spain vs Argentina.
pic.twitter.com/mU1H32Dyex— Sports on Predict (@sportsonpredict) July 19, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!
- ●BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!
- ●Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!

Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!

Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!





