Viral Video | బైక్‌పై ఐదుగురు యువకులు ఎక్కి నడిరోడ్డుపై స్టంట్.. 31 వేల ఫైన్ వేసిన పోలీసులు
నడిరోడ్డుపై ఇలాంటి స్టంట్లు చేస్తూ చాలామంది ఈ మధ్య వైరల్ అవుతున్నారు. కావాలని సోషల్ మీడియాలో వైరల్ అవడం కోసం, రీల్స్ కోసం యువత ఎక్కువగా ఇలాంటి డేంజరస్ స్టంట్స్ చేయడం పరిపాటిగా మారింది.
Viral news | Published On Dec 24, 2025, 3.55 pm IST
Viral Video | ఒకరు కాదు ఇద్దరు కాదు.. బైక్‌పై ఏకంగా ఐదుగురు యువకులు ఎక్కి స్టంట్ చేయడం మొదలు పెట్టారు. నడిరోడ్డుపై ట్రాఫిక్ ఉన్నా ఏమాత్రం లెక్క చేయకుండా వాళ్లు చేసిన డేంజరస్ స్టంట్స్‌కి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. చివరకు రూ.31 వేల ఫైన్ కట్టాల్సి వచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో చోటు చేసుకుంది.
నేషనల్ హైవే 9 మీద ఒక్క బైక్ మీద ఐదుగురు యువకులు ప్రయాణిస్తున్నారు. అందులో ఒక యువకుడు అయితే బైక్‌కి లెఫ్ట్ సైడ్ నిలబడి ఉన్నాడు. చెప్పాలంటే ఇది డేంజరస్ స్టంట్. ఆ బైక్ వెనుక వెళ్తున్న ఓ వాహనదారుడు వాళ్ల డేంజరస్ స్టంట్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో ట్రాఫిక్ పోలీసుల కంట పడటంతో వెంటనే బైక్ నెంబర్ ఆధారంగా ఆ బైక్ ఓనర్ ఎవరో తెలుసుకొని రూ.31 వేల ఫైన్ వేశారు.
నడిరోడ్డుపై ఇలాంటి స్టంట్లు చేస్తూ చాలామంది ఈ మధ్య వైరల్ అవుతున్నారు. కావాలని సోషల్ మీడియాలో వైరల్ అవడం కోసం, రీల్స్ కోసం యువత ఎక్కువగా ఇలాంటి డేంజరస్ స్టంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఇలాంటి స్టంట్స్ చేసేవాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసి జైలు శిక్ష కూడా విధించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
View this post on Instagram
తాజావార్తలు
- ●Minister Tummala | మోదీ జీ సమయం ఇవ్వండి.. అపాయింట్మెంట్ ఇవ్వాలని మంత్రి తుమ్మల రిక్వెస్ట్..!
- ●Minister Tummala | సీతమ్మసాగర్కు సుప్రీం ‘లైన్ క్లియర్’.. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు ఊరట
- ●Garuda Seva | గరుడ వాహనంపై వివహరించిన తిరుమలేశుడు..!
- ●Ashika Ranganath | మెగాస్టార్ సినిమాలో అవకాశం.. ఆషిక ఆశలన్నీ ‘విశ్వంభర’పైనే!
- ●Bonalu | న్యూయార్క్‌లో మార్మోగిన తెలంగాణ బోనాల సందడి
- ●TG Police Jobs | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది..!

Minister Tummala | మోదీ జీ సమయం ఇవ్వండి.. అపాయింట్మెంట్ ఇవ్వాలని మంత్రి తుమ్మల రిక్వెస్ట్..!

Minister Tummala | సీతమ్మసాగర్కు సుప్రీం ‘లైన్ క్లియర్’.. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు ఊరట

Garuda Seva | గరుడ వాహనంపై వివహరించిన తిరుమలేశుడు..!

Ashika Ranganath | మెగాస్టార్ సినిమాలో అవకాశం.. ఆషిక ఆశలన్నీ ‘విశ్వంభర’పైనే!






