త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Europe Countries | తక్కువ ఖర్చులోనే ఈ యూరప్ దేశాలను చుట్టేయొచ్చు

Europe Countries | యూరప్ ట్రిప్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. అందుకే ఆ దేశాల పర్యటనకు వెళ్లేందుకు చాలామంది వెనుకాడుతుంటారు. కానీ యూరప్‌లోని కొన్ని దేశాలను మాత్రం తక్కువ బడ్జెట్‌లోనే చూసి రావచ్చు.

S

Tourism | Published On Dec 30, 2025, 8.15 am IST

Europe Countries | తక్కువ ఖర్చులోనే ఈ యూరప్ దేశాలను చుట్టేయొచ్చు
Advertisement

Europe Countries | యూరప్ ట్రిప్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. అందుకే ఆ దేశాల పర్యటనకు వెళ్లేందుకు చాలామంది వెనుకాడుతుంటారు. కానీ యూరప్‌లోని కొన్ని దేశాలను మాత్రం తక్కువ బడ్జెట్‌లోనే చూసి రావచ్చు. అలా అని ఆ దేశాలు ఏమీ తీసిపోయినట్టుగా కూడా ఉండవు. యూరప్ దేశాల్లో కనిపించే ప్రకృతి అందాలు, సంస్కృతి అన్ని కూడా ఈ దేశాల్లోనూ ప్రతిబింబిస్తాయి. మరి ఆ దేశాలేంటి? వాటి విశిష్టత ఏంటో ఇప్పుడు చూద్దాం..

హంగేరీ

హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో పర్యటన తక్కువ ఖర్చులో అద్భుతమైనథ్రిల్‌ను పంచుతుంది. డాన్యూబ్ నది ఒడ్డున నిర్మించిన పార్లమెంట్ భవనం, ఫిషర్‌మెన్స్ బాస్టియన్, బుడా క్యాస్టిల్ (కోట) వంటి అద్భుతమైన నిర్మాణాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన థర్మల్ బాత్‌ల్లో సేదతీరడం, రివర్ క్రూజ్‌లు, స్థానిక వంటకాలు వీటన్నింటికీ కూడా తక్కువ ఖర్చులోనే ఆస్వాదించవచ్చు. ప్రజా రవాణా సదుపాయం సమర్థవంతంగా ఉండటం వల్ల నగరమంతా ఈజీగా చుట్టేయొచ్చు. బుడాపెస్ట్ శివారులోని గ్రామీణ ప్రాంతాలు, అందమైన పట్టణాలు కూడా రమణీయంగా కనిపిస్తాయి.

డిసెంబర్ నెలలో బుడాపెస్ట్‌కు తక్కువ ధరలో టికెట్లు దొరుకుతాయని స్కైస్కానర్ సంస్థ తెలుపుతోంది. కనెక్టింగ్ ఫ్లైట్ ధర సుమారు రూ.16 వేల వరకు ఉంటుందని అంచనా.

రొమేనియా

తక్కువ ఖర్చులో విభిన్న అనుభూతిని ఇచ్చే దేశాల్లో రొమేనియా ఒకటి. ఈ దేశ రాజధాని బుచారెస్ట్‌లో అద్భుతమైన శిల్పకళతో ఆకట్టుకుంటాయి. ఇక ట్రాన్స్‌సిల్వేనియా ప్రాంతంలోని బ్రాసోవ్, సిబియూ వంటి పట్టణాలు మధ్యయుగం నాటి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపిస్తాయి. డ్రాకులా కథలతో పాపులర్ అయిన బ్రాన్ కోట పర్యాటకులను ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కార్పాతియన్ పర్వతాలు, పురాతన పట్టణాల మీదుగా ట్రాన్స్‌ఫగరాసన్ హైవేపై ప్రయాణం మరుపురాని అనుభూతిని కల్పిస్తాయి. ఇక ఫుడ్, హోటల్స్, టూర్స్ అన్ని తక్కువ బడ్జెట్‌లోనే లభిస్తాయి.

రొమేనియాకు మార్చిలో తక్కువ ధరలో విమాన టికెట్లు లభిస్తాయి. కనెక్టింగ్ ఫ్లైట్ ధర రూ.19,963 వరకు ఉంటుందని అంచనా.

జార్జియా

ఇటీవల భారతీయులకు ఫేవరేట్‌గా మారిన యూరప్ దేశాల్లో జార్జియా ఒకటి. జార్జియా రాజధాని టిబిలిసిలోని వీధులు, రంగురంగుల బాల్కనీలు, పురాతన, ఆధునిక శైలి కలగలిసి ఆకట్టుకుంటాయి. జార్జియాలో ఫేమస్ అయిన ఖాచపురి, ఖింకాలి వంటి వంటకాలు కూడా తక్కువ ధరకే లభిస్తాయి. కజ్‌బెగి పర్వతాలు, కాఖేటి ద్రాక్ష తోటలు, బుటుమి బ్లాక్ సీ తీర ప్రాంతం ఇలా ప్రతీది ప్రత్యేక అనుభూతిని కలిపిస్తాయి.

జార్జియా వెళ్లాలని అనుకునే వారు ఏప్రిల్‌లో ప్లాన్ చేసుకుంటే బెటర్. ఆ సమయంలో టిబిలిసీకి కనెక్టింగ్ ఫ్లైట్ ధర సుమారు రూ.26,454 వరకు ఉంటుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement