Europe Trip | కేవలం రూ.50వేల బడ్జెట్ ఉంటే చాలు.. యూరప్‌ను చుట్టి రావచ్చు..
Europe Trip | యూరప్ ఖండం.. విభిన్న అనుభవాల సమాహారం. సూర్యరశ్మితో మెరిసే బీచ్‌లు, చారిత్రక నగరాలు, అద్భుత పర్వతాలు, గ్రామీణ అందాలు అన్నీ ఒకే ఖండంలో కనువిందు చేస్తాయి. అయితే యూరప్ ప్రయాణం ఖరీదైనదిగా భావిస్తారు. కానీ సరైన ప్రదేశాలను ఎంచుకుంటే తక్కువ బడ్జెట్‌తో కూడా యూరప్‌ను చుట్టి రావచ్చు.
Europe Trip | యూరప్ ఖండం.. విభిన్న అనుభవాల సమాహారం. సూర్యరశ్మితో మెరిసే బీచ్‌లు, చారిత్రక నగరాలు, అద్భుత పర్వతాలు, గ్రామీణ అందాలు అన్నీ ఒకే ఖండంలో కనువిందు చేస్తాయి. అయితే యూరప్ ప్రయాణం ఖరీదైనదిగా భావిస్తారు. కానీ సరైన ప్రదేశాలను ఎంచుకుంటే తక్కువ బడ్జెట్‌తో కూడా యూరప్‌ను చుట్టి రావచ్చు. మీ వద్ద సుమారు రూ.50వేల బడ్జెట్ ఉంటే 7 రోజుల ట్రిప్ కోసం అనువైన కొన్ని దేశాలు ఉన్నాయి.
రొమేనియా..

రొమేనియా చాలా మంది పర్యాటకులు పట్టించుకోని హిడెన్ జెమ్. ఇక్కడ అందమైన మఠాలు, బలమైన రాతి చర్చిలు, అద్భుత ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. తక్కువ ఖర్చుతో ఈ దేశాన్ని సులభంగా అన్వేషించవచ్చు. ఆహారం, వసతి ఖర్చులు తక్కువగా ఉంటాయి. హోటల్ ఖర్చు రోజుకు రూ.1,500 నుంచి రూ.2,500 మధ్య ఉంటుంది.
పోర్చుగల్..

పోర్చుగల్ ఇటీవల సర్ఫింగ్ బీచ్‌లు, అందమైన గ్రామాలు, రుచికరమైన పేస్ట్రీలతో పాపులర్ అయింది. లిస్బన్ నగర కేంద్రంలో ధరలు పెరిగినప్పటికీ, దేశంలోని ఇతర ప్రాంతాలు ఇంకా బడ్జెట్‌కు అనుకూలంగా ఉన్నాయి. హోటల్ ఖర్చు రోజుకు రూ.1,500 నుంచి రూ.2,500 వరకు ఉంటుంది.
స్లోవేనియా..

హంగరీ, ఇటలీ, ఆస్ట్రియా దేశాలకు సమీపంలో ఉన్న చిన్న దేశం స్లోవేనియా. పర్వతాలు, అడవులు, ప్రకృతి అందాలతో ఇది ప్రసిద్ధి చెందింది. బడ్జెట్ ట్రావెలర్లకు ఇది మంచి ఎంపిక. హోటల్ ఖర్చు రోజుకి రూ.3,200 నుంచి రూ.5,500 వరకు ఉంటుంది.
స్లోవేకియా..

స్లోవేకియా అద్భుతమైన కోటలు, పర్వతాలు, బ్రాటిస్లావా నగరంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఆహారం, వసతి ఖర్చులు తక్కువగా ఉంటాయి. రోజువారీ ఆహారం ఖర్చు సుమారు రూ.2వేలు కాగా, హోటల్ ఖర్చు రూ.3,500 నుంచి రూ.4,500 వరకు ఉంటుంది.
గ్రీస్..

గ్రీస్ ఖరీదైన దేశంగా భావించినప్పటికీ, సరైన ప్రదేశాలను ఎంచుకుంటే తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయవచ్చు. మైకోనోస్ వంటి ఖరీదైన ప్రదేశాల బదులు టైనోస్ ద్వీపాన్ని ఎంచుకోవచ్చు. ఇక్కడ అందమైన బీచ్‌లు, మార్బుల్ గ్రామాలు, మంచి వసతి సౌకర్యాలు ఉంటాయి. ఆహారం సుమారు రూ.1,500 కాగా, హోటల్ ఖర్చు రోజుకు రూ.3,200 నుంచి రూ.5,500 వరకు ఉంటుంది.
తక్కువ బడ్జెట్‌తో యూరప్ ట్రిప్ అసాధ్యం అని చాలా మంది భావిస్తారు. కానీ సరైన ప్రణాళిక, సరైన ప్రదేశాల ఎంపికతో రూ.50వేల బడ్జెట్‌లోనే యూరప్ అందాలను ఆస్వాదించవచ్చు. ఖర్చులను నియంత్రిస్తూ, అనుభవాలను పెంచుకునేలా ప్రయాణాన్ని ప్లాన్ చేస్తే, ఇది జీవితాంతం గుర్తుండే ప్రయాణంగా మారుతుంది.
సంబంధిత వార్తలు

Nepal Floods | వరదలకు కలుషితమైన నీరు.. నేపాల్ బాధితులను వెంటాడుతున్న అంటు వ్యాధుల ముప్పు
సెప్టెంబర్ 5, 2026

Indians Recruited In Russian Army | రష్యా సైన్యంలో చేరిన 51 మంది భారతీయులు మృతి.. వెల్లడించిన కేంద్రం
సెప్టెంబర్ 1, 2026

Minister Jupally Krishna Rao | శ్రీలంక – తెలంగాణ మధ్య పర్యాటక బంధానికి మరింత ఊతం
ఆగస్టు 26, 2026
తాజావార్తలు
- ●UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?
- ●T20 Cricket | స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో చరిత్ర
- ●Kavitha | రాజకీయం అంటే బూతులేనా..? కోస్గి సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్..
- ●Maithili Thakur | రోల్స్ రాయిస్‌లో ఎమ్మెల్యే.. ట్రోలింగ్‌పై కంగనా ఫైర్..
- ●Ukraine Biggest Attack | మాస్కోపై 1,600కుపైగా డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్..!
- ●Delhi SIR | ఎస్ఐఆర్లో ప్రముఖులకూ షాక్.. అద్వానీ, కేజ్రీవాల్ సహా పలువురికి నోటీసులు..!

UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?

T20 Cricket | స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో చరిత్ర

Kavitha | రాజకీయం అంటే బూతులేనా..? కోస్గి సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్..

Maithili Thakur | రోల్స్ రాయిస్‌లో ఎమ్మెల్యే.. ట్రోలింగ్‌పై కంగనా ఫైర్..



