Bengaluru Traffic | బెంగళూరు ట్రాఫిక్ వల్ల ఆరోగ్యవంతుడిని అయ్యా.. టెకీ పోస్టు వైరల్
మనోడి పోస్టుకి మిశ్రమ స్పందన వచ్చింది. ఆఫీసుకి వెళ్లడం వల్లనే మేము ఫిట్‌గా ఉన్నాం బ్రో అంటూ కొందరు కామెంట్లు చేశారు. నేను నా బైక్ అమ్మేసి ఎక్కడికైనా నడుస్తూనే వెళ్తున్నా. దాని వల్ల నేను ప్రత్యేకంగా ఫిట్‌నెస్ కోసం జిమ్‌కి వెళ్లాల్సిన పనిలేదని మరో యూజర్ స్పందించాడు.
Viral news | Published On Jan 23, 2026, 6.13 pm IST
Bengaluru Traffic | మెట్రో నగరాల్లో ఉన్న అతి పెద్ద సమస్య ట్రాఫిక్. అక్కడ ఉండే అవకాశాల విషయం పక్కన పెడితే.. ట్రాఫిక్ వల్ల వాహనదారులు మాత్రం నరకయాతన అనుభవిస్తుంటారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి మెట్రోల్లో ఇదే పరిస్థితి. బెంగళూరు ట్రాఫిక్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఐటీ హబ్‌గా పేరుగాంచిన బెంగళూరులో ఉదయం ఆఫీసు టైమ్‌కి రోడ్డెక్కితే ఏ రెండు మూడు గంటలకో కానీ ఉద్యోగులు ఆఫీసులకు చేరుకోరు. ఇరుకు రోడ్లు, బెటర్ ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల ఉద్యోగులు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకోకతప్పదు. ఉద్యోగం మాటేమో కానీ.. ట్రాఫిక్‌లోనే సగం రోజు గడిచిపోయే సందర్భాలు కూడా ఉంటాయి. అయితే.. ఈ ట్రాఫిక్ వల్ల బాధలు పడ్డ వాళ్లే కానీ.. ట్రాఫిక్ వల్ల ఇసుమంత లాభం పొందిన వాళ్లు ఎవరు ఉంటారు అని మనం అనుకుంటాం కానీ.. ఆ బెంగళూరు ట్రాఫిక్ వల్ల లాభపడిన వ్యక్తి మాత్రం ఒకరున్నారు. బెంగళూరు ట్రాఫిక్ వల్ల తాను ఆరోగ్యవంతుడిని అయ్యానని ఓ టెకీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఆ పోస్టు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
అలా ఎలా?
అలా ఎలా ఆరోగ్యవంతుడయ్యాడు.. అని ఆశ్చర్యపోతున్నారా? అయితే మనోడి పోస్టు ఏంటో పూర్తిగా చదవాల్సిందే. రోజూ వైట్ ఫీల్డ్ నుంచి కోరమంగళకి వెళ్తూ ఉండేవాడిని. ఎలాంటి ట్రాఫిక్ లేకుంటే 90 నిమిషాల్లో వెళ్లొచ్చు. ట్రాఫిక్ ఉంటే ఇక చెప్పాల్సిన పని లేదు. ట్రాఫిక్ వల్ల సరిగ్గా ఆఫీసుకు చేరుకునేవాడిని కాదు. డెస్క్ దగ్గరే తినడం, జంక్ ఫుడ్ తినడం అలవాటు అయింది. ఫిట్‌నెస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. కానీ.. గత సంవత్సరం నేను హైబ్రిడ్ మోడ్‌కి షిఫ్ట్ అయ్యా. వారంలో మూడు రోజులు ఇంటి దగ్గర్నుంచే పని. జిమ్ కూడా నా రూమ్‌కి దగ్గరే. ఉదయమే 6 గంటలకు జిమ్‌కి వెళ్లి ఫిట్‌నెస్‌ని పెంచుకున్నా. స్విగ్గీని పక్కన పెట్టేసి నాకు దగ్గరలో ఉన్న రెస్టారెంట్లకు నడుచుకుంటూ వెళ్తున్నా. ట్రాఫిక్ అలాగే ఉంది కానీ.. నేను ఫిట్ అయ్యా. నేను 25 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కూడా ఇంత ఫిట్‌గా లేను. నా హార్ట్ రేట్ 82 నుంచి 64కి తగ్గింది. ఎలాంటి ప్రయత్నం చేయకుండానే 8 కిలోలు తగ్గాను. ఇది కేవలం బెంగళూరు ట్రాఫిక్ వల్లనే సాధ్యం అయింది. నాలా ఎవరికైనా జరిగిందా? అంటూ రెడిట్‌లో పోస్ట్ పెట్టాడు ఆ టెకీ.
మనోడి పోస్టుకి మిశ్రమ స్పందన వచ్చింది. ఆఫీసుకి వెళ్లడం వల్లనే మేము ఫిట్‌గా ఉన్నాం బ్రో అంటూ కొందరు కామెంట్లు చేశారు. నేను నా బైక్ అమ్మేసి ఎక్కడికైనా నడుస్తూనే వెళ్తున్నా. దాని వల్ల నేను ప్రత్యేకంగా ఫిట్‌నెస్ కోసం జిమ్‌కి వెళ్లాల్సిన పనిలేదని మరో యూజర్ స్పందించాడు.
తాజావార్తలు
- ●Illegal E-Cigarettes Hyderabad | బంజారాహిల్స్‌లో ఈ-సిగరెట్లు, నిషేధిత విదేశీ సిగరెట్ల దందా.. తక్కువ ధరకు తెచ్చి, సిటీలో భారీ రేట్లకు విక్రయం
- ●UPI | పొరపాటున వేరే వ్యక్తికి యూపీఐ ద్వారా డబ్బు పంపారా? ఇలా చేస్తే తిరిగి పొందవచ్చు..
- ●CEIR | మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు అందజేసిన అత్తాపూర్ పోలీసులు
- ●Gold Prices | ఆగస్టులో మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు.. ఇంకా పెరుగుతాయా, తగ్గుతాయా..?
- ●Cabinet Decisions | రూ. 9,450 కోట్ల భారీ రైల్వే విస్తరణ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం.. ఏపీకి దక్కిన ప్రాధాన్యం
- ●Ramchandar Rao | ఆయుష్ వైద్య విద్యార్థులకు స్టైపెండ్ చెల్లించాలి.. 16 రోజులుగా దీక్షలు చేస్తున్నా పట్టించుకోరా?

Illegal E-Cigarettes Hyderabad | బంజారాహిల్స్‌లో ఈ-సిగరెట్లు, నిషేధిత విదేశీ సిగరెట్ల దందా.. తక్కువ ధరకు తెచ్చి, సిటీలో భారీ రేట్లకు విక్రయం

UPI | పొరపాటున వేరే వ్యక్తికి యూపీఐ ద్వారా డబ్బు పంపారా? ఇలా చేస్తే తిరిగి పొందవచ్చు..

CEIR | మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు అందజేసిన అత్తాపూర్ పోలీసులు

Gold Prices | ఆగస్టులో మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు.. ఇంకా పెరుగుతాయా, తగ్గుతాయా..?






